భారత్‌లో సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మిలియనీర్లకు సంబంధించి భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మన దేశంలో 2,19,000 మంది దాదాపు 877 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన సంపదను కలిగి
భారత్‌లో సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మిలియనీర్లకు సంబంధించి భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మన దేశంలో 2,19,000 మంది దాదాపు 877 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన సంపదను కలిగి ఉన్నట్టు తాజా నివేదికలో వెల్లడైంది. మంగళవారం క్యాపిజెమినీ విడుదల చేసిన 'ఆసియా పసిఫిక్ సంపద నివేదిక-2017'(ఏపీడబ్లూఆర్)లో ఈ వివరాలు వెలుగు చూశాయి. 2016 అంతానికి 28,91,000 మంది మిలియనీర్లతో జపాన్ మొదటి స్థానంలోను, 11,29,000 మంది మిలియనీర్లతో చైనా రెండో స్థానంలోను 2,55,000 మిలియనీర్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలోను ఉన్నాయి. భారత్‌లో టాప్30 సంపన్నుల జాబితా ఇదే
అత్యధిక నికర ఆస్తుల విలువ(హెచ్ఎన్‌డబ్ల్యూఐ)
ఒక మిలియన్ అమెరికన్ డాలర్లకు మించి సంపదను కలిగిన వారిని హచ్‌ఎన్‌డబ్లుఐ (అత్యధిక నికర విలువ ఆస్తులున్నవారు)గా పేర్కొంటారు. 2015-16 మధ్య హెచ్‌ఎన్‌డబ్ల్యుఐ జనాభా భారత్‌లో 9.5 శాతం ఉంది. అదే కాలంలో ఆ వృద్ధి చైనాలో 9.1గా, జపాన్‌లో 6.3 శాతంగా ఉంది. 2016లో హెచ్‌ఎన్‌డబ్ల్యుఐ సంపద వృద్ధి భారత్‌లో రెండంకెలకు చేరుకుంది. ఈక్విటీ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగం వల్ల భారత్‌లో కొందరు స్వల్పకాలంలోనే సంపదను పెంచుకున్నారు. 2017లో వలే 2018లోనూ స్థూల జాతీయోత్పత్తి ఆశాజనకంగా ఉన్నందన ఆర్థిక వృద్థి మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. ప్రధాని మోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దు వంటి ఆర్థిక సంస్కరణలు తమకు మేలు చేస్తాయని పెట్టుబడిదారులు నమ్మకంగానే ఉన్నారు. అయితే, పన్నుల విధానం, నిరుద్యోగం వంటి సమస్యలు పెట్టుబడిదారుల్లో కొంత వణుకు పుట్టించాయి. హెచ్‌ఎన్‌డబ్ల్యుఐ విషయంలో ప్రపంచం మొత్తమీద ఇప్పటికీ ఆసియా పసిఫిక్ ప్రాంతం మార్గదర్శిగానే ఉంది. 2016లో ఈ ప్రాంతంలో జనాభా, సంపద వృద్ధి రేటు 7.4 శాతంగా, 8.2 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications