ఎగుమతులు బాగానే ఉన్నా... దిగుమతుల ఆందోళన అంతే...
భారత ఎగుమతులు ఆగస్టు నెలలో 23.81 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 10.29% పెరుగుదలతో ఇది గత నాలుగు నెలల్లోనే గరిష్టాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్, కెమికల్ ఉత్
భారత ఎగుమతులు ఆగస్టు నెలలో 23.81 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 10.29% పెరుగుదలతో ఇది గత నాలుగు నెలల్లోనే గరిష్టాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్, కెమికల్ ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి అవడం వల్లే ఎగుమతులు బాగా వృద్ది చెందినట్లు ప్రభుత్వ సమాచారం ద్వారా తెలుస్తోంది. మరో వైపు ఆగస్టు నెలలో దిగుమతులు సైతం అంతకుముందు ఏడాది ఉన్న 29.3 బిలియన్ డాలర్ల నుంచి 21.02% పెరిగి 35.46 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దీంతో ఎగుమతులు-దిగుమతుల మధ్య వాణిజ్య లోటు 11.65 బిలియన్ డాలర్లకు చేరింది. జులై నెలలో ఈ విలువ 11.40 బిలియన్ డాలర్లు కాగా, గతేడాది ఇదే నెలలో 7.71 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

చమురు దిగుమతులు ఆగస్టులో 14.22% పెరిగి 7.75 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఏప్రిల్-ఆగస్టు నెలల మధ్య క్యుములేటివ్ ఎగుమతులు 8.57% పెరిగి 118.57 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మరో వైపు దిగుమతులు 26.63% పెరిగి 181.71 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దీంతో దిగుమతులు-ఎగుమతుల మధ్య అంతరం 63.14 బిలియన్ డాలర్లయినట్లయింది. గత 12 నెలల్లో ఎగుమతుల్లో సానుకూలత కొనసాగుతుండగా ఆగస్టు నెలలో ఎగుమతుల్లో వృద్ది 10.29% ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఏప్రిల్-జూన్ కరెంటు ఖాతా లోటు ఇంకా పెరిగి నాలుగు సంవత్సరాల గరిష్టానికి చేరింది.


Click it and Unblock the Notifications