For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు తగ్గడానికి కారణం ఏమై ఉంటుంది..?

By Nageswara Rao
|

Gold
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడ్డ పరిణామాలతో బంగారం ధరలు వరుసగా ఏడోరోజు నష్టాల్లో ఉన్నాయి. డాలర్ బలపడటంతో ఈరోజు బంగారం ఔన్స్ ధర 3 డాలర్లు నష్టపోతూ 1382 డాలర్ల సమీపంలో ట్రేడ్ అవుతుంది. గత పది రోజులుగా చూసినట్లైతే ఔన్స్ ధర సుమారు 100 డాలర్ల వరకూ కోల్పోయింది. దీంతో అమెరికా కేంద్ర బ్యాంకు అయినటువంటి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ బాండ్ల కొనుగోలును నిలిపివేయనుందనే అంచనాలతో డాలర్ పెరిగిపోతుంది.
LIC Jeevan Kishore: A good plan to cover children

ఇది ఇలా ఉంటే ఏప్రిల్ నెల్లో బంగారం ధర బాగా తగ్గినప్పుడు ఇండియా, చైనా అమెరికాల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారంతా ఏప్రిల్‌లో కొనుగోలు చేయడం.. ఇప్పుడు డిమాండ్ కాస్త తగ్గడంతో ధరలు తగ్గాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాదితో పోల్చితే భారత్‌లో ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య బంగారం డిమాండ్ 27 శాతం పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది.

భారత్ గురువారం బంగారం, వెండి దిగుమతుల టారిఫ్ విలువలను ఒక్కసారిగా తగ్గించింది. బంగారానికి సంబంధించి ఈ ధర 10 గ్రాములకు 472 డాలర్ల నుంచి 466 డాలర్లకు తగ్గింది. ఐతే వెండి ధర కేజీకి 762 డాలర్ల నుండి 761 డాలర్లకు తగ్గిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ తన ప్రకటనలో పేర్కొంది.

ఎంసీక్స్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 100 రూపాయలకు పైగా నష్టపోతూ రూ. 26,000 వద్ద ట్రేడవుతోంది. గత రెండు వారాల్లో ఎంసీక్స్‌లో బంగారం ధర 1000 రూపాయలకు పైగా కోల్పోయింది. వారం రోజుల్లో రూపాయి బలహీనపడటం వల్ల మన దేశంలో బంగారం ధర కొంత తక్కువగా నష్టపోతోంది. ఈరోజు డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు నష్టపోతూ 54.88కి సమీపంలో ట్రేడవుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు (మే 17) బంగారం ధరలు:

దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు:

ఢిల్లీ: 10 బంగారం ధర రూ. 26,350
ముంబై: 10 గ్రాముల బంగారం ధర రూ. 26,280
చెన్నై: 10 బంగారం ధర రూ. 26,580
కోలకతా: 10 బంగారం ధర రూ. 26,420
బెంగుళూర్: 10 బంగారం ధర రూ. 26,700
హైదరాబాద్: 10 బంగారం ధర రూ. 26,800

వన్ఇండియా మనీ తెలుగు

Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X