For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విప్రో నుంచి 600 మంది తొల‌గింపు

దేశీయ సాఫ్ట్‌వేర్ సంస్థ షాక్ ఇచ్చింది. ఆ సంస్థ‌లో 600 మంది సిబ్బందిని తొల‌గించిన‌ట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో మరింత మందిని తొలగించవచ్చని, మొత్తం సంఖ్య 2000కు చేరుకోవచ్చని ఊహాగానాలున్నాయి. బెంగుళూర

|

ఒక ప‌క్క అమెరికా హెచ్‌-1బీ వీసాల‌తో ఉద్యోగాలు కోల్పోతామ‌ని భ‌య‌ప‌డుతున్న త‌రుణంలో ఐటీ ఉద్యోగుల‌కు దేశీయ సాఫ్ట్‌వేర్ సంస్థ షాక్ ఇచ్చింది. ఆ సంస్థ‌లో 600 మంది సిబ్బందిని తొల‌గించిన‌ట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో మరింత మందిని తొలగించవచ్చని, మొత్తం సంఖ్య 2000కు చేరుకోవచ్చని ఊహాగానాలున్నాయి. దేశంలో టాప్ 10 ఐటీ కంపెనీలు

 600 మందికి ఉద్వాస‌న ప‌లికిన విప్రో

బెంగుళూరు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న విప్రోలో డిసెంబర్ 2016 చివరినాటికి 1.79 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఈమధ్యే వార్షిక పనితీరు మదింపు జరిపిన సంస్థ.. వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. సంస్థ వ్యాపార లక్ష్యాలు, వ్యూహాత్మక ప్రాధాన్యత, క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను మార్చే క్ర‌మంలో సంస్థ ఎప్పటికప్పుడు సిబ్బంది పనితీరుపై మదింపు జరుపుతుంటుందని విప్రో వెల్లడించింది. ఇందులోభాగంగా కొంతమందికి సంస్థ నుంచి ఉద్వాస‌న ప‌ల‌కాల్సి రావచ్చని, ఉద్యోగం నుంచి తొలగించే వారి సంఖ్య ఏటేటా మారుతుంటుందని వివ‌రించింది. అయితే, ఈ ఏడాది ఎంతమందిని తొలగించిన విషయాన్ని మాత్రం స్ప‌ష్ట‌ప‌ర‌చ‌లేదు. సంస్థ సమగ్ర పనితీరు మదింపు ప్రక్రియలో పర్యవేక్షణ, పునః శిక్షణ, నైపుణ్య ఆధునీకరణ కూడా భాగమేనని తెలిపింది. ఈనెల 25న విప్రో నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది.

Read more about: wipro software
English summary

విప్రో నుంచి 600 మంది తొల‌గింపు | wipro sacked 600 employees due to lower perfomance

The country's third largest software services firm Wipro is learnt to have fired hundreds of employees as part of its annual "performance appraisal". According to a news report , Wipro has shown the door to about 600 employees, while speculation was rife that the number could go as high as 2,000.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X