For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిర్యాదులు: డిజిటల్ సంతకాల కోసం కొత్త సాప్ట్‌వేర్

By Nageswara Rao
|

ముంబై: పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) డిజిటల్‌ సంతకాలతో కూడిన ఐటి రిటర్న్‌ల కోసం సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ సాప్ట్‌వేర్ ద్వారా డిజిటల్ సంతకాల ప్రక్రియ మరింత సులభం కానుంది.

 ఫిర్యాదులు: డిజిటల్ సంతకాల కోసం కొత్త సాప్ట్‌వేర్

ఫిర్యాదులు: డిజిటల్ సంతకాల కోసం కొత్త సాప్ట్‌వేర్

డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్‌తో ఐటీ రిటర్నులు అప్‌లోడ్ చేసే సమయంలో ఈ ఫైలింగ్ విధానంలో సమస్యలు తలెత్తతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారని సీబీడీటీ తెలిపింది. గూగుల్‌ క్రోమ్‌, మోజిల్లా, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ తాజా వెర్షన్లు ఇప్పటివరకు అమలులో ఉన్న జావా ఆప్లెట్‌ను అనుమతించకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని సీబీడీటీ పేర్కొంది.

 ఫిర్యాదులు: డిజిటల్ సంతకాల కోసం కొత్త సాప్ట్‌వేర్

ఫిర్యాదులు: డిజిటల్ సంతకాల కోసం కొత్త సాప్ట్‌వేర్

ఈ సమస్యను పరిష్కరించేందుకు, డిజిటల్‌ సంతకంతో ఐటి రిటర్న్‌ దాఖలు చేయడాన్ని మరింత సులభతరం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తేలిగ్గా ఉపయోగించగల సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని, దాన్ని పన్ను చెల్లింపుదారులు తమ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజిటల్‌ సంకతం ప్రక్రియ పూర్తి చేయవచ్చునని ఆ ప్రకటనలో తెలిపింది.

 ఫిర్యాదులు: డిజిటల్ సంతకాల కోసం కొత్త సాప్ట్‌వేర్

ఫిర్యాదులు: డిజిటల్ సంతకాల కోసం కొత్త సాప్ట్‌వేర్

డిజిటల్ సంతకం చట్టం అమల్లో ఉన్న అతి కొద్దిపాటి దేశాల్లో భారత్ ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో ఆదాయపు పన్ను రిటర్న్‌ల ఈ ఫైలింగ్‌ 27.22 శాతం పెరిగింది.

 ఫిర్యాదులు: డిజిటల్ సంతకాల కోసం కొత్త సాప్ట్‌వేర్

ఫిర్యాదులు: డిజిటల్ సంతకాల కోసం కొత్త సాప్ట్‌వేర్

ఏప్రిల్‌-డిసెంబర్‌ నెలల మధ్య కాలంలో దాఖలైన రిటర్న్‌ల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 2.43 కోట్ల నుంచి 3.09 కోట్లకు చేరింది.

English summary

ఫిర్యాదులు: డిజిటల్ సంతకాల కోసం కొత్త సాప్ట్‌వేర్ | CBDT develops new software for filing digitally signed income tax returns

The Central Board of Direct Taxes (CBDT) has developed a new software after taxpayers complained of problems in filing income tax (I-T) returns with digital signatures.
Story first published: Wednesday, January 27, 2016, 17:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X