For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఏడాది సెన్సెక్స్ భారీ లాభాలతో ముగింపు: మోర్గాన్ స్టాన్లీ నివేదిక

By Nageswara Rao
|

Sensex likely to see handsome gains in December: Morgan Stanley
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఈ ఏడాది భారీ లాభాలతో ముగిసే అవకాశం ఉంది. ఇప్పటికే 20 శాతం పెరిగిన సెన్సెక్స్ డిసెంబర్ నెలలో భారీగా పుంజుకునే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. 1980 నుండి చూస్తే గత 32 సంవత్సరాల్లో ఈక్విటీ మార్కెట్లు డిసెంబర్‌లో మంచి లాభాలను అందిస్తున్నాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో చూస్తే డిసెంబర్ నెల్లో సగటున 4.6 శాతం రిటర్నులు లభించాయని వివరించింది. గత ఇరవై ఏళ్లలో నాలుగు సందర్బాల్లో 1994, 2000, 2001, 2011లలో మాత్రమే డిసెంబర్‌లో నష్టాలు వచ్చాయి.

ఈ నాలుగు సార్లు మార్కెట్ క్షీణించడానికి కారణాలు వేర్వేరుగా ఉన్నాయని తెలిపింది. 1990 నుంచి అంటే ఎఫ్‌ఐఐలు దేశీయ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌చేయడం మొదలుపెట్టాక డిసెంబర్‌లో దేశీయ ఫండ్స్, స్పెక్యులేటర్ల లావాదేవీలు పుంజుకోవడం మొదలైంది. సెలవుల కారణంగా ఎఫ్‌ఐఐల పెట్టుబడులు డిసెంబర్‌లో మందగించినా, జనవరిలో తిరిగి పుంజు కుంటాయన్న అంచనాలే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయని మోర్గాన్ స్టాన్లీ వివరించింది. ఈ డిసెంబర్‌లో బుల్స్‌కు బాగుంటుందని ఈ నివేదికలో తెలిపింది.

తెలుగు వన్ఇండియా

English summary

ఈ ఏడాది సెన్సెక్స్ భారీ లాభాలతో ముగింపు: మోర్గాన్ స్టాన్లీ నివేదిక | Sensex likely to see handsome gains in December: Morgan Stanley | ఈ ఏడాది సెన్సెక్స్ భారీ లాభాలతో ముగింపు

The BSE benchmark sensitive index Sensex, which has soared 20 per cent this year so far is likely to see handsome gains in the coming month, according to a report by Morgan Stanley.
Story first published: Tuesday, November 27, 2012, 13:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X