ఇండియాలో మూడో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకు ఐన యాక్సిస్ బ్యాంకు లో ఎదో సంక్షోభం మొదలైనట్లుంది. గత కొన్ని నెలల్లోనే సుమారు 15,000 మంది ఉద్యోగులు బ్యాంకు కు రాజీనామా చేశారని సమాచారం. దీంతో ఒక్కసారిగా బ్యాంకులో అసలు ఏం జరుగుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. రాజీనామా చేసిన వారిలో అధికంగా మిడ్ లెవల్ ఉద్యోగులు, బ్రాంచ్ స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ది ఎకనామిక్ టైమ్స్ ఈ అంశంపై ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
కొత్త మానేజ్మెంట్ విధిస్తున్న వృద్ధి లక్ష్యాలను చేరుకోవటానికి ఇబ్బంది పడుతున్నవారు బ్యాంకును వీడుతున్నల్టు ప్రాథమికంగా తేలింది. కానీ అసలు కారణాలు వేరే అయి ఉంటాయని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది సీనియర్ లెవల్ ఉద్యోగులు కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. మొత్తంగా బ్యాంకు పనితీరు, కల్చర్ మారిపోవడంతో దానితో ఇమడలేని వారు బ్యాంకుని వీడుతున్నారని చెబుతున్నారు.

అవును నిజమే...
భారీ సంఖ్యలో ఉద్యోగులు రాజీనామా చేసిన విషయాన్నీ ఆక్సిస్ బ్యాంకు కూడా అంగీకరించినట్లు ది ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. అయితే, కారణాలను మాత్రం వెల్లడించలేదని తెలిపింది. అదే సమయంలో ఆక్సిస్ బ్యాంకు కొత్తగా సుమారు 28,000 ఉగ్యోగులను నియమించినట్లు కూడా తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రిమాషికంలో మరో 4,000 మందిని రేసీరియట్ చేసుకుంటామని ప్రకరించింది. దీంతో మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆక్సిస్ బ్యాంకు నికర నియామకాలు 12,800 గా ఉంటాయని తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో మరో 30,000 మంది ఉద్యోగులను నియమించనున్నట్లు కూడా ఆక్సిస్ బ్యాంకు వెల్లడించింది. కాగా తక్కువ సమయంలో 15,000 మంది ఉద్యోగులు బ్యాంకును వీడటంతో ఆక్సిస్ బ్యాంకు అట్ట్రిషన్ రేటు 15% నుంచి 19% నికి పెరిగింది.

72,000 మంది ఉద్యోగులు...
ఆక్సిస్ బ్యాంకులు మొత్తంగా 72,000 మంది ఉయోగులు పనిచేస్తున్నారు. కాగా గతేడాది సుమారు 11,500 మంది ఉద్యోగులు బ్యాంకును వీడినట్లు తెలింది. దీనిపై స్పందించిన ఆక్సిస్ బ్యాంకు ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ దహియా మాత్రం ఉద్యోగులే తమ అతిపెద్ద ఆస్తులని పేర్కొన్నారు. బ్యాంకు వేగంగా విస్తరిస్తుండటంతో రిక్రూట్మెంట్ కూడా అధిక సంఖ్యలో జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా... ఆక్సిస్ బ్యాంకు మాజీ సీఎండీ శిఖా శర్మ కొనసాగింపునకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో సారి అవకాశం ఇవ్వకపోవటంతో... బ్యాంకు కొత్తగా అమితాబ్ చౌదరి ని సీఈఓ గా నియమించింది. అయన రిస్క్ తీసుకునే బదులు, తన లక్ష్యాలను సాధించేందుకు సొంత ఎంపికను ఎంచుకొంటున్నారని కొందరి అభిప్రాయంగా ఉంది.

లాభాలే లక్ష్యం...
కొత్త సీఈఓ అమితాబ్ చౌదరి తనకు నచ్చిన సీనియర్ ఉద్యోగులను నియమించుకొంటున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ గతంలో హెచ్ డి ఎఫ్ సి లైఫ్ లో ఉన్నతాధికారిగా పని చేశారు. ఆయన లక్ష్యం మాత్రం బ్యాంకును వృద్ధి దిశగా నడిపించటం, మెరుగైన లాభాలు ఆర్జించటం, అలాగే నిలకడైన పనితీరును కనబరచడమేనని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా... ఒకేసారి పెద్ద మొత్తంలో ఉద్యోగులు వీడితే బ్యాంకులో జరగ రానిది ఏదో జరుగుతుందన్న అనుమానాలు రావటం సహజమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికి కాలమే సమాధానం చెప్పగలదని వారు అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications