హెచ్-1బీపై ట్రంప్ నిర్ణయాలతో బేర్‌మన్న మార్కెట్లు
అమెరికా కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు మొత్తం ప్రపంచ స్టాక్ మార్కెట్లకు వణుకు పుట్టిస్తున్నాయి. సోమవారం అమెరికా, యూరప్ మార్కట్లు నష్టపోగా.. నేటి ట్రేడింగ్‌లో భారతదేశంతో పాటు ఆసియా
దాదాపు 200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
అమెరికా కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు మొత్తం ప్రపంచ స్టాక్ మార్కెట్లకు వణుకు పుట్టిస్తున్నాయి. సోమవారం అమెరికా, యూరప్ మార్కట్లు నష్టపోగా.. నేటి ట్రేడింగ్‌లో భారతదేశంతో పాటు ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 194 పాయింట్లు తగ్గి 27,656 వద్ద నిలవగా.. నిప్టీ 71 పాయింట్ల నష్టంతో 8,561 వద్ద స్థిరపడింది. మెజారిటీ ముస్లిం జనాభాగల 7 దేశాలకు వీసాల జారీని నిషేధించడం ద్వారా ట్రంప్ గత వారం చివర్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. దీనికి తాజాగా కనీస రుసుము రెట్టింపు చేస్తూ ప్రతిపాదించిన హెచ్ 1బీ వీసాల బిల్లు జతకలిసింది. హెచ్ 1బీ వీసాలకు కనీస వేతనాన్ని ప్రస్తుత 60,000 డాలర్ల నుంచి 3,00,000 డాలర్లకు పెంచుతూ బిల్లులో ప్రతిపాదించారు. దీంతో అన్ని సాఫ్ట్‌వేర్ సంస్థల వ్యయాలు గణనీయంగా పెరిగే అవకాశముంది. ఇది ఐటీ కౌంటర్లలో భారీ అమ్మకాలకు తెరలేపింది. ఈ మొత్తం పరిణామాలతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ 3.2 శాతం పతనమైంది. ఇది మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. బడ్జెట్
ఇది కూడా చదవండి జీఎస్టీ మనకు ఎందుకు అవసరమంటే?
ఐడియా సెల్యులార్, ఇండస్‌ఇండ్ బ్యాంకు, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ తదితర షేర్లు లాభపడగా, భారతీ ఇన్‌ఫ్రాటెల్, గ్రాసిమ్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ మొదలైన షేర్లు నష్టాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం మార్కెట్లు నష్టాలతో ప్రారంభమ్యాయి. మధ్యాహ్నం ప్రకటించిన ఆర్థిక సర్వే ఆరంభ నష్టాలను కొద్దిగా తగ్గించగలిగినా ఆ తర్వాత కూడా మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి.
గత కొన్ని రోజులుగా వరుసగా ప్రీ బడ్జెట్ ర్యాలీ కొనసాగినా, ట్రంప్ వివాదస్పద నిర్ణయాలతో ఇండియన్ షేర్ మార్కెట్లు కుంగుబాటుకు గురవుతున్నాయి.


Click it and Unblock the Notifications
