వజ్రాల వ్యాపారంలో దేశంలోనే చేయి తిరిగిన వ్యక్తి హరేకృష్ణ డైమండ్ ఎక్స్‌పోర్ట్ అధినేత ఘనశ్యామ్ ధొలాకియా. ఇటీవల జీవిత పాఠాలు నేర్పేందుకు గాను ఆయన తన ఏడో కొడుకును ఒక నెల రోజు కొత్త ప్రాంతానికి పంపా
ఆ కుటుంబలో అదొక సంప్రదాయం. వేల కోట్లకు వారసులైనా ఒక నెల రోజులు ఎవరికీ తమ స్తోమత, ఆనవాళ్లు తెలియనీయకుండా సాధారణ జీవితం గడపాలి. వజ్రాల వ్యాపారంలో దేశంలోనే చేయి తిరిగిన వ్యక్తి హరేకృష్ణ డైమండ్ ఎక్స్‌పోర్ట్ అధినేత ఘనశ్యామ్ ధొలాకియా. ఇటీవల జీవిత పాఠాలు నేర్పేందుకు గాను ఆయన తన ఏడో కొడుకును ఒక నెల రోజు కొత్త ప్రాంతానికి పంపారు. ఆయన ఎందుకు పంపారు, నెల రోజులు ఆ కొడుకు హితార్త్ ధొలాకియా ఏం చేశాడు అనేది తెలుసుకుందాం.

చేతిలో రూ.500 పెట్టి బయటకు పంపేశారు
రూ.6వేల కోట్ల వ్యాపారాన్ని కలిగిన ఘన్‌శ్యామ్ వారసుడికి సంబంధించి కెరీర్ అతడి కంపెనీలో మొదలుపెట్టి కొనసాగించడం పెద్ద విషయం ఏమీ కాదు. అయితే జీవిత పాఠాలు నేర్పాలంటే మాత్రం అది సరిపోదని ఘన్‌శ్యామ్ భావించారు. అందుకే చేతిలో రూ.500 పెట్టి, ఒక ఫ్లైట్ టిక్కెట్ ఇచ్చి ఇంటి నుండి ఇంటర్న్‌షిప్‌కు పంపేశారు.

ఎక్కడికి వెళతానో అనే విషయం అతనికే తెలియదు
కుటుంబ సంప్రదాయం ప్రకారం కొత్త ప్రదేశానికి వెళ్లాలి. నా అనే వాళ్ల సాయం లేకుండా బతకాలి. నెల రోజుల పాటు సొంత సంపాదనతో బతుకు వెళ్లదీయాలి. ఆ విధంగా నెల రోజుల పాటు ఫోన్ లేకుండా గడపడం ముఖ్యమైన షరతు. తండ్రి చెప్పిన ప్రకారం నెల రోజులు ధొలాకియా పేరును, ఫోన్ వాడకుండా ఉండటం ఇక్కడ చాలా కఠినమైన అంశం. తండ్రి ఇంటి దగ్గర రూ.500, ఇక ఫ్లైట్ టిక్కెట్ ఇచ్చి వెళ్లిపోమన్నాడు. విమానశ్రయంలో అడుగుపెట్టేదాకా అది ఏ నగరానికి వెళ్లే విమాన ప్రయాణ టిక్కెటో తెలియదు. పీఎఫ్ సొమ్ము ఆన్‌లైన్ క్లెయిం ఇలా...

అది హైదరాబాద్ నగరం
సూరత్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టి ఫ్లైట్ టిక్కెట్ ఎక్కడికా అని చూసుకోగానే అది హైదరాబాద్ టిక్కెట్ అని తెలిసింది. ఎక్కడో అమెరికాలో చదువుకోవడం మూలంగా హైదరాబాద్ దేశంలోని ఏ రీజియన్‌లో ఉంటుంది, అక్కడ ఏ భాష మాట్లాడతారో సైతం హితార్త్ ధొలాకియాకు తెలియదు. జులై 10వ తేదిన అతడు హైదరాబాద్ చేరుకున్నాడు. మొదట తన తోటి ప్రయాణికుల ద్వారా హైదరాబాద్, సికిందరాబాద్ నగరాలను గూర్చి తెలుసుకున్నాడు. టూరిజం కౌంటర్లో బ్రోచర్ ద్వారా మరింత సమాచారాన్ని రాబట్టుకున్నాడు. తర్వాత శంషాబాద్ నుంచి సికిందరాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ బస్సులో వచ్చాడు.

నాలుగు వారాల్లో నాలుగు ఉద్యోగాలు మారాడు
నాలుగు వారాల్లో ఎంత డబ్బు తన వద్ద ఉంటుందో తెలియక రోజుకు రెండు పూటల తినేలా ప్లాన్ చేసుకున్నాడు. తన సహచరులతో కలిసి సికిందరాబాద్‌లో ఒక చిన్న గదిలో నెల రోజుల పాటు ఉన్నాడు. రోడ్ సైడ్ ఫుడ్ తింటూ ఉద్యోగాల వేట ప్రారంభించాడు. మొదటి ఉద్యోగం మెక్‌డొనాల్డ్‌లో, తర్వాత మార్కెటింగ్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా చేశాడు. ఆ తర్వాత అడిడాస్‌లో సేల్స్‌మెన్‌గానూ, చివర్లో జడె బ్లూ షోరూంలోనూ పనిచేశాడు.

తన సంపాదనతోనే నెట్టుకొచ్చాడు
నెల రోజుల్లో నాలుగు ఉద్యోగాలు మారాడు. మొత్తానికి రూ.5000 సంపాదించాడు. మొత్తం హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు ఎక్కడికి వెళ్లినా తాను ఎవరనే విషయం బయటపెట్టలేదు. రూ.500 తండ్రి ఇచ్చిన డబ్బు అయిపోయిన తర్వాత తన సంపాదనతోనే గది అద్దె, ఆహారం వంటి అవసరాలు తీర్చుకున్నాడు.

30 రోజుల తర్వాత
30 రోజులు ఎలాగోలా కొన్ని జీవిత పాఠాలు నేర్చుకున్నాడు. తండ్రి ఇచ్చిన అభ్యాసాన్ని పూర్తి చేసిన తర్వాత ఫోన్ చేసి హైదరాబాద్‌లో తాను ఎక్కడ ఉంటున్నది ఫోన్ ద్వారా ఇంట్లో వాళ్లకు తెలియజేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వచ్చారు.

కుటుంబ సంప్రదాయం
గత కొన్నేళ్ల నుంచి ధొలాకియా కుటుంబం ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తోంది. విలాసవంతమైన జీవితం నుంచి నెల రోజుల పాటు సాధారణ జీవితం గడిపేలా ప్రోత్సహిస్తోంది. అలా ఆ విధంగా 31 ఏళ్ల పింటూ తుల్సి భాయ్ ధొలాకియాను మొదటిసారి కుటుంబం నుంచి దూరంగా పంపారు. అతడు ఇప్పుడు హరి క్రిష్ణా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సీఈవోగా ఉన్నారు. అదే విధంగా గతేడాది 21 ఏళ్ల ఎంబీఏ పూర్తిచేసిన కొడుకును ఘన్‌శ్యామ్ కొచ్చి నగరానికి పంపారు. దేశంలో టాప్ 10 టెలికాం కంపెనీలు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications