ఈ ఏడాది భారతదేశంలో ప్రధాన కార్పోరేట్ కంపెనీలు నియామకాలను గణనీయంగా పెంచుతున్నాయని తాజా బ్లైండ్ (Blind) సర్వే వెల్లడించింది. అమెరికాలో కొనసాగుతున్న భారీ ఉద్యోగ తొలగింపులు, కఠినమైన వీసా విధానాలు, అలాగే కృత్రిమ మేధ (AI) కారణంగా మారుతున్న ఉద్యోగ నిర్మాణం నేపథ్యంలో కంపెనీలు తమ వృద్ధి వ్యూహాలను భారతదేశం వైపు మళ్లిస్తున్నట్లు ఈ సర్వే స్పష్టంగా సూచిస్తోంది.
జనవరి 5 నుంచి జనవరి 11 మధ్య అమెరికాతో పాటుగా భారతదేశాల్లోని 2,392 మంది ధృవీకరించబడిన నిపుణులపై ఈ సర్వే నిర్వహించబడింది. ఇందులో దాదాపు 93 శాతం మంది తమ యజమానులు.. ఉబెర్, గూగుల్, మైక్రోసాఫ్ట్, క్యాపిటల్ వన్, డి.ఇ. షా గ్రూప్ వంటి ప్రముఖ గ్లోబల్ సంస్థలు ఈ సంవత్సరం ఇండియాలో నియామకాలను పెంచుతున్నాయని తెలిపారు.

ఈ నియామకాలు కేవలం అదనపు మద్దతుగా కాకుండా.. కొన్ని సమయాల్లో అమెరికాలో ఉన్న పాత్రలను ప్రత్యక్షంగా భర్తీ చేస్తున్నాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 38 శాతం మంది భారతదేశ నియామకాలు అమెరికా ఆధారిత ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయని చెప్పారు. మరో 23 శాతం మంది భారతదేశ నియామకాలు అమెరికా నియామకాలకు తోడ్పాటుగా ఉంటున్నాయని తెలిపారు. ఇది కంపెనీలు ఆఫ్‌షోరింగ్‌ను అనుబంధ వ్యూహంగా కాకుండా, ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయనే సంకేతాన్ని ఇస్తోంది.
బ్లైండ్ అనేది ఒక అనామక ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్. ఇక్కడ ఉద్యోగులు తమ కార్యాలయ సంస్కృతి, జీతాలు, నియామకాలు, తొలగింపులు వంటి అంశాలపై నిజాయితీగా చర్చిస్తారు. అందుకే ఈ సర్వే ఫలితాలు పరిశ్రమలో జరుగుతున్న వాస్తవ మార్పులను ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
కంపెనీలు India లో ఎలా విస్తరిస్తున్నాయనే అంశాన్ని పరిశీలిస్తే.. 25 శాతం మంది తమ కంపెనీలు భారత్ లో ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నాయని చెప్పగా.. 20 శాతం మంది ఇండియాలో పూర్తిగా కొత్త ఉద్యోగాలు రెడీ అవుతున్నాయని తెలిపారు. మరో 20 శాతం మంది అమెరికా ప్రాజెక్టులను ఇండియాకు తరలిస్తోందని అలాగే ఉద్యోగులకు కూడా తరలిస్తున్నట్లు తెలిపారు. పై అంశాలన్నీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ ప్లానింగ్‌లో కొత్త మార్పుకు వేదిక అవుతున్నాయి.
ఈ మార్పుకు అమెరికా వీసా విధానాలు కూడా ఒక ప్రధాన కారణంగా మారాయి. గత ఏడాది చివర్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన H-1B వీసా విధానంలో కీలక మార్పులు చేసింది. 2025 సెప్టెంబర్ 21 తర్వాత దాఖలయ్యే కొత్త H-1B పిటిషన్లకు ఒకేసారి లక్ష డాలర్ల రుసుము విధించడమే కాకుండా, లాటరీ విధానానికి బదులు అధిక నైపుణ్యం, అధిక జీతం పొందే కార్మికులకు ప్రాధాన్యం ఇచ్చేలా ఎంపిక విధానాన్ని మార్చింది. ఈ మార్పులు కంపెనీలపై భారీ ఆర్థిక భారం మోపుతున్నాయి.
ఇదే సమయంలో, టెక్ రంగంలో AI విస్తృత వినియోగం వల్ల ప్రాజెక్టుల పునర్వ్యవస్థీకరణ, ఆటోమేషన్ కారణంగా భారీ తొలగింపులు కొనసాగుతున్నాయి. వాల్ స్ట్రీట్ దిగ్గజాలు సిటీ, బ్లాక్‌రాక్ ఇటీవల ఉద్యోగ కోతలను ప్రకటించగా.. మైక్రోసాఫ్ట్ కూడా పెద్ద ఎత్తున తొలగింపులు చేయనున్నట్లు సమాచారం.
CNBC నివేదిక ప్రకారం.. గత సంవత్సరం మొత్తం 1.17 మిలియన్ల ఉద్యోగాలు కోతలకు గురయ్యాయి. ఇది 2020లో COVID-19 మహమ్మారి తర్వాత అత్యధిక స్థాయి. ఈ నేపథ్యంలో బ్లైండ్ సర్వేలో 28 శాతం మంది, కొత్త H-1B వీసా ఆంక్షలే తమ కంపెనీలను భారతదేశంలో నియామకాలు పెంచే దిశగా అడుగులు వేశాయని స్పష్టంగా చెప్పారు. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికాలో అనిశ్చితి పెరుగుతున్న సమయంలో, భారతదేశం గ్లోబల్ కంపెనీలకు ఒక కీలక నియామక కేంద్రంగా మారుతోందని ఈ సర్వే బలంగా సూచిస్తోంది.
More From GoodReturns

Layoffs: లేఆఫ్స్ వల్ల పనితీరు ఎందుకు పడిపోతుంది? సైన్స్ చెబుతున్న నిజాలివే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications