For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 నెల‌ల గ‌రిష్టానికి బంగారం ధ‌ర‌

ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్‌ ఇర్మా ప్రభావంతో శుక్రవారం పసిడి ధర పది నెలల గరిష్ఠానికి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే రూ.990లు పెరిగింది.

|

ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్‌ ఇర్మా ప్రభావంతో శుక్రవారం పసిడి ధర పది నెలల గరిష్ఠానికి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే రూ.990లు పెరిగింది. ఈ ఏడాదిలో ఇంతగా బంగారం ధర పెరగడం ఈరోజే. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.31,350కి చేరుకుంది.

 10 నెల‌ల గ‌రిష్టానికి బంగారం ధ‌ర‌

అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి రూ.42వేలకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 99.9%, 99.5% స్వ‌చ్చ‌త గ‌ల 10 గ్రాములు బంగారం ధ‌ర రూ.31,500; 31,200గా ప‌లుకుతోంది. 2016 నవంబ‌రు త‌ర్వాత ప‌సిడి ధ‌ర ఈ స్థాయికి చేర‌డ‌మ మ‌ళ్లీ ఇప్పుడే.
డాలర్‌ విలువ 2015 కనిష్ఠానికి పడిపోవడం అంతర్జాతీయ మార్కెట్‌కు కలిసొచ్చిందని బులియన్‌ ట్రేడర్లు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధర 0.31శాతం పెరగడంతో ఔన్సు 1,352.80డాలర్లు పలికింది. 2016 సెప్టెంబరు తర్వాత ఔన్సు ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే.

Read more about: gold gold rates gold price
English summary

10 నెల‌ల గ‌రిష్టానికి బంగారం ధ‌ర‌ | Gold rate hits 10 months high

Gold spiralled by Rs. 990 to Rs. 31,350 at the bullion market here today on the back of positive global trend as the dollar fell to its weakest level since 2015, and tensions between North Korea and the US intensified further.
Story first published: Friday, September 8, 2017, 17:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X