ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయ్
నికర కార్పొరేట్ పన్ను ఆదాయం చూస్తే ఆశాజనకంగా 18.1% మెరుగుదలను కనబరిచింది. ఇక వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయానికి వస్తే పన్ను వసూళ్లు మొదటి నాలుగు నెలల్లో 16% పెరిగాయి
కేంద్ర ఆర్థిక వ్యవస్థకు శుభవార్త. ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలల మధ్య ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.5% పెరిగి రూ.2.24 లక్షల కోట్లకు పెరిగాయి. కేంద్ర బడ్జెట్ అంచనాల్లో భాగంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ఇది 22.9%గా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు బాగా ఉన్నందున మొత్తం పన్ను ఆదాయం బాగా పెరిగింది. ఏప్రిల్ - ఆగస్టు నెల మధ్య స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు 5% మేర పెరిగాయి. అదే విధంగా నికర కార్పొరేట్ పన్ను ఆదాయం చూస్తే ఆశాజనకంగా 18.1% మెరుగుదలను కనబరిచింది. ఇక వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయానికి వస్తే పన్ను వసూళ్లు మొదటి నాలుగు నెలల్లో 16% పెరిగాయి, నికర వసూళ్లు 16.5% మేర వృద్ది చెందాయి.

2017-18లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.8 లక్షల కోట్లుగా వస్తుందని అనుకుంటున్నారు. 2016-17 సవరించిన అంచనాల ప్రకారం గతేడాది మొత్తం పన్ను వసూళ్లు రూ.8.4లక్షల కోట్లు జరిగాయి. ఇందులో స్థూల కార్పొరేట్ పన్ను ఆదాయం రూ.5.38 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయం పన్ను రూపంలో వచ్చిన మొత్తం రూ.4.41 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతే కాకుండా కేంద్ర ప్రత్యక్ష పన్నుల వసూలు బోర్డు ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య రూ.74,089 కోట్లను రీఫండ్ల రూపంలో తిరిగి ఇచ్చింది. ఇది అంతకుముందు సంవత్సరం ఆగస్టు కంటే 7.2% కంటే ఎక్కువ.
ఇక ప్రత్యక్ష పన్నుల స్థానంలో కొత్తగా వచ్చిన జీఎస్టీ ద్వారా జులై నెలలో రూ.95 వేల వసూళ్లు జరిగాయి.


Click it and Unblock the Notifications