For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌పంచంలో టాప్ 10 మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలు

2015 సంవ‌త్స‌రంలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, బైడూ, యాహూ, మైక్రోసాఫ్ట్ సంస్థ‌ల ద్వారా ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌లు మొత్తం మీడియాల ప్ర‌క‌ట‌నల్లో 19 శాతంగా ఉన్నాయి. జెనిత్ఆప్టీమీడియా 2016 "Top Thirty Global Media Owner

|

అంత‌ర్జాతీయ ప్ర‌క‌ట‌నల‌ మార్కెట్లో డిజిట‌ల్ మీడియా సంస్థ‌లు త‌మ ఆధిప‌త్యాన్ని చాటుతున్నాయి. 2015 సంవ‌త్స‌రంలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, బైడూ, యాహూ, మైక్రోసాఫ్ట్ సంస్థ‌ల ద్వారా ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌లు మొత్తం మీడియాల ప్ర‌క‌ట‌నల్లో 19 శాతంగా ఉన్నాయి. జెనిత్ఆప్టీమీడియా 2016 "Top Thirty Global Media Owners" report పేరిట ఒక నివేదిక‌ను విడుద‌ల చేసింది. దాని ప్ర‌కారం ప్రపంచంలో రెవెన్యూ ప‌రంగా దూసుకెళుతున్న టాప్ టెన్ మీడియా సంస్థ‌లివే....

1. అల్ఫాబెట్

1. అల్ఫాబెట్

గూగుల్ మాతృ సంస్థ అయిన అల్ఫాబెట్ రెవెన్యూ(సంప‌ద‌) 59.62 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. అల్ఫాబెట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్‌గా ఎరిక్ స్క్మిత్(Eric E. Schmidt Ph.D.) నియ‌మితుల‌య్యారు. ప్ర‌క‌ట‌న‌లే గూగుల్‌కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు. ఇందులో మ‌నంద‌రికీ సుప‌రిచితమైన‌వి గూగుల్ యాడ్‌సెన్స్‌, గూగుల్ యాడ్ వ‌ర్డ్స్‌. మొత్తం ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలోనే డిస్‌ప్లే అడ్వ‌ర్టైజింగ్‌లో గూగుల్ రారాజు. డ‌బుల్‌క్లిక్ యాడ్ టెక్ ప్లాట్‌ఫారం ద్వారా దీన్ని నిర్వ‌హిస్తోంది. యూట్యూబ్ వీడియో ప్ర‌క‌ట‌న‌లు మ‌రో విధంగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఒక్క 2015లోనే గూగుల్ నిర్వ‌హ‌ణ లాభాన్ని 17.4% పెంచుకుని 19.4 బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయాన్ని రాబ‌ట్టుకుంది

2. వాల్ట్ డిస్నీ

2. వాల్ట్ డిస్నీ

ఈ రిపోర్ట్ కోసం వాల్ట్ డిస్నీకి చెందిన మీడియా నెట్‌వ‌ర్క్‌ల‌ను, ఇంటరాక్టివ్ విభాగాల‌ను మాత్ర‌మే జెనిత్ఆప్టీమీడియా ఎంచుకుంది. మీడియా నెట్‌వ‌ర్క్ అంటే ఇక్క‌డ టీవీ షోలు, దానికి సంబంధించిన ఫీజుల‌న్నీ లెక్క‌లోకి వ‌స్తాయి. ఇంట‌రాక్టివ్ లుక్స్‌లో క్ల‌బ్ పెంగ్విన్ గేమ్‌, డిస్నీ ఇన్ఫినిటీ సిరీస్ వంటివి ప్ర‌ధానంగా ఉన్నాయి. ఇంగ్లీష్ టీవీ సీరియ‌ల్స్‌, సినిమాలు చూసే చాలా మందికి సుప‌రిచిత‌మైన సంస్థ వాల్ట్ డిస్నీ. యూఎస్ జాతీయ టీవీ నెట్‌వ‌ర్క్ ఏబీసీ దీనికి చెందిన‌దే. మాడ‌ర్న్ ఫ్యామిలీ, గ్రేస్ అనాట‌మీ వంటి షోల‌ను ఏబీసీ నెట్‌వ‌ర్క్ ప్రసారం చేస్తుంది.

వీడియో స్ట్రీమింగ్ సేవ హులూలో వాల్ట్ డిస్నీకి 33% వాటా ఉంది.

3. కామ్‌కాస్ట్ కార్పొరేష‌న్

3. కామ్‌కాస్ట్ కార్పొరేష‌న్

అమెరికాకు చెందిన కామ్‌కాస్ట్ కార్పొరేష‌న్ ప్ర‌పంచంలోనే అతిపెద్ద మీడియా,బ్రాడ్‌కాస్టింగ్‌, కేబుల్ టెలివిజ‌న్ సంస్థ‌గా ఉంది. 2015లో ఈ సంస్థ రెవెన్యూ 19.72 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. ఈ సంస్థ‌కు ఆదాయం ప్ర‌ధానంగా ఎన్‌బీసీ యూనివ‌ర్సల్ నెట్‌వ‌ర్క్స్‌, బ్రాడ్‌కాస్ట్ టీవీ విభాగాల నుంచి వ‌స్తుంది. దీని కేబుల్ విభాగంలో 15 జాతీయ కేబుల్ నెట్‌వ‌ర్క్స్ ఉన్నాయి. అందులో ముఖ్య‌మైన‌వి యూఎస్ఏ నెట్‌వ‌ర్క్‌, సైఫై(syfy), సీఎన్‌బీసీ, ఇత‌ర 9 అంత‌ర్జాతీయ టీవీ చానెళ్లు. హులూ వీడియో స్ట్రీమింగ్ కామ్‌కాస్ట్ సొంత సంస్థ‌. ప్ర‌పంచంలోనే టాప్ 3 వీడియో స్ట్రీమింగ్‌ల్లో హులూ కూడా ఒక‌టి.

4. ట్వంటీఫ‌స్ట్ సెంచురీ ఫాక్స్‌(21st century fox)

4. ట్వంటీఫ‌స్ట్ సెంచురీ ఫాక్స్‌(21st century fox)

ఫాక్స్ బ్రాడ్‌కాస్టింగ్‌, ఫాక్స్ స్పోర్ట్స్ టెలివిజ‌న్‌, స్టార్ ఇండియా సంస్థ‌లు ట్వంటీ ఫ‌స్ట్ సెంచురీ ఫాక్స్ సొంత సంస్థ‌లు. బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ స్కైలో దీనికి 39% వాటా ఉంది. 2015లో ఈ సంస్థ కేబుల్ నెట్‌వర్క్ ప్రోగ్రామింగ్ విభాగానికి సంబంధించిన రెనెన్యూ 12.2% పెరిగి 13.8 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది. ఫాక్స్‌కు చెందిన సినిమా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, డైరెక్ట్ బ్రాడ్‌కాస్టింగ్ శాటిలైట్ టెలివిజ‌న్ ఆదాయాల‌ను ఇక్క‌డ క‌ల‌ప‌లేదు.

5. ఫేస్‌బుక్‌

5. ఫేస్‌బుక్‌

ప్ర‌జ‌లంతా వినోదం కోసం సినిమాలు, టీవీ మాధ్య‌మాల నుంచి మొబైల్ కోసం మ‌ళ్ల‌డం ఫేస్‌బుక్ సంస్థ‌కు బాగా దోహ‌ద‌ప‌డింద‌ని జెనిత్‌మీడియా విశ్లేషించింది.

గ‌త ఆర్థిక సంవత్స‌రంలోనే ఫేస్‌బుక్ రెవెన్యూ 63% పెరిగింది. మొబైల్ టెక్నాల‌జీని అత్యంత స‌మ‌ర్థంగా ఫేస్‌బుక్ ఉప‌యోగించ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. అంతే కాకుండా వినియోగ‌దారుల‌ను యాప్‌లు, మొబైల్ సైట్ల‌ను ప‌లు సార్లు చూసేలా చేసేందుకు ఫేస్‌బుక్ ఎంత‌గానో కృషి చేసింది. 2015లో మొత్తం సంస్థ ఆదాయంలో మొబైల్ యాడ్ రెవెన్యూ 73% ఉండ‌టం గ‌మ‌నార్హం.

6. బెర్టిల్స్‌మ్యాన్న్‌(Bertelsmann)

6. బెర్టిల్స్‌మ్యాన్న్‌(Bertelsmann)

జ‌ర్మ‌నీకి చెందిన ఈ సంస్థ‌కు ప్ర‌ధానంగా టీవీ, రేడియో గ్రూప్ ఆర్‌టీఎల్ ఉన్నాయి. బుక్ పబ్లిషింగ్ కంపెనీలు ర్యాండ‌మ్ హౌస్‌, పెంగ్విన్‌, మ్యాగ‌జైన్ ప‌బ్లిషింగ్ కంపెనీ గ్రూన‌ర్‌+జార్‌, మ్యూజిక్ కంపెనీ బీఎంజీ, మార్కెటింగ్ కంపెనీ అర్వాతో, బెర్టిల్స్‌మ్యాన్ ఎడ్యుకేష‌న్ గ్రూప్‌, బెర్టిల్స్‌మ్యాన్న్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ సంస్థ గ్రూపులోనివే. గ‌తేడాది డిసెంబ‌రు నాటికి ఈ సంస్థ మొత్తం ఆదాయం 2.8% పెరిగిన‌ట్లు జెనిత్ఆప్టీ మీడియా వెల్ల‌డించింది. టీవీ బిజినెస్‌, డిజిట‌ల్ మీడియా వృద్ది ఇందుకు దోహ‌ద‌ప‌డ్డాయి.

7. వ‌యాకామ్‌

7. వ‌యాకామ్‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌యాకామ్ 250 టీవీ చానెళ్ల‌ను న‌డుపుతోంది. ఎంటీవీ, నికెలోడియ‌న్‌, కామెడీ సెంట్ర‌ల్‌, చానెల్ 5 ఈ సంస్థ‌కు చెందిన ప్ర‌ముఖ టీవీ చానెళ్లు.

భారీగా రేటింగ్‌లు త‌గ్గ‌డంతో వ‌యాకామ్ షేర్లు గ‌త ఐదేళ్ల‌లో 50 శాతానికి పైగా ప‌డిపోయిన‌ట్లు రాయిట‌ర్స్ తెలిపింది. 2015 ఏడాది, అంత‌కు ముందు వ‌రుస ఏడు త్రైమాసికాల్లో సంస్థ ప్ర‌క‌ట‌నా ఆదాయం త‌గ్గుద‌ల‌ను న‌మోదు చేసింది.

8. సీబీఎస్ కార్పొరేష‌న్

8. సీబీఎస్ కార్పొరేష‌న్

సీబీఎస్ కార్పొరేష‌న్‌కు ఎక్కువ ఆదాయం టీవీ చానెళ్లు, రేడియోల నుంచే వ‌స్తోంది. 200 అఫిలియేటెడ్ స్టేష‌న్ల‌కు సీబీఎస్ టెలివిజ‌న్ నెట్‌వ‌ర్క్ బ్రాడ్‌కాస్టింగ్ సేవ‌ల‌నందిస్తోంది. ఎన్‌సీఐఎస్‌, బిగ్‌బ్యాంగ్ థియ‌రీ ఇక్క‌డ నుంచే విజ‌య‌వంత‌మ‌య్యాయి. ఈ సంస్థ‌ అమెరికా వ్యాప్తంగా 117 రేడియో స్టేష‌న్ల‌ను క‌లిగి ఉంది.

9. బైడూ

9. బైడూ

2000 జ‌న‌వ‌రి 16 న బైడూ సంస్థ ప్రారంభ‌మైంది. చైనీస్ భాష‌లో సెర్చింగ్ ఇంజిన్ ప్రారంభించాల‌నే యోచ‌న‌లో ఇది మొద‌లైంది. ఇందులో మ్యాప్స్‌, సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌, వినోదం, ఈ-కామ‌ర్స్, మొబైల్ సేవ‌లు సైతం అందుబాటులో ఉంటాయి. ఈ సంస్థ ఆదాయం 96% ప్ర‌క‌ట‌న‌ల నుంచే వ‌స్తోంది. 2014లో 14వ స్థానంలో ఉన్న బైడూ 2015 సంవ‌త్స‌రానికి 9వ స్థానానికి ఎగ‌బాకింది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో సంస్థ ఆదాయం 7.895 బిలియ‌న్ డాల‌ర్లు.

10. న్యూస్‌కార్ప్

10. న్యూస్‌కార్ప్

ప్ర‌పంచ మీడియా సామ్రాట్ రూప‌ర్ట్ ముర్డోక్‌క్ చెందిన‌దే న్యూస్‌కార్ప్ సంస్థ‌. 2013లో న్యూస్ కార్పొరేష‌న్ ఇన్ఫ‌ర్మేష‌న్‌,ప‌బ్లిషింగ్ మ‌రియు బ్రాడ్‌కాస్టింగ్‌, సినిమా వ్యాపారాల‌ను వేరు చేసింది. న్యూస్ కార్పొరేష‌న్‌లో వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్‌, న్యూయార్క్ పోస్ట్ వంటివి ఉన్నాయి. యూకేలో ది టైమ్స్‌, స‌న్ దీనికి సంబంధించిన మాధ్య‌మాలే.

అంతే కాకుండా న్యూస్ అమెరికా మార్కెటింగ్‌, బ్యార‌న్స్ మ్యాగ‌జైన్‌, పుస్త‌క ప్ర‌చుర‌ణ సంస్థ హార్ప‌ర్‌కొల్లిన్స్ ఈ గ్రూపుకు చెందిన ఇత‌ర ప్ర‌సిద్ద కంపెనీలు.

Read more about: media news
English summary

ప్ర‌పంచంలో టాప్ 10 మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలు | Biggest media companies in the world

In 2015, Google, Facebook, Baidu, Yahoo, and Microsoft accounted for 19% of all the global ad spend flowing through all media, according to media agency ZenithOptimedia's 2016 "Top Thirty Global Media Owners" report.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X