నవంబర్ 5న మార్కెట్లోకి తొలి దేశీయ బంగారు నాణం
గోల్డ్ మానిటైజేషన్, గోల్డ్ డిపాజిట్ పథకాలను నవంబర్ 5న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. అశోక చక్ర ముద్రతో తయారువుతోన్న తొలి దేశీయ బంగారు నాణెం కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. వీటిని ప్రధాని మోడీ అదే రోజున మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

నవంబర్ 5న మార్కెట్లోకి తొలి దేశీయ బంగారు నాణం
ఈ పథకాల ద్వారా దేశంలో నిరుపయోగంగా ఉన్న దాదాపు 20,000 టన్నుల బంగారాన్ని ఆర్థిక అవసరాలకు ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా 5,10 గ్రాముల బరువులో ఉండే బంగారు నాణేలను సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది.

నవంబర్ 5న మార్కెట్లోకి తొలి దేశీయ బంగారు నాణం
‘ఇండియా గోల్డ్ కాయిన్స్' పథకంలో భాగంగా ముందుగా 20 వేల 5 గ్రాముల బంగారు నాణేలను, 30 వేల 10 గ్రాముల బంగారు నాణేలను విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. ఈ నాణేలను బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా విక్రయిస్తారు.

నవంబర్ 5న మార్కెట్లోకి తొలి దేశీయ బంగారు నాణం
మార్కెట్ ధరలతో పోలిస్తే వీటి ధర కొద్దిగా తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇక సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్లు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

నవంబర్ 5న మార్కెట్లోకి తొలి దేశీయ బంగారు నాణం
దీపావళి పండుగ (నవంబర్ 11)కు బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయనే భావనతో ఈ పథకాలతో పాటు నాణేలను కూడా ప్రధాని ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అందుకోసం దీపావళికి ముందే ఈ బంగారు నాణేల విడుదల చేస్తున్నందున వీటికి మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications