For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ. 2 లక్ష‌ల వ‌ర‌కూ రైతుల స‌రుకుల అమ్మ‌కాల‌కు పాన్ అవ‌స‌రం లేదు

నోట్ల ర‌ద్దు తర్వాత న‌గ‌దు లావాదేవీల‌ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం చాలా చ‌ర్య‌లు తీసుకుంది. ఇందులో భాగంగా చాలా చోట్ల గుర్తింపు వివ‌రాలు ఉంటేనే క్ర‌య‌విక్ర‌యాలు జ‌రిగే విధంగా వివిధ మంత్రిత్వ శాఖ‌లు నిబ

|

నోట్ల ర‌ద్దు తర్వాత న‌గ‌దు లావాదేవీల‌ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం చాలా చ‌ర్య‌లు తీసుకుంది. ఇందులో భాగంగా చాలా చోట్ల గుర్తింపు వివ‌రాలు ఉంటేనే క్ర‌య‌విక్ర‌యాలు జ‌రిగే విధంగా వివిధ మంత్రిత్వ శాఖ‌లు నిబంధ‌న‌లు రూపొందించాయి. అయితే ఈ విధ‌మైన నిబంధ‌నల కార‌ణంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు స్వ‌ల్ప ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి రూ.2 ల‌క్ష‌ల కంటే త‌క్కువ రైతులు చేసే అమ్మ‌కాల‌కు పాన్ అవ‌స‌రం ఉందా అనే విన‌తులు కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు(సీబీడీటీ)కు అందాయి. ఈ విష‌య‌మై సీబీడీటీ శుక్ర‌వారం స్ప‌ష్ట‌త ఇచ్చింది. రోజుకు రూ.2 ల‌క్ష‌ల లోపు చేసే న‌గ‌దు విక్ర‌యాల‌కు రైతుల‌కు పాన్ వివ‌రాలు తెలిపే అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

 రైతుల స‌ర‌కు అమ్మ‌కాల‌కు పాన్ అవ‌స‌రం లేదు

ప్ర‌స్తుతం ఆదాయపు ప‌న్ను చ‌ట్టం-1961లో మార్చిన నిబంధ‌న‌ల మేర‌కు వ్య‌వ‌సాయదారులు, కౌలుదారులు సైతం త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్మాలంటే పాన్ వివ‌రాలు ఇవ్వాల్సి ఉంద‌ని వివిధ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు దీనిపై అంద‌రికీ స్ప‌ష్ట‌త వచ్చినట్ల‌యింది. ఒక రోజులో రైతు అమ్మే స‌ర‌కు రూ.2 ల‌క్ష‌ల లోపు ఉంటే పాన్ సంఖ్య తెల‌పాల్సిన అవ‌స‌రం లేదు. అదే విధంగా కౌలుదారులు సైతం పాన్ లేదా ఫారం 60 ఇచ్చే అవ‌స‌రం లేద‌ని సీబీడీటీ, రెవెన్యూ శాఖ స్ప‌ష్ట‌తనిచ్చాయి.

Read more about: pan farmers
English summary

రూ. 2 లక్ష‌ల వ‌ర‌కూ రైతుల స‌రుకుల అమ్మ‌కాల‌కు పాన్ అవ‌స‌రం లేదు | No need of pan upto 2 lakh value sales for agriculturists

he revenue department on Friday said that the farmers do not need to quote PAN for cash sale of their produce up to Rs 2 lakh a day.
Story first published: Sunday, November 5, 2017, 14:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X