For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

14 శాతం మేరకు పడిపోయిన ఉపాధి కల్పన: అసోచామ్

By Nageswara Rao
|

Job generation drops by over 14.1 per cent: ASSOCHAM
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-మార్చి నెలల మధ్య భారత్‌లో ఉపాధి కల్పన 14 శాతం మేరకు పడిపోయిందని ప్రముఖ పరిశ్రమల సమాఖ్య - అసోచామ్ సర్వే పేర్కొంది. 2011-12 అక్టోబర్-మార్చి మధ్య 3.17 లక్షల ఉద్యోగాల సృష్టించబడగా, 2012-13 ఇదే కాలంలో ఈ సంఖ్య 2.72 లక్షలకు పడిపోయినట్లు సర్వే తెలిపింది. ఆర్థిక మందగమన పరిస్థితులే దీనికి కారణమనీ విశ్లేషించింది. దాదాపు 4,000 కంపెనీల్లో ఉద్యోగ కల్పనలకు సంబంధించి జాబ్ పోర్టల్స్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ సర్వే చేసినట్లు కూడా అసోచామ్ వెల్లడించింది. ప్రధానంగా ఆరు పట్టణాల్లో కల్పించిన ఉద్యోగ అవకాశాలను వెల్లడించగా ఢిల్లీ, పరిసర ప్రాంతాలు అగ్రస్థానంలో నిలువగా, హైదరాబాద్‌ ఐదవ స్థానంలో నిలిచింది.

భారత ఆర్థిక వృద్ధి రేటు మందగమనం, ప్రభుత్వ విధానాల వల్ల నూతన పెట్టుబడులు తగ్గిపోతున్నాయని ఆసోచామ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో నూతన ఉద్యోగాల కల్పన కష్టంగా మారిందని తెలిపింది. 'జాబ్‌ ట్రెండ్స్‌ ఎక్రాస్‌ ఇండియా ఇన్‌ 2012-13' పేరుతో ఉద్యోగాల కల్పనపై ఆసోచామ్‌ ఓ నివేదికను రూపొందించింది.

అసోచామ్‌ ఎకనామిక్‌ రిసెర్చ్‌ బ్యూరో అధ్యయన ముఖ్య సమాచారం:

గత ఆర్థిక సంవత్సరం 2012-13లో దేశ వ్యాప్తంగా మొత్తంగా 5.38 లక్షల ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడ్డాయి. తొలి అర్థ సంవత్సరంలో 2.65 లక్షలు, ద్వితీయ అర్థ సంవత్సరంలో 2.73 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి.

ద్వితీయార్థంలో న్యూఢిల్లీ మరియు రాజధాని పరిసర ప్రాంతాల (ఎన్‌సిఆర్‌)లో మొత్తంగా 66,000 ఉద్యోగాల కల్పన నమోదయ్యిందని పేర్కొంది. తర్వాత స్థానంలో బెంగళూరు 40,000 మందికి అవకాశాలు కల్పించింది. ముంబయిలో 35,500 ఉద్యోగ అవకాశాలు లభించాయి. చెన్నై 21,000ల మందికి ఉపాధి కల్పించగా, హైదరాబాద్‌ 20,930 ఉద్యోగాలను సృష్టించింది.

రంగాల వారిగా చూస్తే ద్వితీయార్థంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నలాజీ (ఐటి) అత్యధికంగా 1.2 లక్షల ఉద్యోగాలు కల్పించి అగ్రస్థానంలో నిలిచింది. విద్యా రంగం 19,500 ఉద్యోగాల భర్తీతో రెండవ స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో బీమా రంగం (12,000), ఆర్థిక సేవలు (11,680), బ్యాంకింగ్‌ (11,675), ఆటోమొబైల్‌ (11,290), తయారీ రంగం (10,670), ఇంజనీరింగ్‌ (9,835), ఐటి హార్డ్‌వేర్‌ (7,000) చొప్పున ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయని పేర్కొంది.

వన్ఇండియా తెలుగు మనీ

English summary

14 శాతం మేరకు పడిపోయిన ఉపాధి కల్పన: అసోచామ్ | Job generation drops by over 14.1 per cent: ASSOCHAM | 14 శాతం మేరకు పడిపోయిన ఉద్యోగాల కల్పన


 Along with the sluggish economic growth rate, the new job generation has declined by 14.1 per cent during the second half of financial year 2012-13 as against the corresponding period last year across India.
Story first published: Tuesday, April 2, 2013, 12:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X