For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Aadhaar Authentication History: ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ చెక్ చేయడం ఎలా?

|

భారత్‌లో అందరికీ ఆధార్ తప్పనిసరి! ఆధార్ కార్డు కలిగిన వారు ఎవరైనా వారి ఆధార్ నెంబర్/VIDని ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ అథెంటికేషన్ రికార్డును వెరిఫై చేయవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమంటే ఈ సేవలకోసం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. మీ ఆధార్ కార్డును గత ఆరు నెలల కాలంలో ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. ఇందుకు ఈక్రింది విధంగా చేయాలి. ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ నుండి ఆధార్ కార్డు దారు పొందగల అంశాలు ఉన్నాయి.

ఈ వివరాలు పొందవచ్చు

ఈ వివరాలు పొందవచ్చు

UIDAI వెబ్ సైట్ ప్రకారం ఆధార్ కార్డు హోల్డర్ ఈ కింది వివరాలు పొందవచ్చు. ప్రామాణిక మోడాలిటీ, ప్రామాణీకరణ తేదీ అండ్ సమయం, UIDAI రెస్పాన్స్ కోడ్, AUA నేమ్, AUA ట్రాన్సాక్షన్ ఐడీ (కోడ్‌తో పాటు), AUA అథెంటికేషన్ రెస్పాన్స్ (సక్సెస్/ఫెయిల్యూర్), UIDAI ఎర్రర్ కోడ్.

హిస్టరీ తనిఖీ

హిస్టరీ తనిఖీ

ఆధార్ లేదా VID నెంబర్‌ను ఉపయోగించి ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ తనిఖీ చేయడానికి ఇలా చేయండి...

- https://resident.uidai.gov.in/aadhaar-auth-history కి వెళ్లాలి.

- ఆధార్ నెంబర్ సెక్షన్లోని 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. లేదా 16 డిజిట్ వర్చువల్ ఐడీ నెంబర్ ఎంటర్ చేయాలి.

- సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.

- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అడిగిన చోట దానిని ఎంటర్ చేయాలి.

- డెమెగ్రాఫిక్, బయోమెట్రిక్, ఓటీపీ, డెమోగ్రాఫిక్ అండ్ బయోమెట్రిక్, బయో మెట్రిక్ అండ్ ఓడీపీ, డెమోగ్రాఫిక్ అండ్ ఓటీపీ నుండి అథెంటికేషన్ టైప్ ఎంచుకోవాలి. అన్నింటిని కూడా ఎంచుకోవచ్చు.

- ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని ఏ తేదీ నుండి తెలుసుకోగోరుతున్నారో పేర్కొనాలి.

- మీరు ట్రాక్ చేయదలిచిన రికార్డ్స్ సంఖ్యను నమోదు చేయాలి. అయితే మీరు ఒకేసారి 50 రికార్డ్స్ మాత్రమే పొందవచ్చునని గుర్తుంచుకోవాలి.

- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మళ్లీ వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. మీరు Verify OTP పైన క్లిక్ చేయాలి.

- ఓటీపీ సక్సెస్ ఫుల్ అనంతరం UIDAI మీ ఆధార్ ప్రామాణిక వివరాలు కలిగిన పేజీని చూపిస్తుంది.

mAadhaar యాప్ ద్వారా..

mAadhaar యాప్ ద్వారా..

mAadhaar యాప్ ద్వారా ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ చెక్ చేసుకోవడం ఇలా...

- మీ మొబైల్ ఫోన్‌లోని mAadhaar యాప్‌ను ఓపెన్ చేసి, My Aadhaar సెక్షన్/ట్యాబ్‌కు వెళ్లాలి.

- Auth History పైన ట్యాప్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత Request OTP పైన క్లిక్ చేయాలి. డ్రాప్ డౌన్ మెను నుండి అథెంటికేషన్ రకాన్ని ఎంచుకోవాలి.

- మీరు మీ ఆధార్ ప్రామాణికరణ హిస్టరీని పొందాలనుకునే తేదీని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలి.

- Submit పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ ప్రామాణికత హిస్టరీ మీ మొబైల్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.

Read more about: aadhaar uidai ఆధార్
English summary

Aadhaar Authentication History: ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ చెక్ చేయడం ఎలా? | Steps to Check Aadhaar Authentication History

According to UIDAI's, residents can get or view the following details in their Aadhaar Authentication history for each Authentication performed by them.
Story first published: Thursday, July 22, 2021, 14:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X