ఆదాయపు పన్ను వ్యవస్థను సరళీకరించేందుకు ఆ చట్టంలోని పన్ను మినహాయింపులను పరిశీలించగా 100కు పైగా మినహాయింపులు, తగ్గింపులు ఉన్నట్లుగా తేలిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త పన్ను విధానంలో భాగంగా అందులో 70 వరకు మినహాయింపులు తొలగించినట్లు తెలిపారు. మిగతా వాటిని కూడా సమీక్షించి వాటిని కూడా హేతుబద్దీకరిస్తామని, పన్ను వ్యవస్థను సరళీకరించి పన్ను రేట్లను మరింతగా తగ్గిస్తామన్నారు. కొత్త విధానంలోని మినహాయింపులు ఇవే...

మినహాయింపు కోరితే..
పాత పన్ను విధానం కాకుండా కొత్త పన్ను విధానంలోకి రావాలనుకుంటే రూ.15 లక్షల ఆదాయం ఉన్న ఓ వ్యక్తి సెక్షన్ 80C కింద రూ.1,50,000, హోంలోన్ రుణానికి చెల్లించే వడ్డీపై రూ.2 లక్షలు, సెక్షన్ 80D కింద రూ.25 వేలు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలు మినహాయింపు తీసుకుంటే కనుక అప్పుడు మినహాయింపుల మొత్తం రూ.4,250,000 అవుతుంది. దీంతో పన్ను వర్తించే ఆదాయం రూ.10,75,000గా ఉంటుంది.

అధిక ఆదాయం కలిగితే..
నికర పన్ను రూ.1,35,000గా ఉంటుంది. దీనికి నాలుగు శాతం సెస్ కలిపితే రూ.1,40 వేలకు పైగా అవుతుంది. కొత్త పద్ధతిలో పన్ను చెల్లించాలనుకుంటే మినహాయింపులు కట్ అవుతాయి. అప్పుడు దాదాపు రెండు లక్షల రూపాయలు చెల్లించవలసి వస్తుంది. కానీ పాతపద్ధతిలో లక్షా నలభై వేల రూపాయలకు పైగా అవుతుంది. పాత పద్ధతిలో రూ.50వేలకు పైగా ఆదా అవుతుంది.

మినహాయింపులు లేకుండా..
అదే సమయంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా ఉంటే కనుక పాత పద్ధతి కంటే కొత్త పద్ధతి బెట్టర్. మినహాయింపులు లేకుంటే కొత్త పద్ధతిలో దాదాపు రూ.78వేలు ఆదా అవుతుంది. ఏడాదికి రూ.15 లక్షలు సంపాదించే వ్యక్తి కొత్త విధానంలో రూ.1.5 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని, పాత పద్ధతిలో రూ.2.73 లక్షలు చెల్లించవలసి వస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

కొత్త పద్ధతి ఎవరికి, పాత పద్ధతి ఎవరికి బెట్టర్
ఇది అధిక ఆదాయం కలిగిన వారికి కొత్త పన్ను విధానం ప్రయోజనమని చెబుతున్నారు. తక్కువ ఆదాయం కలిగిన వారికి పాత విధానం బెట్టర్ అంటున్నారు. రూ.15 లక్షలు అంతకంటే అంతకంటే ఎక్కువ సంపాదించే వారికి కొత్త పద్ధతి బెట్టర్ అంటున్నారు. మొత్తానికి మినహాయింపులు కోరకుంటే మాత్రం కొత్త ఆదాయపు పన్ను బెట్టర్ అంటున్నారు.

ప్రభుత్వానికి రూ.40వేల కోట్ల ఆదాయం
కొత్త పద్ధతిలో సెక్షన్ 80C, సెక్షన్ 80D, సెక్షన్ 80G ఇలా ఏవీ వర్తించవు. 100లో 70 మినహాయింపులు తొలగించారు. భవిష్యత్తులో మరిన్ని మినహాయింపులు తొలగించే అవకాశాలు ఉన్నాయి. కొత్త పన్ను విధానం వల్ల ప్రభుత్వానికి రూ.40వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

కొత్త విధానంలో ఏం కోల్పోతారు..
- వేతనాలు పొందుతున్న ఉద్యోగస్తులకు నాలుగేళ్లలో రెండుసార్లు వచ్చే లీవ్ ట్రావెల్ అలవెన్స్ మినహాయింపు కోల్పోతారు.
- శాలరైడ్‌కు జీతంతో హౌజ్ రెంటల్ అలవెన్స్ (HRA) ఉంటుంది. దీనికి మినహాయింపు కొంత పరిమితి వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
- ట్యాక్స్ పేయర్స్‌కు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలు కోల్పోయే ఛాన్స్
- సెక్షన్ 16 ప్రకారం ఎంటర్‌టెయిన్‌మెంట్ అలవెన్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ డిడక్షన్స్‌లో కోత.
- హౌజింగ్ లోన్ తీసుకున్న వారు దానిపై వడ్డీ కడుతున్నట్లు ఇప్పటి వరకు ట్యాక్స్ మినహాయింపులో చూపేవారు. కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకుంటే ఈ ఆప్షన్ కోల్పోతారు.
- ఫ్యామిలీ పెన్షన్‌లో భాగంగా రూ.15000 డిడక్ట్ అయ్యేది. ఇప్పుడు కొత్త ట్యాక్స్ విధానంలో ఇది ఉండదు.
- సెక్షన్ 80(సీ) కింద పన్ను మినహాయింపు వచ్చే ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసీ ప్రీమియం, పిల్లల ట్యూషన్ ఫీజు, ఇతర పెట్టుబడులు అంటే ఎన్‌పీఎస్, పీపీఎఫ్‌లాంటివి కొత్త విధానంలో ఉండవు.
- సెక్షన్ 80E కింద విద్యా రుణంపై చెల్లించే వడ్డీ పన్ను మినహాయింపు ఉండదు.
- సెక్షన్లు 80DD, 80DDB కింద ట్యాక్స్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోలేరు.
- సెక్షన్ 80G కింద లభించే స్వచ్చంధ సంస్థలకు విరాళాలపై పన్ను మినహాయింపు అందుబాటులో ఉండదు.
- చాప్టర్ VIA కింద వచ్చే అన్ని డిడక్షన్స్‌ను క్లెయిమ్ చేసుకోలేరు. ఉదాహరణకు... 80C, 80CCC, 80CCD, 80D, 80DD, 80DDB, 80E, 80EE, 80EEA, 80EEB, 80G, 80GG, 80GGA, 80GGC, 80IA, 80-IAB, 80-IAC, 80-IB, 80-IBA తదితర సెక్షన్లు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications