అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తోన్న లేదా వేచి చూస్తోన్న వారిలో చాలామంది ఇండియన్స్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. శాశ్వత హోదా కోసం పొందేందుకు ప్రయత్నిస్తున్న దాదాపు 2,50,000 మందిలో 2 లక్షల మంది జూన్ చివరి నాటికి తమ H1B వీసా చట్టబద్ధతను కోల్పోయే ప్రమాదం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. కొంతమంది పునరుద్ధరణ సమయం మించిపోవడం వల్ల కోల్పోనున్నారు. అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ నిస్కనేన్ సెంటర్‌తో కలిసి చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు జెరేమీ న్యూఫెల్డ్ తెలిపారు.

కొద్ది రోజులకు ముందు షాక్
అమెరికాలో శాశ్వత హోదా పొందేందుకు కొంతమందికి రెండు మూడు వారాలు కూడా మిగిలి ఉంది. దాదాపు రెండేళ్లుగా పని చేస్తూ.. శాశ్వత హోదా సమయం దగ్గరకు వచ్చిన సమయంలో కరోనా మహమ్మారి వారికి ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. పైగా ఈ వైరస్ కారణంగా చాలామంది వేతనం లేని సెలవులపై ఉన్నారు. ఇదే భారంగా ఉందని భావిస్తుంటే ఇప్పుడు రేపో ఎల్లుండో వస్తుందనుకున్న హోదా హఠాత్తుగా షాకిచ్చే పరిస్థితి ఏర్పడింది.

భారత్, చైనా వాసులే ఎక్కువ.. ఇబ్బందికరం
అమెరికాలో H1B వీసా పైన పని చేస్తోన్న వారిలో భారత్, చైనా వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఈ రెండు దేశాలకు చెందిన వారి పైనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. H1B వీసా రావడానికి అనేక షరతులు ఉంటాయి. ఉద్యోగం కల్పించే సంస్థ కనీస వేతనం కల్పిస్తానన్న హామీతో పాటు మరిన్ని నిబంధనలను అంగీకరిస్తేనే వీసా వస్తుంది. ఇప్పుడు వేతన కోతలు, వర్క్ ఫ్రమ్ హోమ్, శాలరీ లేని సెలవులు వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇవి H1B నిబంధనలకు విరుద్ధం. కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోయిన కంపెనీలు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. దీంతో కొంతమంది H1B వీసాలు కోల్పోయే ప్రమాదం ఉందని న్యూఫెల్డ్ అభిప్రాయపడుతున్నారు. మరికొంతమందికి ప్రస్తుతానికి ఇబ్బందులు లేకున్నప్పటికీ మున్ముందు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి.

60 రోజుల సమయం మాత్రమే
2,50,000 మంది గెస్ట్ వర్కర్లు గ్రీన్ కార్డు కోసం చూస్తున్నారు. ఇందులో H1B వీసాపై ఉన్న 2,00,000 మందికి జూన్ చివరి నాటికి లీగల్ స్టేటస్ ముగిసిపోతుంది. అంతేకాదు శాశ్వత నివాస హోదా కోరుకోని వారు కూడా స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితులు ఉండవచ్చునని చెబుతున్నారు. H1B వీసాపైన వచ్చే వారిలో మూడొంతుల మంది టెక్నాలజీ ఇండస్ట్రీలో పని చేస్తుంటారు. కరోనా కారణంగా గత రెండు నెలలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో H1B వీసా ఉన్నవారు కూడా ఉన్నారు. ఉద్యోగం కోల్పోయిన 60వ రోజుల్లో మరో ఉద్యోగం పొందాలి. లేదంటే అమెరికా వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైరస్ కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో కొత్త ఉద్యోగాలు కష్టతరమే అంటున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications