For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశంలో టాప్ 10 ఐటీ కంపెనీలు

దేశంలో 10 ఐటీ కంపెనీల జాబితాను ఎంబీఏస్కూల్‌.కామ్ వెబ్‌సైట్ రూపొందించింది. ఇందులో దేశంలో న‌మోదైన‌, లిస్టైన 15 సంస్థ‌ల‌ను తీసుకున్నారు.

|

దేశంలో 10 ఐటీ కంపెనీల జాబితాను ఎంబీఏస్కూల్‌.కామ్ వెబ్‌సైట్ రూపొందించింది. ఇందులో దేశంలో న‌మోదైన‌, లిస్టైన 15 సంస్థ‌ల‌ను తీసుకున్నారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఆదాయ‌, లాభాల వివ‌రాలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం జ‌రిగింది. రెవెన్యూకు 60 శాతం వెయిటేజీ, లాభానికి 40 శాతానికి వెయిటీజీ ఇస్తూ జాబితాను త‌యారుచేశారు.

1.టీసీఎస్

1.టీసీఎస్

రెవెన్యూ: రూ.107542 కోట్లు

లాభం: రూ. 23972 కోట్లు

టీసీఎస్ లెవ‌ల్ 5 సంస్థ‌. దేశంలో ఎక్కువ‌గా ఉద్యోగాలు క‌ల్పించే సంస్థ‌ల్లో ఇది ఒక‌టిగా ఉంది. ఎన్‌. చంద్ర శేఖ‌ర‌న్ ప్ర‌స్తుతం కంపెనీ సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అమెరికా,యూకే, ఆగ్నేసియా దేశాలు(సింగ‌పూర్‌, మలేషియా), భార‌త‌దేశం వంటి ప‌లు చోట్ల వీరికి క్లైంట్లు ఉన్నారు. అమెజాన్‌, అడోబ్‌, శ్యాప్‌,ఒరాకిల్‌, వీఎమ్‌వేర్‌, మైక్రోసాఫ్ట్ సంస్థ‌ల‌తో పనికి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. టీసీఎస్‌కు 60 అనుబంధ సంస్థ‌లున్నాయి.

2. ఇన్ఫోసిస్‌

2. ఇన్ఫోసిస్‌

రెవెన్యూ: రూ. 65569 కోట్లు

లాభం: రూ. 18982 కోట్లు

దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌. బ్రాండ్ అవేర్‌నెస్‌లో మొట్ట‌మొద‌టి స్థానంలో ఉంది. 1981లో ఇన్ఫోసిస్ చిన్న ఐటీ కంపెనీగా మొద‌ల‌యింది. నారాయ‌ణ మూర్తి అత‌ని స‌హ‌చ‌రులు దీన్ని స్థాపించారు. సంస్థ ఉద్యోగులు దాదాపు 1.94 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉన్నారు. బెంగుళూరు ప్ర‌ధాన కేంద్రంగా ఉంది. 40 పైగా దేశాల్లో సంస్థ కార్య‌క‌లాపాలు ఉన్నాయి. 85కి పైగా సేల్స్‌, మార్కెటింగ్ కార్యాల‌యాలు క‌లిగిన ఇన్ఫీ, 100 డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ల‌ను క‌లిగి ఉంది.

ఇన్ఫోసిస్ స‌బ్సిడ‌రీలు: ఇన్ఫోసిస్ బీపీవో, ఇన్ఫోసిస్ క‌న్స‌ల్టింగ్‌, ఇన్ఫోసిస్ ప‌బ్లిక్ స‌ర్వీసెస్‌, స్క‌వా, ఎడ్జ్‌వెర్వ్‌

3. విప్రో

3. విప్రో

రెవెన్యూ: రూ. 45096 కోట్లు

లాభం: రూ.8099 కోట్లు

బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న విప్రో లెవ‌ల్ 5 కంపెనీ. అబిద్ అలీ నీమూచ్‌వాలా కంపెనీ సీఈవోగా ఉన్నారు. 1945లో చిన్న సంస్థ‌గా మొద‌లైన విప్రో 1981 నుంచి ఐటీ కార్య‌క‌లాపాల‌ను మొద‌లుపెట్టింది. 1990ల్లో ఆఫ్‌షోర్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌ను ప్రారంభించింది. విప్రో ఉద్యోగుల సంఖ్య 1 ల‌క్షా 70 వేల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంది. ప్ర‌పంచంలో 6 ఖండాల్లో దీనికి విస్త‌ర‌ణ ఉంది.

విప్రో సేవ‌లు అందించే రంగాలు

  1. బీఎఫ్ఎస్ఐ
  2. మ్యాన్యుఫ్యాక్చ‌రింగ్ టెక్నాల‌జీ
  3. క‌మ్యూనికేష‌న్స్
  4. కన్సూమ‌ర్ బిజినెస్ యూనిట్
  5. ఇంధ‌న‌, స‌హ‌జ వ‌నరులు, తత్సంబంధ సేవ‌లు
  6. హెల్త్‌కేర్‌, లైఫ్ సైన్సెస్‌
4. హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌

4. హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌

రెవెన్యూ: రూ. 40527 కోట్లు

లాభం: రూ. 7267 కోట్లు

నోయిడా కేంద్రంగా 1991 నవంబ‌రు 12న హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ ప్రారంభ‌మైంది. ఐటీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

హెచ్‌సీఎల్ సేవ‌లు అందిస్తున్న రంగాలు

మౌలికం(ఇన్‌ఫ్రా)

ఇంజినీరింగ్‌

అప్లికేష‌న్లు

బిజినెస్ స‌ర్వీసెస్‌

5. టెక్ మ‌హీంద్రా

5. టెక్ మ‌హీంద్రా

రెవెన్యూ: రూ. 25727 కోట్లు

లాభం: రూ. 2693 కోట్లు

వేగంగా అభివృద్ది చెందుతున్న ఐటీ కంపెనీల్లో టెక్ మ‌హీంద్రా ఒక‌టి. సత్యం కంపెనీని విలీనం చేసుకుని టెక్ మ‌హీంద్రాలో మహీంద్రా స‌త్యంను క‌లిపిన త‌ర్వాత ఇది టాప్ 5లో చేరింది. టెక్ మ‌హీంద్రా బీఎఫ్ఎస్ఐ, క‌మ్యూనికేష‌న్, మ్యాన్యుఫ్యాక్చ‌రింగ్‌, ప్ర‌భుత్వ రంగం, క్రీడ‌లు వంటి రంగాల్లో త‌న సేవ‌ల‌ను అందిస్తోంది.

ఐటీ రంగంలో ఒరాకిల్‌, శ్యాప్‌, సేల్స్‌ఫోర్స్‌, పెగా వంటి వాటితో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాలు ఉన్నాయి.

6. ఎంఫ‌సిస్‌

6. ఎంఫ‌సిస్‌

రెవెన్యూ: రూ. 6150 కోట్లు

లాభం: రూ. 758 కోట్లు

ఈ కంపెనీని జెర్రీ రావు, జెరియ‌న్ టాస్ స్థాపించారు. లెవ‌ల్ కంపెనీ అయిన ఎంఫ‌సిస్ ఐఎస్‌వో 9001 స‌ర్టిఫికేష‌న్ క‌లిగి ఉంది.

కంపెనీ సేవ‌లందించే రంగాలు

  • అప్లికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మెయింటెనెన్స్‌
  • స్పెష‌లైజ్‌డ్ స‌ర్వీసెస్‌
  • ఎంట‌ర్‌ప్రైజ్ ఆర్కిటెక్చ‌ర్‌, ఇంటిగ్రేష‌న్‌, బీపీఎం
  • వెబ్ టెక్నాల‌జీస్‌
  • యూజ‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ మేనేజ్మెంట్‌(యూఎక్స్‌)
  • డిజిట‌ల్ యాక్సెస‌బిలిటీ
7. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌

7. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌

రెవెన్యూ: రూ. 5847 కోట్లు

లాభం: రూ.803 కోట్లు

1997లో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ సంస్థ‌ను స్థాపించారు. ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తోంది. సంజ‌య్ జ‌లోనా సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇది ప‌నిచేస్తున్న ప‌రిశ్ర‌మ‌ల రంగాలు

  • ఆటోమోటివ్‌, ఏరోస్పేస్
  • ఇంజినీరింగ్‌
  • లైఫ్ సైన్సెస్‌
  • బ్యాంకింగ్‌, ఫైనాన్స్
  • ఎన‌ర్జీ
  • హైటెక్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌
8. మైండ్ ట్రీ

8. మైండ్ ట్రీ

రెవెన్యూ: రూ. 4689.6 కోట్లు

లాభం: రూ. 603.3 కోట్లు

ఐటీ అనుబంధ సేవ‌లైన అప్లికేష‌న్ డెవ‌లప్‌మెంట్‌, నిర్వ‌హ‌ణ‌; అప్లికేష‌న్ స‌ర్వీసెస్‌; ఇండిపెండెంట్ టెస్టింగ్‌; ఐటీ కన్స‌ల్టింగ్‌; అన‌లిటిక్స్‌; ఇన్‌ఫ్రా మేనేజ్‌మెంట్ విబాగాల్లో మైండ్ ట్రీ ప‌నిచేస్తోంది.

9. ఒరాకిల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్

9. ఒరాకిల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్

రెవెన్యూ: రూ. 3717 కోట్లు

లాభం: రూ. 928.85 కోట్లు

ఒరాకిల్ కార్పొరేష‌న్ స‌బ్సిడరీగా ఇది ఉంది. ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తోంది.

ఇది ప‌నిచేస్తున్న రంగాలు

కోర్‌బ్యాంకింగ్‌

ఇన్వెస్ట‌ర్ స‌ర్వీసింగ్‌

ప్రైవేట్ బ్యాంకింగ్‌

డైరెక్ట్ బ్యాంకింగ్‌

10. రోల్టా

10. రోల్టా

రెవెన్యూ: రూ. 3899 కోట్లు

లాభం: రూ. 165 కోట్లు

1989లో రోల్టా ప్రారంభ‌మైంది. ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తోంది. ర‌క్ష‌ణ రంగం, భ‌ద్ర‌త‌, ప్ర‌భుత్వ ప్రాజెక్టులు, ఆయిల్ అండ్ గ్యాస్‌, యుటిలిటీ సేవ‌ల రంగాల్లో ఇది ప్ర‌ధానంగా త‌న సేవ‌ల‌నందిస్తోంది.

Read more about: it software
English summary

దేశంలో టాప్ 10 ఐటీ కంపెనీలు | top 10 IT companies in India

This is a list of notable companies in the information technology sector based in India. Top 10 companies are listed in descending order of their market capitalization. Most of them are headquartered in Mumbai or Bangalore.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X