చందారులతో దీర్గకాల బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దేశంలోనే తొలిసారిగా టెలినార్ వినూత్న సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ప్రతినెలా రీచార్జ్ చేయించుకునే మొత్తానికి 100 రెట్లు అధికంగా ఇన్సూరెన్స్ లభిస్తుందని టెలినార్ ఇండియా సీఈఓ వివేక్ సూద్ తెలిపారు.
దేశంలో ఒక మొబైల్ ఆపరేటర్ ఈ తరహా స్కీమ్‌ను ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. ఇలా గరిష్టంగా రూ. 50,000 వరకు ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు. కానీ ఈ ఉచిత ఇన్సూరెన్స్ కావాలంటే మాత్రం రీచార్చ్ మొత్తాన్ని ప్రతి నెలా కనీసం రూ. 20 చొప్పున పెంచుకుంటూ పోవాలని కంపెనీ నిబంధన విధించింది.
యునినార్ కంపెనీ టెలినార్‌గా మారిన సమయంలోనే రెండు వారాల క్రితం ప్రారంభించిన ఈ స్కీమ్‌ను బుధవారం లాంఛనంగా ప్రారంభించడంతో పాటు తొలి కస్టమర్‌కు ఐఆర్‌డిఏ చైర్మన్ టి.ఎస్. విజయన్ చేతుల మీదుగా ఇన్సూరెన్స్ పాలసీని అందించారు.

మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా
టెలినార్‌లో కొత్త కస్టమర్‌గా చేరిన వారందరికీ సిమ్‌తో పాటుగా రెండు నెలల కాలానికి పది వేల రూపాయలకు ఉచిత బీమా కూడా అందుతుంది. ఇప్పటికే కస్టమర్లుగా ఉన్న వారు ఉచితబీమా ప్రయోజనం పొందేందుకు నమోదు చేసుకుని ప్రతీ రీచార్జ్ పైన నెల రోజుల కాలానికి ఉచిత బీమా ప్రయోజనం పొందవచ్చు.

మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా
ఈ బీమా కాలపరిమితి నెలరోజులే ఉంటుంది. పాలసీ దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే ప్రతీ నెలా రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే రీచార్జ్ మొత్తం రూ. 500 దాటితే ప్రతినెలా అదనంగా రీచార్జ్ మొత్తాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ కావాలనుకునే వారు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చని, అక్కర్లేని వారు సాధారణ రీచార్జ్ చేసుకోవచ్చని వివేక్ సూద్ తెలిపారు.

మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా
ఈ స్కీమ్ కింద ఇప్పటికే లక్ష మంది కస్టమర్లు నమోదయ్యారని వివేక్‌సూద్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రారంభం నుంచి తాము అల్పాదాయ వర్గాలకు చెందిన కస్టమర్లే టార్గెట్‌గా ప్లాన్‌లు ఆవిష్కరించామని, అలాగే అల్పాదాయ వర్గాలకు బీమా రక్షణ అందించడం ద్వారా వారికి సాధికారత అందిస్తున్న శ్రీరామ్ లైఫ్‌తో ఈ స్కీమ్‌లోని కస్టమర్లకు బీమా కోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు.

మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ్‌లైఫ్ సీఈవో మనోజ్ జైన్ మాట్లాడుతూ దీనివల్ల ప్రజల్లో బీమాపై అవగాహన మరింత పెరుగుతుం దన్నారు. గతేడాది రూ. 500 కోట్లుగా ఉన్న కొత్త ప్రీమియం ఆదాయం ఈ ఏడాది రూ. 700 కోట్లు దాటుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications