న్యూఢిల్లీ: నూతన సంవత్సరం దేశంలోని యువతకు భారీగానే ఉద్యోగాలను అందించేందుకు సిద్ధమైంది. దేశీయ కార్పొరేట్ కంపెనీలు 2015లో 10 లక్షల వరకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని, సిబ్బందికి గరిష్ఠంగా 40 శాతం వరకు వేతనం పెంచే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది జీతాల పెంపు సరాసరిగా 15-20 శాతం మధ్యలో ఉండవచ్చని వారి అంచనా.
నిరుడు అన్ని రంగాల్లోనూ కలిపి పెంపు 10-12 శాతం మధ్యలో నమోదైంది. ఈ-కామర్స్ వంటి కొత్త రంగాల్లో ఈ ఏడాది వేతనాల పెంపు భారీ స్థాయిలో ఉండవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 5.5 శాతానికి చేరుకోనున్న నేపథ్యంలో సంస్థల వ్యాపారాలు కూడా పుంజుకోనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా ఉద్యోగావకాశాలు సైతం పెరుగనున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

దేశీయ సంస్థలు అన్ని కేటగిరీల్లోనూ పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టవచ్చని మానవ వనరులు సమకూర్చే సంస్థలు చెబుతున్నాయి. అదే విధంగా అంతర్జాతీయ కంపెనీలు కూడా ఈ ఏడాది భారత్‌లో తమ వ్యాపారాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు, ఫలితంగా ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్ పోస్టులతో ఇతర కేటగిరీల్లోనూ భారీగా ఉద్యోగావకాశాలు లభించవచ్చని వారు పేర్కొన్నారు.
నూతన సంవత్సరం అన్ని రంగాల్లో కలిపి కొత్తగా 9.5 లక్షల ఉద్యోగావకాశాలు లభించవచ్చని ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ మై హైరింగ్ క్లబ్ డాట్ కామ్ అంచనా వేసింది. ఇందులో ఐటీ, ఐటీఈఎస్, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్లు జాబ్ మార్కెట్‌ను ముందుండి నడిపించవచ్చని తెలిపింది. గడిచిన మూడేండ్లతో పోలిస్తే కొత్త సంవత్సరం ఫ్రెషర్లకు ఈ-కామర్స్, బ్యాంకింగ్, ఐటీ, ఐటీఈఎస్, రిటైల్ సెక్టార్లలో అధిక అవకాశాలు లభించవచ్చని మై హైరింగ్ క్లబ్ డాట్ కామ్ సిఈఓ రాజేష్ కుమార్ తెలిపారు.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications