50 లక్షల మంది పింఛనుదార్లు, 4 కోట్ల మంది వినియోగదార్లు తప్పనిసరిగా ఆధార్ సంఖ్యను లేదా ఆధార్‌కు దరఖాస్తు చేసిన ప్రతిని సమర్పించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) పేర్కొంది. ఈ నెలాఖరులోగా వీటిని
50 లక్షల మంది పింఛనుదార్లు, 4 కోట్ల మంది వినియోగదార్లు తప్పనిసరిగా ఆధార్ సంఖ్యను లేదా ఆధార్‌కు దరఖాస్తు చేసిన ప్రతిని సమర్పించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) పేర్కొంది. ఈ నెలాఖరులోగా వీటిని అందజేయాలని ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి.పి. జోయ్ పేర్కొన్నారు. 'ఈ నెలాఖరున పరిస్థితి సమీక్షించిన అనంతరం ఖాతాదార్లు, పింఛనుదార్లకు మరింత సమయం ఇచ్చే అవకాశం ఉంద'ని జోయ్ వివరించారు. ఈ విషయానికి విస్తృత ప్రచారం కల్పించాలని 120కి పైగా క్షేత్ర కార్యాలయాలను ఈపీఎఫ్‌ఓ కోరింది. అవి కంపెనీలకు నోటీసులు పంపడం ద్వారా సభ్యులు, పింఛనుదార్లకు ఆధార్ సమర్పించడంపై అవగాహన కల్పించాలని తెలిపింది. ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్)లో పింఛను, సభ్యత్వం కొనసాగాలంటే ఆధార్ సమర్పించాలని కార్మిక శాఖ కూడా ఒక నోటిఫికేషన్‌లో కోరింది. పీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలు

కొత్త పీఎఫ్ చందాదారుల నమోదు:
2017 సంవత్సరానికి ఈపీఎఫ్ క్యాంపెయిన్‌ను మొదలుపెట్టిన ఈపీఎప్‌వో ఏడాదికి రూపాయి రుసుముతో ఉద్యోగం కల్పించే సంస్థలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీని ప్రకారం ఈ పథకం ద్వారా కొత్త ఉద్యోగులను ఉద్యోగ భవిష్య నిధి(పీఎఫ్) పరిధిలోకి తెచ్చేందుకు యాజమాన్యాలు రూపాయి చెల్లిస్తే చాలు. ఒకవేళ ఇదివరకే ఉద్యోగులకు యాజమాన్యాలు చెల్లిస్తున్న మొత్తాన్ని చెల్లించకుండా ఎగవేసి ఉంటే దాన్ని చెల్లించనక్కర్లేదని ఈపీఎఫ్‌వో ప్రకటనలో తెలిపింది. కొత్త ప్రచార పథకంలో భాగంగా మార్చి వరకూ ఈ సౌకర్యాన్ని యాజమాన్యాలు ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగులు ఇదివరకే ఉద్యోగ అనుభవం ఉన్నా లేక కొత్తగా కార్మిక శక్తిలో చేరుతున్నా పీఎప్ సౌకర్యాన్ని పొందేందుకు అవకాశం ఉంది. ఉద్యోగులందరినీ ప్రావిడెంట్ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్యోగం కల్పించే సంస్థలు కృషి చేయాల్సి ఉంది. దీని వల్ల కార్మికులకు సామాజిక భద్రత దక్కగలదు. ఆన్‌లైన్‌లో డూప్లికేట్ ఆధార్ కార్డు పొందడం ఎలా?


Click it and Unblock the Notifications