ఆదాయపు పన్ను పరిమితి రూ.2.5 లక్షలుగానే ఉండాలి
ఆదాయపు పన్ను పరిమితిని రూ.2.50 లక్షల కంటే పెంచకూడదని, వ్యవసాయేతర రంగాల వారు వారి ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా చూపకుండా అడ్డుకోవాలని నీతిఆయోగ్ ప్రభుత్వానికి సూచించింది. నీతి ఆయోగ్ 2017-18
ఆదాయపు పన్ను పరిమితిని రూ.2.50 లక్షల కంటే పెంచకూడదని, వ్యవసాయేతర రంగాల వారు వారి ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా చూపకుండా అడ్డుకోవాలని నీతిఆయోగ్ ప్రభుత్వానికి సూచించింది. నీతి ఆయోగ్ 2017-18 నుంచి 2019-20 వరకూ మూడేళ్ల మార్గదర్శక సూచీని ఆర్థిక మంత్రి ఢిల్లీలో విడుదల చేశారు. నల్లధనం కట్టడి చేయడంలో మూలంగా పన్ను అధికారుల్లో అవినీతిపై దృష్టిసారించాలని నీతిఆయోగ్ ప్రభుత్వాన్ని కోరింది. ఆదాయపు పన్ను అధికారుల్లో అవినీతిపై వచ్చే కేసులను సత్వరమే విచారించాలని, త్వరగా వాటిని కొలిక్కి తేవాల్సి ఉందని సూచీ తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ అధికారుల్లో నిజాయితీని నెలకొల్పకుండా నల్లధనం కట్టడి సాధ్యపడదని సూచించింది.

నీతిఆయోగ్ సూచీలోని ముఖ్యాంశాలు:
పన్ను ఎగవేతలను అడ్డుకునేందుకు గానూ వ్యవసాయేతర ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా చూపడాన్ని అడ్డుకోవాలి.
పన్ను చట్టాలను వాడుకొని ఏళ్ల తరబడి కేసులు కొనసాగించకుండా ఏం చేయాలనే దానిపైన, పన్ను అధికార వ్యవస్థను ఎలా వాడుకోవాలని సూచీలో సూచించారు.
ప్రధాన మంత్రి ఆశయమైన 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి సంబంధించి, అజెండాలో వ్యవసాయ ఉత్పాదకతకు పెంచేందుకు ఏం చేయాలి, సరైన ధరలు రావడానికి రైతులకు ఏ విధంగా సహకరించాలి, వ్యవసాయ భూములను ఉత్పత్తి పెంచేందుకు ఏ విధంగా ఉపయోగించాలి, కష్ట సమయంలో సంక్షోభ నివారణ చర్యలను చేపట్టాలో వంటి అంశాలను వివరించారు.
అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీల చట్టంలో సంస్కరణలు తేవాలని, కనీస మద్దతు ధరల విధానాన్ని సమీక్షించాలని నీతిఆయోగ్ సలహా ఇచ్చింది.


Click it and Unblock the Notifications