కరోనా మహమ్మారి నేపథ్యంలో కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇందుకోసం ఎన్నో కంపెనీలు కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూస్తున్నాయి. కార్యాలయాల్లో శానిటైజర్లు, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా నేపథ్యంలో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ఆందోళన చెందుతున్నారు.

ఇన్ఫోసిస్ రిటర్న్ టు వర్క్ ప్లేస్
కరోనా ఎక్కడి నుండి, ఎలా వస్తుందో తెలియని పరిస్థితి.. అదే సమయంలో ఉద్యోగం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సోకే అవకాశాలు దాదాపు లేకపోవడం అంటే ఉద్యోగులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆ దిశలో అడుగు వేసింది. ఇందులో భాగంగా ఇన్ఫీ 'రిటర్న్ టు వర్క్ ప్లేస్' పరిష్కారాలను గురువారం ఆవిష్కరించింది.

ఈ జాగ్రత్తలు
పెరిగిన శరీర ఉష్ణోగ్రతల స్క్రీనింగ్‌తో పాటు మాస్కులు ధరించడం, ఆఫీసుల్లో ఎంతమంది పని చేస్తున్నారు తదితర అంశాలకు క్లౌడ్, ఎడ్జ్ ఆధారిత పరిష్కారాలను తీసుకు వచ్చింది. అయితే ఇవి వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని గ్రహించవని, కృత్రిమ మేధ బదులుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, విజన్ అనలటిక్స్, ఎడ్జ్ కంప్యూటింగ్, 5జీ, ఆర్ఎఫ్ఐడీ, బయోమెట్రిక్స్, సంజ్ఞల నియంత్రణ ఆధారంగా మానవ జోక్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చునని ఇన్ఫోసిస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ పరిష్కారాలు కూడా డేటా గోప్యత ప్రమాణాలు, ఎఫ్డీఏ, ఎఫ్‌సీసీ, ఐఎస్ఓ, ఐఈసీ నిబంధనలకు కట్టుబడి ఉంటాయన్నారు. ఇందులో పెరిగిన శరీర ఉష్ణోగ్రతల (ఈబీటీ) తనిఖీలను బెంగళూరు, పుణే కార్యాలయాల్లో ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు.

ఏఐ సమాధానాలు, ఆటోమేషన్ శానిటేషన్
తమ క్లయింట్స్ కార్యాలయాలకు కూడా ఈ పరిష్కారాల ద్వారా కరోనా నిరోధకంగా ఉంటాయని ఇన్ఫోసిస్ చెబుతోంది. దీంతో ఉద్యోగులు ఎలాంటి భయాలు లేకుండా కార్యాలయాలకు వస్తారని వెల్లడిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డిజిటల్ అసిస్టెంట్ పరిష్కారాన్ని కూడా ఇన్ఫీ తీసుకు వచ్చింది. ఉద్యోగులు తిరిగి విధులకు హాజరు కావడానికి సమస్యలు ఉంటే సమాధానాలు ఇస్తుంది. ఆఫీసుల్లో సీట్లు, సాంద్రత, కామన్ ఏరియాల్లో ఆటోమేషన్ శానిటేషన్ పరిష్కారాలు సూచించింది.
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications