120 కంపెనీల్లో ఉద్యోగాలు ఊడాయ్
2016-17 సంవత్సరంలో చాలా కంపెనీలు ఉద్యోగాల కోతకు మొగ్గుచూపాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఈ రిపోర్టులో 121 లిస్టెడ్ కంపెనీల సమాచారాన్ని ఎక్స్చేంజీల నుంచి సేకరించారు.
2016-17 సంవత్సరంలో చాలా కంపెనీలు ఉద్యోగాల కోతకు మొగ్గుచూపాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఈ రిపోర్టులో 121 లిస్టెడ్ కంపెనీల సమాచారాన్ని ఎక్స్చేంజీల నుంచి సేకరించారు. దాన్ని బట్టి ఆయా సంస్థల్లో నికర నియామకాల సంఖ్య 7,30,694 నుంచి 7,42,012కు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలన్నీ బీఎస్ఈ500లో ఉన్నవి, ఈ సమాచారం అంతా మార్చి 2017 నాటికి ఉన్నది. తగ్గిన నియామకాలన్నీ లోహ, విద్యుత్, మూలధన వస్తువులు, నిర్మాణ, ఎఫ్ఎంసీజీ మొదలైన రంగాలకు సంబంధించినవి.

121 కంపెనీల్లో 107 కంపెనీలకు సంబంధించి గత మూడేళ్ల సమాచారం అందుబాటులో ఉంది. మార్చి 2015లో ఈ కంపెనీల ఉద్యోగుల సంఖ్య 6,84,452గా, 2016 మార్చి నాటికి 6,77,296గా ఉంది. అదే మార్చి 2017 నాటికి ఇంకా తగ్గి 6,99,784గా ఉంది. ఇదే సమయంలో నికర నియామకాలు సైతం తగ్డం విశేషం. మొత్తం అన్నింటిలో 49 సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య నికరంగా తగ్గుదలను చూపించాయి. 68 కంపెనీలు మాత్రం నికర ఉద్యోగుల సంఖ్యలో హెచ్చుదలను కనబరిచాయి. అంటే కొత్తగా ఉద్యోగులను నియామకాలను చేపట్టాయి. 4 కంపెనీల విషయంలో నికర ఉద్యోగుల సంఖ్యలో మార్పు కనబడలేదు.


Click it and Unblock the Notifications