ఎయిర్‌టెల్, వోడాఫోన్, జియోలలో ఏ ప్లాన్ బెటర్‌గా ఉంది?
ఇక్కడ నాలుగు ప్రధాన టెలికాం సంస్థలకు చెందిన ఉత్తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల వివరాలు ఇస్తున్నాం. అన్ని పోల్చుకుని మీకు మంచిది అనిపించిన దాని వైపు మొగ్గుచూపండి.
ఉత్తమ 4జీ ప్లాన్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం
ఈ మధ్య రిలయన్స్ జియో 3 నెలల ఉచిత ప్లాన్లను పక్కనపెట్టి ప్లాన్ టారిఫ్‌లను, వాలిడిటీ గడువులను మార్చేసింది. దీంతో మళ్లీ టారిఫ్‌ల మార్పునకు టెలికాం కంపెనీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. దీంతో జియో వర్సెస్ ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా సెల్యూలార్ లాగా టెలికాం రంగ తీరు మారింది. కస్టమర్లకేమో 1జీబీ డేటా ప్లాన్లకు సంబంధించి వోడాపోన్, ఎయిర్టెల్, ఐడియా ఏది బాగుంటుందనే తికమక మొదలైంది. జియో విషయానికి వస్తే 9 ప్రీపెయిడ్ ప్లాన్లు, 5 పోస్ట్ పెయిడ్ ప్లాన్ల నుంచి మనకు అనువైన దాన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ నాలుగు ప్రధాన టెలికాం సంస్థలకు చెందిన ఉత్తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల వివరాలు ఇస్తున్నాం. అన్ని పోల్చుకుని మీకు మంచిది అనిపించిన దాని వైపు మొగ్గుచూపండి.

రిలయన్స్ జియో రీచార్జీ
రిలయన్స్ జియోలో మధ్య తరగతి వారికి పనికొచ్చేలా రూ.309, రూ.399, రూ.499, రూ.509 ఇలా గరిష్టంగా రూ.9999 ఖరీదు చేసే ప్లాన్లు ఉన్నాయి. అయితే ఎక్కువ ఆదరణ పొందిన ప్లాన్ రూ.399.
ఈ రూ.399 ప్లాన్ కింద ఇంతకుముందు 84రోజులు ఉన్న వాలిడిటీని తగ్గించారు. ప్రస్తుతం రూ.399 ప్లాన్ ప్రకారం 70 రోజుల పాటు ప్రతి రోజూ 1జీబీ డేటా ఉచితంగా వస్తుంది.
అదే మీకు ఎక్కువ రోజులు వాలిడిటీ కావాలనుకుంటే రూ.459 ప్లాన్ కింద 84 రోజుల వాలిడిటీ(రోజూ-1జీబీ డేటా)

ఎయిర్‌టెల్ రీచార్జీ ప్లాన్లు
4జీ ఫోన్ కలిగిన వారికి ఎయిర్టెల్ సైతం ఉత్తమ 4జీ ఆఫర్‌ను అందిస్తోంది.
రూ.399 ప్లాన్ కింద ప్రతి రోజూ 1జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తున్నది. కస్టమర్ ఫీడ్ బ్యాక్ ప్రకారం ఎయిర్టెల్ కాల్స్ విషయంలో జియో కంటే కొద్దిగా బెటర్. ఒకవేళ రూ.399 ప్లాన్ రీచార్జీ చేయించుకున్న వారికి 4జీ హాండ్‌సెట్ లేకపోతే ప్రతిరోజూ 1.25జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ కింద అపరిమితి ఉచిత కాలింగ్ , ఎస్ఎంఎస్ సదుపాయాలు అదనంగా ఉంటాయి.
కాకపోతే ఇదే సేమ్ ప్లాన్‌లో జియో 70 రోజుల వాలిడిటీ ఇస్తుండగా, ఎయిర్‌టెల్ మాత్రం తక్కువ వాలిడిటీ ఇస్తున్నది.
ఎయిర్‌టెల్ నుంచి రూ.349 ప్లాన్ సైతం అందుబాటులో ఉంది. ఇందులో సైతం ప్రతి రోజూ 1జీబీ డేటా ఇస్తున్నది. కాకపోతే పై ప్లాన్‌తో పోలిస్తే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ ప్లాన్ 4జీ హాండ్‌సెట్ ఉన్నవారికి, లేనివారికి ఒకేలా వర్తిస్తుంది.
ఎయిర్టెల్‌లో 3జీ, 4జీ యూజర్లలో మరో పాపులర్ ప్లాన్ 395. ఇందులో 28 రోజుల పాటు ప్రతి రోజూ 600 ఎంబీ వస్తుంది.
ఉచిత డేటా పూర్తయిన తర్వాత ప్రతి 10కేబీకి 4 పైసలు చార్జీ చేస్తారు. ఇది 4జీ ఎల్టీఈ డేటా ప్యాక్ అని గుర్తుంచుకోగలరు.

వోడాఫోన్
వోడాఫోన్ విషయానికి వస్తే 4జీ ప్రీపెయిడ్ ప్లాన్లు జియో, ఎయిర్టెల్ కంటే కాస్త అధిక ధర కలిగి ఉన్నాయనే చెప్పాలి.
వోడాఫోన్ రూ.257 ప్లాన్ ద్వారా 28 రోజుల అపరిమితి ఉచిత లోకల్,ఎస్టీడీ కాల్స్, ఎస్ఎంఎస్‌లు. వాలిడిటీ 28 రోజులు
ఇది డేటాతో కలగలిపి ఉన్నా ప్యాక్ కాదని గుర్తుంచుకోవాలి. అంతే కాకుండా రోజుకు 250 నిమిషాలు మాత్రమే కాల్స్.
రోజు వారీ 250 నిమిషాల, వారానికి 1000 కాల్స్ పరిమితి ఉంది.
వోడాఫోన్లో మిగతా నెట్‌వర్క్‌లకు కాస్త దీటైనది అంటే రూ.348 ప్యాక్. ఇది 28 రోజుల వాలిడిటీతో ప్రతి రోజూ 1జీబీ డేటా ప్లాన్.
రూ.397 ప్లాన్ 4జీ/ 3జీ యూజర్ల కోసం ప్రతి రోజూ 1జీబీ కాకుండా మొత్తం 6జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తోంది.
కొత్తగా వోడాఫోన్ నెట్వర్క్‌లో చేరే వారి కోసం రూ.349 ప్లాన్ ఉంది.
దీనిలో చేరిన వారికి ప్రతి రోజూ 1జీబీ డేటా చొప్పున 28 రోజుల పాటు 28 జీబీ డేటా. అపరిమితి ఉచిత కాల్స్.

అథమ స్థానంలో ఐడియా డేటా ప్లాన్లు
ఐడియాలో ఉన్న చిక్కేంటంటే మిగతా వారిలా డేటా ప్యాక్ ఆఫర్ ఇచ్చినా ఇది కొత్త సబ్‌స్క్రైబర్లకు, హోం సర్కిల్‌లో మాత్రమే. దేశంలో టాప్ 10 టెలికాం కంపెనీలు
ఐడియా రూ. 399 ప్లాన్ ప్రకారం ప్రతి రోజూ 1జీబీ డేటాను అందిస్తోంది. ఇది ఒక బిల్ సైకిల్ పీరియడ్‌లో వర్తించేలా.
ఇందులో 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితంగా లభిస్తాయి.
కేవలం డేటా విషయానికి వస్తే అన్నింటిలో జియో బెటర్.
డేటా, కాల్స్, సర్వీస్ నాణ్యతను బట్టిని చూస్తే ఎయిర్టెల్ డేటా ప్లాన్ ఒకే ఒకే.


Click it and Unblock the Notifications