ఇంత‌మంది ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయలేదా?

67.54 లక్షల మంది రిటర్నులు దాఖలు చేయలేదని 2014-15 లావాదేవీలపై సీబీడీటీ అంచ‌నా వేసింది. ఐటీ విభాగానికి చెందిన సీబీడీటీ ఇటీవల ఏర్పాటు చేసిన నాన్‌ ఫైలర్స్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎన్‌ఎమ్‌ఎస్‌) ద్వారా ఈ వి

67.54 లక్షల మంది రిటర్నులు దాఖలు చేయలేదని 2014-15 లావాదేవీలపై సీబీడీటీ అంచ‌నా వేసింది. ఐటీ విభాగానికి చెందిన సీబీడీటీ ఇటీవల ఏర్పాటు చేసిన నాన్‌ ఫైలర్స్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎన్‌ఎమ్‌ఎస్‌) ద్వారా ఈ వివరాలు లభించినట్లు తెలుస్తోంది. ఆదాయ పన్ను విభాగం నిర్వహించిన అయిదో దశ సమాచార తనిఖీలో అదనంగా 67.54 లక్షల మంది రిటర్నులు దాఖలు చేయలేదని తెలుస్తోంది. వీరంతా 2014-15 ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలోనే లావాదేవీలు నిర్వహించారు.

ఇది కూడా చ‌ద‌వండి దేశంలో ఈ ఆదాయాల‌కు ప‌న్నుండ‌దు

CBDT Identifies 67.54 Lakh Income Tax Non-Filers For 2014-15

2014-15 ఆర్థిక సంవ‌త్స‌రంలో అధిక లావాదేవీలు జరిపినప్పటికీ 67.54 లక్షల మంది రిటర్నులు దాఖలు చేయలేదని ఆదాయ పన్ను(ఐటీ)శాఖ గుర్తించింది. అయితే వీరంతా మదింపు ఏడాది 2015-16కు ఆదాయ రిటర్నులను దాఖలు చేయలేదని సీబీడీటీ పేర్కొంది. వార్షిక సమాచార రిటర్ను(ఏఐఆర్‌), కేంద్ర సమాచార శాఖ(సీఐబీ), టీడీఎస్‌/టీసీఎస్‌ సమాచారం ఆధారంగా సీబీడీటీ వ్యవస్థ వీరిని గుర్తించింది. రిటర్నులు దాఖలు చేయనివారి వివరాలన్నీ ఆదాయపన్ను విభాగం ఈ ఫైలింగ్‌ పోర్టల్‌లోని కాంప్లయన్స్‌ మాడ్యూల్‌లో అందుబాటులో ఉంచారు. అనుమానం ఉన్న వారు తమ పాన్‌ సహాయంతో పోర్టల్‌లోకి లాగిన్‌ అయి చెక్‌ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదార్లు తమ వాస్తవ ఆదాయాలను వెల్లడించి..పన్నులు సక్రమంగా కట్టాలని ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో.. రిటర్నులు దాఖలు చేయని వారు.. దాఖలు చేసేంత వరకూ తీవ్రంగా కృషి చేస్తామ‌ని సీబీడీటీ వెల్ల‌డించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+