For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ వారు పాటించాల్సిన కొన్ని ముఖ్య సూచ‌న‌లు

షేర్‌ మార్కెట్లో వ్యాపారం చేసే మదుపరులు (పెట్టుబడిదారులు) గుర్తుంచుకోవలసిన కొన్ని ముందు జాగ్రత్తలను ఈ క్రింద పేర్కొంటున్నాము. గతంలో కంటె ఇటీవల, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిపెట్టే / వ్యాపారంచేసే మదుపుద

|

షేర్‌ మార్కెట్లో వ్యాపారం చేసే మదుపరులు (పెట్టుబడిదారులు) గుర్తుంచుకోవలసిన కొన్ని ముందు జాగ్రత్తలను ఈ క్రింద పేర్కొంటున్నాము. గతంలో కంటె ఇటీవల, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిపెట్టే / వ్యాపారంచేసే మదుపుదారుల సంఖ్య బాగా పెరుగుతున్నది. అందువల్ల, స్టాక్ మార్కెట్ విషయంలో మదుపుదారులు ఏమేమి చేయాలో, ఏవి చేయకూడదో తెలుసుకోవడం అవసరం. మదుపుదారులు పాటించవలసిన, పాటించకూడని కొన్ని సాధారణ అంశాలను ఈ క్రింద పేర్కొనడం జరిగింది.

షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ వారు పాటించాల్సిన కొన్ని ముఖ్య సూచ‌న‌లు

మ‌దుప‌ర్లు చేయకూడనివి:
* మీ లావాదేవీలను, సెబి / స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లలో నమోదు కాని బ్రోకర్లు / సబ్ బ్రోకర్లతోకాని, నమోదుచేసుకోని ఇతర మధ్యవర్తులతో కాని నిర్వహించవద్దు.
* పూర్తిగా చదివి అర్ధం చేసుకోనిదే, ఎలాంటి దస్తావేజులపైన సంతకాలు చేయవద్దు.
* మీ భౌగోళిక పరిధికి సంబంధించని ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి , ఫిర్యాదులు లేదా మధ్యవర్తిత్వ దరఖాస్తులు చేసుకోవద్దు. మీ వ్యాపార సభ్యునికి , చట్ట ప్రకారం, మీరు తెలియజేసిన మీ చిరునామానుబట్టి, భౌగోళిక పరిధిని నిర్ణయించుకోవాలి. మదుపుదారుల ఫిర్యాదులను ఎక్స్ ఛేంజీలు, మధ్యవర్తిత్వం ద్వారా లేదా ఐ జి ఆర్ సి పద్ధతి ద్వారా పరిష్కరిస్తాయి. నేరుగా ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రంలో దాఖలుచేసే ఫిర్యాదు, లేదా మధ్యవర్తిత్వ దరఖాస్తుకు " కాల పరిమితిని '' లెక్కించడంలో, ఐ జి ఆర్ సి సేవల ద్వారా ఫిర్యాదును పరిష్కరించే ప్రయత్నానికి పట్టిన కాలాన్ని లెక్కలోకి తీసుకోరు.
*బీఎస్ఈ లో నమోదైన ఏదైనా కంపెనీపై మీరు ఫిర్యాదుచేయాలనుకుంటే, భౌగోళిక పరిధికి చెందని మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి దరఖాస్తు చేయవద్దు. ఎందుకంటే, అవి త్వరగా పరిష్కారం కావు. మీ చిరునామా ఆధారంగా భౌగోళిక పరిధిని నిర్ణయించుకోండి.
* వదంతులపైన, ఊహాగానాలపైన ఆధారపడి లావాదేవీలు సాగించవద్దు.
* ఈ షేర్లలో పెట్టుబడి పెడితే, లాభం ఖాయం వంటి మాటలకు మోసపోవద్దు.
* కంపెనీలు తమ సెక్యూరిటీలకు ప్రభుత్వ ఆమోదం వున్నదనో, లేదా ప్రభుత్వ ఏజెన్సీల వద్ద నమోదుచేసుకున్నామనో చేసే ప్రచారానికి మోసపోవద్దు. ఎందుకంటే, ఆ ఆమోదం మీరు కొనాలనుకునే సెక్యూరిటీలకు సంబంధించినది కాక, ఇతర మరెందుకో సంబంధించినది కావచ్చు.
* మీ డీమ్యాట్‌ లావాదేవీల స్లిప్ బుక్ ను న‌మ్మ‌కం లేని, ప‌రిచ‌యం లేని ఏ మధ్యవర్తికీ ఇవ్వవద్దు.
* కంపెనీలు, తమ ఆర్ధిక సామర్ధ్యాన్ని గురించి, పత్రికలలో, టెలివిజన్ ఛానల్స్‌లో చేసే ప్రకటనల ఆధారంగా, మీ లావాదేవీలను నిర్ణయించుకోవద్దు.
* కంపెనీలలోని పరిణామాలను గురించి ప్రచార, ప్రసార సాధనాలలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మవద్దు. వీటిలో కొన్ని మిమ్ము తప్పుదారి పట్టించవచ్చు.
*ఎవరైనా లాభంపొందినవారి పెట్టుబడి నిర్ణయాలను గుడ్డిగా అనుకరించవద్దు.
* మీకు బాగా పరిచయం వున్న వారైనా సరే, మీ లావా దేవీలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను వారినుంచి తీసుకోవడం మరువవద్దు.
* పెట్టుబడిలో ఎదురయ్యే ముప్పులను ముందుగానే గమనించడం మరువవద్దు.
* మీ పెట్టుబడులను పోస్ట్ డేటెడ్ (తర్వాతి తేదీ వేసిన) చెక్కులద్వారా చెల్లిస్తామనే హామీలకు మోసపోవద్దు
* అవసరాన్నిబట్టి, సంబంధిత వ్యక్తులను, తగిన అధికారులను కలుసుకోవడానికి వెనుకాడవద్దు
భారీ లాభాలు వస్తాయి అనే హామీలను వెంటనే నమ్మేయ‌కూడ‌దు.
మ‌దుప‌ర్లు ఇవి చేయాలి:-
* సెబీ / స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లలో నమోదుచేసుకున్న మధ్యవర్తులతోనే వ్యవహరించండి.
* మీరు ఖాతాదారుగా నమోదు చేసుకోవడం పూర్తయినవెంటనే, అందుకు సంబంధించిన అన్ని దస్తావేజుల జిరాక్స్ కాపీలను తీసుకుని, మీవద్ద వుంచుకోండి.
* మీ బ్రోకర్ / ఏజెంట్ / డిపాజిటరీ పార్టిసిపెంట్ కు ఎలాంటి గందరగోళం లేని, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి.
లావాదేవీలు జరిగిన ప్రతిసారి, మీ బ్రోకర్‌ను మీకు కాంట్రాక్టు నోట్ ఇవ్వమనండి. లావాదేవీలపై ఏదైనా అనుమానం వస్తే, బీఎస్ఈ వెబ్‌సైట్‌లో సరిచూసుకోండి.
* మార్కెట్‌లోని మధ్యవర్తులకు చెల్లించవలసిన మొత్తాలను బ్యాంకుల ద్వారా మాత్రమే చెల్లించండి. న‌గ‌దు వ్య‌వ‌హారాల‌కు రుజువులు ఉండ‌వు కాబ‌ట్టి మోసం చేస్తే మ‌ళ్లీ మీరు ఫిర్యాదు చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌క‌పోవ‌చ్చు.
* ఏవైనా షేర్లను కొనవలసిందిగా, మార్కెట్ మధ్యవర్తులకు చెప్పేముందు, ఆ కంపెనీ తీరుతెన్నులేమిటి, దాని సామర్ధ్యం ఎంత, యాజమాన్యం ఎలా వుంది, మౌలిక ప్రాతిపదికలు (ఫండమెంటల్స్) ఎలా వున్నాయి, ఆ కంపెనీ ఇటీవల చేసిన ప్రకటనలేమిటి, వివిధ నిబంధనలకింద ఆ కంపెనీ వెల్లడించిన విషయాలేమిటి అనేవి పరిశీలించి తెలుసుకోవాలి. ఎక్స్చేంజీ, కంపెనీల వెబ్‌సైట్ల ద్వారా, డేటా వెండర్ సమాచార దర్శనుల(డేటా బేస్) ద్వారా, వ్యాపారానికి సంబంధించిన పత్రికల ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు
* మీరు ఎంత నష్టాన్ని భరించగలుగుతారో, అందుకు అనుగుణమైన వ్యాపార / పెట్టుబడి వ్యూహాలను అనుసరించాలి. ఎందుకంటే, షేర్ మార్కెట్లో పెట్టే ఏ పెట్టుబడిలోనైనా, ఎంతో కొంత నష్ట భయం వుండనే వుంటుంది. మీరు అనుసరించే వ్యూహాన్నిబట్టి ఆ నష్టభయం హెచ్చు తగ్గులు ఆధారపడి వుంటాయి.
* ఏ మధ్యవర్తితోనైనా మీరు ఖాతాదారుగా నమోదుచేసుకోవడానికి ముందు, తగిన పరిశీలన అవసరం. బ్రోకర్ల ద్వారా వ్యాపారం జరపడానికి అవసరమైన, పెట్టుబడిదారు నమోదు దస్తావేజులలోని, ' రిస్క్ డిస్‌క్లోజర్ డాక్యుమెంట్ ' ( నష్ట భయాన్ని వెల్లడించే పత్రం ) లోని అంశాలను జాగ్రత్తగా చదివి, అర్ధం చేసుకోండి.
* హఠాత్తుగా ధర పెరిగే షేర్లతో జాగ్రత్త; ముఖ్యంగా తక్కువ ధర షేర్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం
* స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులకు ఖచ్చితంగా లాభం వస్తుందన్న హామీ ఏమీ వుండదు.
*పెట్టుబడులకు సంబంధించిన అన్నిరకాల పత్రాల ( దరఖాస్తులు, రసీదులు, కాంట్రాక్ట్ నోట్ మొదలైనవి ) ప్రతులను ( జిరాక్స్ కాపీలను ) తీయించి మీవద్ద వుంచుకోండి.
* ముఖ్యమైన పత్రాలను పంపేటప్పుడు అవి తప్పక చేరే విధంగా పంపండి. ( రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపడం మంచిది ) .
* మీవద్ద డబ్బు వున్నదని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే, కొనండి
* మీ వద్ద సెక్యూరిటీలు వున్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే అమ్మండి.
* లావాదేవీల పత్రాలు సరిగా అందేలా తగిన వాకబు చేయండి. ఉదాహరణకు, మీకు అందవలసిన దస్తావేజులు , తగిన వ్యవధిలోగా అందకపోతే, తక్షణమే, సంబంధితులతో ( వ్యాపార సభ్యుడు లేదా కంపెనీని) సంప్రదించండి.
మీ లావాదేవీలను, నేరుగా దస్తావేజుల పత్రాల రూపంలోనే జరుపుతారా, లేక డి మాట్ రూపంలో జరుపుతారా అనే విషయం మీరు స్పష్టంగా పేర్కొనాలి.
* మీ వ్యాపార సభ్యునిపై ఏదైనా ఫిర్యాదు చేయాలనుకున్నా, లేక మధ్యవర్తిత్వంకోసం దరఖాస్తుచేయాలనుకున్నా, మీ భౌగోళిక పరిధికి సంబంధించిన మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి దరఖాస్తు చేయాలి. మీ వ్యాపార సభ్యునికి , చట్ట ప్రకారం, మీరు తెలియజేసిన మీ చిరునామానుబట్టి, భౌగోళిక పరిధిని నిర్ణయించుకోవాలి. సంబంధిత మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రం భౌగోళిక వివరాలు, కాంట్రాక్ట్ నోట్‌లో కూడా వుంటాయి.
* నేరుగా ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రంలో దాఖలుచేసే ఫిర్యాదు, లేదా మధ్యవర్తిత్వ దరఖాస్తుకు " కాల పరిమితిని '' లెక్కించడంలో, ఐ జి ఆర్ సి సేవల ద్వారా ఫిర్యాదును పరిష్కరించే ప్రయత్నానికి పట్టిన కాలాన్ని లెక్కలోకి తీసుకోరు.
* బీఎస్ఈలో నమోదైన ఏదైనా కంపెనీపై ఫిర్యాదు చేయాలనుకుంటే, మీ భౌగోళిక పరిధికి సంబంధించిన మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి దరఖాస్తు చేయాలి. మీ చిరునామానుబట్టి, మీ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రం భౌగోళిక పరిధిని నిర్ణయించుకోవాలి. ఈ విధంగా చేస్తే, మీ ఫిర్యాదును త్వరగా చేపట్టడానికి వీలవుతుంది.

English summary

షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ వారు పాటించాల్సిన కొన్ని ముఖ్య సూచ‌న‌లు | best investing tips for Long term investors

Any investment plan to meet any long term goal is incomplete with shares, irrespective how risk averse you are. Studies from across the world and across different time frames show that shares give the best return from all investment products, when kept for a long period of time – at least 7-10 years. Of course the assumption here is that you have invested in the shares of companies which have good investment potential.
Story first published: Wednesday, January 18, 2017, 12:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X