ఆర్థిక మందగమనం, వినియోగం, డిమాండ్ తగ్గుదల, ఉద్యోగాల కల్పన తగ్గిపోవడం, జీడీపీ అంచనాలు రోజు రోజుకు తగ్గుదల.. ఇలాంటి సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. కార్పోరేట్ రంగానికి ఊతమిచ్చేలా కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించారు. వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించారు. ప్రజల వినియోగం పెంచేలా ఈ బడ్జెట్‌లో ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు నేపథ్యంలో ఆదాయపు పన్నులో కూడా మార్పులు ఉండవచ్చునని భావిస్తున్నారు.
బడ్జెట్ గురించి మరిన్ని ఆసక్తికర కథనాలు

మోడీ ప్రభుత్వం సాహసం చేస్తుందా
భారత జీడీపీ వృద్ధి రేటు పెంచాలంటే డిమాండ్ పెరగాలి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను మినహాయింపుపై మిడిల్ క్లాస్ ఆశలు పెట్టుకుంది. పన్ను ఆదాయం తగ్గిన సమయంలో మళ్లీ ఆదాయపు పన్నుపై ఊరట ప్రకటన వస్తుందా అనే చర్చ సాగుతోంది. అయితే కార్పోరేట్ ట్యాక్స్ భారీగా తగ్గించడంతో ఇప్పటికే ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది. ఆదాయపు పన్నుపై కూడా వెసులుబాటు కల్పిస్తే అది మోడీ ప్రభుత్వానికి సాహసమే అవుతుందని, అలాగే రెవెన్యూ కలెక్షన్ పరంగా ఇబ్బందులు అంటున్నారు.

స్లాబుల్లో మార్పులు ఉండవచ్చు
ఒకవేళ ఆదాయపు పన్ను అంశంపరంగా మార్పులు ఉంటే ఏం ఉంటాయనే అంశంపై చూస్తే.. ప్రస్తుత ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు చేయవచ్చు. చట్టంలోని 80C పరిధిని పెంచవచ్చు.

హోమ్ లోన్స్ వడ్డీ మినహాయింపు
హోమ్ లోన్స్ వడ్డీ పైన మినహాయింపు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి ఉత్తేజాన్ని ఇవ్వడంతో పాటు వినియోగదారులకు ప్రయోజకరంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. అప్పుడు ప్రజల వద్ద నగదు కూడా మిగిలే అవకాశాలు ఉంటాయి.

అలా వెనక్కి తీసుకోవచ్చు
ప్రభుత్వం ఆదాయాపు పన్ను మినహాయింపుల పెంపుతో ఏర్పడిన లోటును ప్రభుత్వం పరోక్ష పన్నుల పెంపుతో తీర్చుకోవచ్చు. జీఎస్టీ స్లాబుల్లో స్వల్ప మార్పులతో దీనిని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే మినహాయింపుల మొత్తం జీఎస్టీ రూపంలో వెనక్కి వస్తుంది.

మినహాయింపు ఉండకపోవచ్చు
చివరగా, ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపులు గత బడ్జెట్ వరకు భారీగానే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవ్వకపోవచ్చుననే వాదనలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6.6 లక్షల కోట్లను ఐటీ రూపంలో, రూ.13.35 లక్షల కోట్లను జీఎస్టీ రూపంలో వసూలు చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. రెండూ టార్గెట్‌ను చేరుకునేలా లేవు. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు వల్ల ప్రభుత్వంపై మరింత భారం పడింది. కాబట్టి ఆదాయపు పన్నులో కోత ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications