For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం కొంటున్నారా, అది అసలుదేనా? ఇలా సులభంగా తెలుసుకోవచ్చు

|

సాధారణంగా మన దేశంలో పెళ్లికి లేదా ఇతర శుభకార్యాలకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే అందరి చూపు ముందు బంగారం వైపు వెళ్తుంది. బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతుంటాయి. అయితే స్వల్పకాలంలో ఫ్లక్చుయేషన్స్‌కు గురవుతాయి. కరోనా నేపథ్యంలో గత ఏడాది భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గిపోయాయి. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12వేల వరకు తక్కువగా ఉన్నాయి. పసిడి కొంత కాలంగా కరెక్షన్‌కు గురవుతోంది. నకిలీ బంగారం ద్వారా కూడా వినియోగదారులను బోల్తా కొట్టించే వారు కోకొల్లలు.

ఈ నేపథ్యంలో నిజమైన బంగారమా కాదా తెలుసుకోవడానికి కొన్ని దారులు ఉన్నాయి. 41.7 శాతం లేదా 10 క్యారెట్ల కంటే తక్కువగా ఉన్న బంగారం ఏదైనా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నకిలీగానే పేర్కొంటారు. చూడగానే నకిలీయా లేదా అసలైన బంగారమా చెప్పడం కష్టమే. అందుకే కొంతమంది విక్రయదారులు కొనుగోలుదారులను చాలా సులభంగా మోసం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బంగారాన్ని పరీక్షించేందుకు పలుమార్గాలు ఉన్నాయి.

మాగ్నెట్ టెస్ట్

మాగ్నెట్ టెస్ట్

స్వచ్ఛమైన బంగారం మ్యాగ్నెటిక్ కాదు. ఇతర మెటల్స్ మ్యాగ్నెటిక్ ప్రభావం కలిగి ఉంటాయి. మీ వద్ద మంచి మ్యాగ్నెట్ ఉంటే కనుక మీ బంగారం స్వచ్ఛమైనదా లేదా నకిలీదా తెలుసుకోవచ్చు. మ్యాగ్నెట్‌ను బంగారం వద్ద పెట్టి ఆకర్షిస్తుందా లేదా చెక్ చేయాలి. అయాస్కాంతం ఈజీగా అందుబాటులో ఉండే సాధనం కాబట్టి ఇలా పరీక్షించడం సౌకర్యవంతంగా ఉంటుంది. బంగారం తుప్పుపట్టదు. అది తుప్పు పట్టే అవకాశాలు కనిపిస్తే అది నిజమైన బంగారం కాదని అర్థం.

హాల్ మార్క్

హాల్ మార్క్

బంగారం ప్రామాణికమైనదా లేదా తెలుసుకోవడం కోసం హాల్ మార్క్ కూడా అవసరం. 14, 18, 22 క్యారట్ల బంగారానికి హాల్ మార్క్ ఉంటుంది. బంగారు ఆభరణాలను, బంగారు నాణేలను ధృవీకరించేందుకు ప్రభుత్వం BIS(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్)ను స్థాపించింది. దీని ద్వారా బంగారం అసలైనదా లేదా నకిలీదా తెలుసుకోవచ్చు. బీఐఎస్ హాల్ మార్క్ ఉందని చెప్పి కొనుగోలు చేసిన నగల్లో నిజంగా అంత స్వచ్చత ఉందా ... లేదా అని మీరు కూడా తెలుసుకోవచ్చు. మీకు దగ్గరలోని అధీకృత బీఐఎస్ కేంద్రానికి వెళ్లి ఒక్కో నగకు సుమారు రూ150 నుంచి రూ 250 చెల్లించి తనిఖీ చేయించుకోవచ్చు.

ఫ్లోట్ టెస్ట్

ఫ్లోట్ టెస్ట్

బంగారం మందాటి, కఠినమైన లోహం. దాని బరువు, సాంధ్రతను పరీక్షించడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మీ బంగారు ఆభరణాలను బకెట్ నీటిలో వేయాలి. నిజమైన బంగారంతో తయారయితే మునిగిపోతుంది. చిన్నపాటి దుకాణాల నుండి కొనుగోలు చేసినప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది.

యాసిడ్ టెస్ట్

యాసిడ్ టెస్ట్

నిజమైన బంగారం నైట్రిక్ ఆసిడ్‌కు రియాక్ట్ కాదు. రాగి, జింగ్ వంటి ఇతర మిశ్రాలతో కలిపితే స్పందిస్తుంది. అయితే ఈ పరీక్ష చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. చేతి గ్లౌస్, మాస్కులు ధరించి బాగా వెంటిలేషన్ ఉన్న గదిలో పరీక్షించాలి. నైట్రిక్ యాసిడ్‌ను ఒక చుక్క ఆభరణాల పైన వేయాలి. ఆకుపచ్చగా ఉండే బంగారం మంచిదే. స్టెర్లింగ్ ఉంటే పాలవంటి పదార్థం వస్తుంది.

వెనీగర్ పరీక్ష

వెనీగర్ పరీక్ష

బంగారం స్వచ్ఛమైనదా కాదా తెలుసుకోవడానికి వెనీగర్ కూడా ఉపయోగించవచ్చు. ఇది వంట పదార్థం. మీ బంగారం ముక్కలపై రెండు చుక్కల వెనీగర్ వేయాలి. బంగారం రంగు మారిపోతే అది అసలైనది కాదు. రంగు మారకుంటే మాత్రం అది అసలైన బంగారంగా చెప్పవచ్చు.

English summary

బంగారం కొంటున్నారా, అది అసలుదేనా? ఇలా సులభంగా తెలుసుకోవచ్చు | How To Identify Fake Gold Jewellery? 4 Ways to Identify Gold Purity at Home

When it comes to investing or gifting something special for a wedding or a festival in India, we always turn to gold. Gold's value fluctuates, making the precious metal more vulnerable to counterfeiting. Throughout its history, gold has been used by jewellers to trick or defraud their customers through counterfeiting. This is common because India is the world's largest gold user.
Story first published: Sunday, March 21, 2021, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X