దేశవ్యాప్తంగా వస్తు, సేవలకు ఒకే పన్ను విధించడంతో పాటు పన్నుపై పన్ను వేసే పద్దతిని మార్చే ఉద్దేశంతో కేంద్రం ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను బిల్లు గతేడాదే లోక్ సభలో ఆమోదం పొందింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి లోక్‌సభ, రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ఇంకా సగానికి పైగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది.

మొదటి కారణం:
రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ పెరిగేందుకు జీఎస్‌టీ దోహదపడగలదు. పేద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులు పెరిగేందుకు అవకాశం ఉంది.

రెండో కారణం:
మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశమంతా ఏకరీతి మార్కెట్ నిర్మించగల సత్తా భారత్‌కు లభిస్తుంది. ప్రస్తుతం దేశమంతా 30 లేదా అంతకన్నా ఎక్కువ మార్కెట్లుగా విడిపోయింది. ఎన్నో రకాల పన్నుల వ్యవస్థ ప్రస్తుతం ఉంది. ఉదాహరణకు కేంద్ర అమ్మకపు పన్ను, ఎక్సైజ్ పన్ను, సేవా పన్ను, విలువ ఆదారిత పన్ను వంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ లేకుండా ఒకే రకమైన పన్ను ఉంటే దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది.

మూడో కారణం:
విలువ ఆధారిత పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను వ్యవస్థలో సమూల మార్పులు జరిగాయి. అప్పట్లో సైతం రెండు, మూడు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించలేదు. తర్వాత దాని ద్వారా వచ్చిన ప్రయోజనాలను గమనించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దానికి మొగ్గుచూపాయి. ప్రస్తుతం సైతం పన్ను వ్యవస్థలో సమూల మార్పులకు జీఎస్‌టీ దారి తీస్తుంది.
మరో విషయమేమిటంటే జీఎస్‌టీ అమలును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించే అవకాశం ఉన్నందున పన్ను ఎగవేసేందుకు అవకాశాలు తక్కువ.

నాలుగో కారణం:
రాష్ట్రాల స్థాయిల్లో విలువ ఆధారిత పన్ను విధానంలో వస్తువులపై విధించే పరోక్ష పన్నులైన విలాస, వినోద పన్నుల్ని ప్రత్యేకంగా వసూలు చేస్తున్నారు. ఈ పన్నుల బెడద నుంచి వినియోగదారులకు స్వాంతన లభిస్తుంది. జీఎస్‌టీని రాష్ట్ర స్థాయిలో ప్రవేశపెట్టినట్లయితే అన్ని సేవలపై పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్రాలకు అలాంటి అధికారం ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కాని ప్రస్తుతం ఉన్న బిల్లు రూపంలో కేంద్రానికే పన్ను వసూలు అధికారాలు ఎక్కువ ఉండేలా ఉన్నాయి. ఎప్పుడైనా కేంద్రమే పన్ను వసూలు చేసి రాష్ట్రాలకు పంచుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువగా పర్యవేక్షణ ఉంటుంది.

ఐదో కారణం:
నిపుణుల అంచనా ప్రకారం జీఎస్‌టీని అమలు పరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు 15 బిలియన్ డాలర్ల మేర ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే జీఎస్‌టీ మేకిన్ ఇండియాను ప్రోత్సహించడం ద్వారా దేశ ఎగుమతులు పెరగడంతో పాటు ఉద్యోగ అవకాశాల్లో గణనీయమైన వృద్ది ఉండగలదు. ప్రస్తుతం తయారీ, సేవా రంగాలు పన్ను రీత్యా వేరువేరుగా ఉన్నాయి. అవన్నీ ఒకే గొడుగు కిందకు రాగలవు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే జీఎస్‌టీ బిల్లును ఆమోదించడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభ సమయానికి చట్టం అమలుపరిచేలా చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications