మానవాభివృద్ది సూచీలో భారత స్థానం 131
విద్య, వైద్యంలో విపరీతమైన అసమానతల మూలంగా మానవాభివృద్ది సూచీలో భారత్ స్కోర్ 27% క్షీణించింది. దీంతో 188 దేశాల జాబితాలో భారత స్థానం 131గా ఉంది. ఇదే జాబితాలో చిన్న దేశమైన నార్వే ఎప్పటిలాగే ప
అభివృద్ది అంటే ఆకాశహార్మ్యాలు, స్మార్ట్ నగరాలు మాత్రమే కాదు. ప్రజల జీవన స్థాయి మెరుగుపడాలి. అంటే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందాలి. ఈ విషయంలో మనం ఎప్పుడూ వెనుకబాటే. ఎందుకంటే మన పాలసీలు అన్నీ జీడీపీ, వృద్ది రేటు చుట్టూ తిరిగి ప్రజల జీవన స్థాయిలను పెంచేందుకు కృషి చేయవు. అదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ మానవాభివృద్ది సూచీ కఠోర వాస్తవాన్ని బట్టబయలు చేసింది. విద్య, వైద్యంలో విపరీతమైన అసమానతల మూలంగా మానవాభివృద్ది సూచీలో భారత్ స్కోర్ 27% క్షీణించింది. దీంతో 188 దేశాల జాబితాలో భారత స్థానం 131గా ఉంది. ఇదే జాబితాలో చిన్న దేశమైన నార్వే ఎప్పటిలాగే ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఈ పది అంశాల్లో భారత్ దూసుకెళుతోంది

అయితే పలు అంశాల్లో 1990 నుంచి 2015 వరకూ భారతదేశం మెరుగవుతూ వచ్చింది. జీవన సాఫల్య రేటు ఆ మధ్య కాలంలో 10.4 సంవత్సరాలు పెరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి. పాఠశాలకు వెళ్లే సగటు రేటు(mean years of schooling) 3.3 సంవత్సరాలు, మొత్తం పాఠశాల విద్యాభ్యాస రేటు 4.1 సంవత్సరాలు పెరిగింది. దేశంలో చేపట్టిన మార్కెట్ సంస్కరణలతో పాటు, విద్యా రంగంలో ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలే ఇందుకు కారణమని ఐక్యరాజ్యసమితి విశ్లేషించింది. అంతే కాకుండా ఈ మధ్య ప్రభుత్వాలు ప్రాముఖ్యత నిస్తున్న స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, భేటీ బచావో భేటీ పడావో వంటివి వివిధ వర్గాల ప్రజల మధ్య ఉన్న అంతరాలను తొలగించేందుకు దోహదం చేస్తాయని యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఫర్ ఇండియా, యూరీ అఫనాసివ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications