మీ ఐటీ వెబ్‌సైట్ లాగిన్ వివరాలు అనధికారిక వ్యక్తులకు ఇవ్వొద్దు: ఆదాయపు పన్ను శాఖ
పన్ను చెల్లింపుదారులు తమ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను ఎవరితో పడితే వారితో పంచుకోవద్దని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. ఒకవేళ ఈ వివరాలు అనధికారిక వ్యక్తుల చేతులోకి వెళ్తే చెల్లింపుదార్ల కీలక సమాచారం దుర
పన్ను చెల్లింపుదారులు తమ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను ఎవరితో పడితే వారితో పంచుకోవద్దని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. ఒకవేళ ఈ వివరాలు అనధికారిక వ్యక్తుల చేతులోకి వెళ్తే చెల్లింపుదార్ల కీలక సమాచారం దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా ఇతరుల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఉపయోగించే వారు కూడా తదనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. టీడీఎస్ రీకాన్సిలేషన్ అనాలసిస్ అండ్ కరెక్షన్ ఎనేబిలింగ్ సిస్టమ్(ట్రేసెస్)లో లాగిన్ ఐడీ సమాచారం వినియోగించే సమయంలో వినియోగదార్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ట్రేసెస్ అనేది టీడీఎస్ లేదా టీసీఎస్‌ల దిద్దుబాటుతో పాటు పన్ను ఫైలింగ్‌ను సులభతరం చేసింది.
పాస్‌వర్డ్, యూజర్ ఐడీలలో కనీసం ఎనిమిది అక్షరాలు ఉండేలా, అందులోనూ అంకెలు, ప్రత్యేక అక్షరాలు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు యూజర్ ఐడీ, పాస్‌వర్డు ఎంతో కీలకమైందని పేర్కొంది. వీటితో టిడిఎస్ సంబంధిత రహస్య సమాచారం, కీలకమైన డేటా మారేందుకు అవకాశముంటుందని హెచ్చరించింది. మీ ఈ-మెయిల్ అకౌంట్ ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డుల కీలక సమాచారం కూడా ఇతర వ్యక్తుల చేతిల్లోకి పోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
More From GoodReturns

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్‌పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!



Click it and Unblock the Notifications
