నివేదిక: మగవాళ్లేం తక్కువ కాదు!

మహిళలాగే ఏరికోరి మరీ ఆభరణాలను తయారు చేయించుకుని వాటిని సందర్భానుసారంగా ధరించే నగర పురుషులు అధికమవుతున్నారని ప్లాటినం గైడ్ తన నివేదికలో పేర్కొంది. బంగారు ఆభరణాల కొనుగోళ్ల విషయంలో చొరవ తీసుకోవడమే కాకుండా కొత్త డిజైన్ల ఏమున్నాయో ఆరా తీయడం, ట్రెండ్‌కు తగిన వాటిని ఎంచుకోవడంలో మగవారు ముందుంటున్నారని నివేదిక తెలిపింది. వయస్సుతో సంబంధం లేకుండా మగవారందరూ విలువైన ఆభరణాలను కొనుగోలు చేసేందుకు తమ పెట్టుబడులు వెచ్చిస్తున్నారని సర్వేలో వెల్లడైంది.
పెట్టుబడుల పేరుతో ఆభరణాలు కొనేసి అలంకరించుకునే వారు ఎక్కువయ్యారని, ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా ఈ ధోరణి క్రమంగా వ్యాపిస్తోందని తెలిపింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో మగవారు అధికంగా ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారని, కొనుగోళ్ల విషయంలో ఈ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే వెల్లడించింది. గుజరాత్‌లో అయితే బంగారు నాణాలు, బిస్కట్ల తర్వాత ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారని నివేదిక పేర్కొంది.
ముంబై, అహ్మదాబాద్, బరోడా, పుణె, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి వంటి నగరాలు పురుషుల అభరణాలకు కీలక మార్కెట్లుగా ఉన్నాయని పేర్కొంది. ప్రత్యేకంగా పురుషుల కోసం ప్లాటినం, బంగారంతో తయారు చేసిన ఉంగరాలు, గొలుసులు, బ్రాస్‌లెట్లు ఈ మార్కెట్లలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయని తెలిపింది. అందుకే భారత్ పురుషుల ఆభరణాల మార్కెట్లో మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిందని ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ సంస్థ ఇండియా మేనేజర్ బెనర్జీ తెలిపారు.


Click it and Unblock the Notifications