ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఒకే వ్యక్తి కలిగి ఉండటం చట్ట విరుద్దం. ఒకవేళ మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఒక కార్డు తప్ప మిగిలిన వాటిని ప్రభుత్వానికి స్వాధీనపరచాలి. ఇక్కడ ఒకటి కంటే ఎక
ఈ మధ్య ప్రభుత్వం 11 లక్షల పాన్‌కార్డులను రద్దు చేసింది. ఒకరికి ఒకటి కంటే ఎక్కువ కార్డులున్నాయనే కారణంతో చాలా కార్డులను రద్దు చేశారు. ఆదాయపు పన్ను శాఖ ఈ విధమైన చర్యను తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. నకిలీ పాన్ కార్డులను ఏరివేసి, సరైన పాన్ కార్డులు మాత్రమే పనిచేసే విధంగా ఐటీ శాఖ ఎప్పుడూ చర్యలు చేపడుతుంటుంది. పాన్, ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసిన కారణంగా పాన్ కార్డుల్లో నకిలీ వాటిని ఏరివేయడం మరింత సులువైంది. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఒకే వ్యక్తి కలిగి ఉండటం చట్ట విరుద్దం. ఒకవేళ మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఒక కార్డు తప్ప మిగిలిన వాటిని ప్రభుత్వానికి స్వాధీనపరచాలి. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే ఏమవుతుందో, అదనపు కార్డు(ల)ను ఎలా స్వాధీనపరచాలో తెలుసుకుందాం.

పాన్ కార్డులు ఎక్కువ కలిగే ఉండుటకు గల కారణాలు
ఒకరి వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు వివిధ సందర్భాల్లో ఉంటాయి. కొంత మంది పాన్ కార్డులో మార్పులు కావాలనుకొని, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేస్తారు. మరికొంత మంది పాన్ కార్డు పోయిందని మరో కార్డు కోసం దరఖాస్తు చేస్తారు. పాతదాన్ని క్యాన్సిల్ చేయరు కానీ అది యాక్టివ్‌గా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఒకరి వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కొంత మంది వివాహిత మహిళలు పెళ్లైన తర్వాత పాతది ఉండగానే కొత్త కార్డు తీసుకుంటారు. ఆదాయపు పన్ను శాఖ ఇటీవలి డ్రైవ్‌లో 1566 పాన్ కార్డులు నకిలీవని తేలింది. అంటే ఊరు,పేరు లేని వారికి ఈ కార్డులు జారీ అయినా అయి ఉండాలి, లేదా చనిపోయిన వారి పేరిట కార్డులు తీసుకుని అయినా ఉండాలి. కొంత మంది వారి వద్ద ఒక పాన్ కార్డు ఉందని తెలిసినప్పటికీ మళ్లీ కొత్తది తీసుకుంటారు. ఇలాంటి వారు తమ ఆదాయం లేదా ఆస్తులను రెండు కార్డులపై వేర్వేరుగా చూపడానికి ఇలా చేస్తూ ఉంటారు. తప్పుడు పత్రాలతో ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు లేదా వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు నకిలీ పాన్ కార్డును ఉపయోగిస్తారని ప్రత్యక్ష పన్నుల విశ్లేషకుడు శైలేష్ కుమార్ చెప్పారు.

పాన్ ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది?
ఏ కారణం చేతనైనా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు తీసుకోవడం చట్ట రీత్యా సమ్మతం కాదు. ఎక్కువ పాన్ కార్డులున్నందుకు గాను ఆదాయపు పన్ను చట్టం,1961 ప్రకారం రూ.10వేల పెనాల్టీ విధిస్తారు. పన్ను ఎగవేత కోసమే ఎక్కువ పాన్ కార్డులు తీసుకొని ఉంటే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం విచారణకు సైతం హాజరు కావాల్సి ఉంటుంది. ఐటీ రిటర్నులు, బ్యాంకు ఖాతా తెరిచేందుకు, స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం వంటి సందర్భాల్లో పాన్ కార్డు నంబరు ఇవ్వాల్సి ఉన్నందున ఒకటి కంటే ఎక్కువ కార్డులుంటే మీ ఆర్థిక లావాదేవీల విషయంలో తికమకపడతారు.

ఎక్కువ పాన్ కార్డులుంటే సరెండర్ చేయడం ఎలా(స‌్వాధీనపరచడమెలా)?
ఆన్‌లైన్ విధానం:
పాన్ సంబంధిత సమస్యలకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన పోర్టల్ https://incometax.intelenetglobal.com/pan/pan.asp. ఈ వెబ్‌సైట్లో పాన్ సంబంధిత సమస్యలను ఆయాకార్ సంపర్క్ కేంద్రాల ద్వారా పరిష్కరించుకోవచ్చు.
ఎన్ఎస్‌డీఎల్ నిర్వహిస్తున్న https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html లింక్ ద్వారా అదనపు పాన్ కార్డును ప్రభుత్వానికి స్వాధీనపరచవచ్చు. ఇందుకోసం పాన్ చేంజ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడే అదనపు పాన్ కార్డు వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.

అదనపు పాన్ కార్డు స్వాధీనం- ఆఫ్ లైన్ విధానం:
పాన్ కార్డు స్వాధీనాన్ని ఆఫ్‌లైన్‌లో చేసేందుకు గాను, మీరు చేంజ్ లేదా కరెక్షన్ ఆప్షన్లలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్లో దీన్ని డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. ఈ ఫారంలో మీరు కొనసాగించాలనుకుంటున్న పాన్ కార్డు వివరాలని పైన నమోదు చేసి, మిగిలిన పాన్ కార్డు వివరాలను కింద ఇవ్వాలి. తర్వాత ఈ ఫారంను దగ్గర్లోని యూటీఐ లేదా ఎన్ఎస్‌డీఎల్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఇవ్వాలి. పాన్ కార్డును స్వాధీన పరిచేకంటే ముందు ఒక్కసారి ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్లో పాన్ స్టేటస్‌ను చెక్ చేసుకోవడం మంచిది. incometaxindiaefiling.gov.in ఇందులో ‘Know your PAN' అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా మిగిలిన పనిని పూర్తిచేయవచ్చు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications