హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(GHMC) సహా తెలంగాణలోని నగరపాలక సంస్థలు, పురపాలకస సంఘాల్లో ఆస్తి పన్నులో 50 శాతం మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నుండి జూలై వరకు కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఆస్తి పన్నులో సగం మాఫీ చేస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. అదే సమయంలో జీహెచ్ఎంసీలో సఫాయిల వేతనాలను కూడా ప్రభుత్వం పెంచింది.

ఇప్పటికే చెల్లించిన వారికి ఏం చేస్తారు?
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆస్తి పన్నులో 50 శాతం వాటాను మాఫీ చేయడంతో పాటు ఇప్పటికే పన్నులు చెల్లించిన వారికి వచ్చే ఏడాది సర్దుబాటు చేస్తారు. వచ్చే సంవత్సరం 50 శాత మొత్తాన్ని సర్దుబాటు చేస్తుంది. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు వివిధ రూపాల్లో సాయమందిస్తోన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లోన్ మారటోరియం కాలంలో చక్రవడ్డీని మాఫీ చేసి, సామాన్యులపై భారం పడకుండా తాము భరిస్తామని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వన్ టైమ్ బెనిఫిట్ కింద 50 శాతంమాఫీ చేస్తున్నట్లు తెలిపింది.

పరిమితి ఉందా?
జీహెచ్ఎంసీ పరిధిలో రూ.15వేలు, అంతకంటే తక్కువ, ఇతర నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో రూ.10వేలు అంతకంటే తక్కువ ఆస్తి పన్ను ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు ఇది వర్తిస్తుంది. సామాన్యులపై భారం పడకుండా లోన్ మారటోరియం కాలంలో చక్రవడ్డీని బ్యాంకులు.. కస్టమర్లకు అందిస్తే, ఆ తర్వాత బ్యాంకులకు కేంద్రం చెల్లిస్తుంది. అలాగే, ఇక్కడ కూడా నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు మాఫీ చేసిన పన్ను మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఎంతమందికి ప్రయోజనం, ప్రభుత్వంపై ఎంత భారం
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రాయితీ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో 13.72 లక్షల కుటుంబాలు, నగరాలు, పురపాలక సంఘాల్లో 17.68 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 31 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వంపై రూ.326 కోట్ల మేర భారం పడనుంది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో రూ.196 కోట్లు, నగరాలు, పురపాలికల్లో 130 కోట్ల భారం పడనుంది. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్స్ ఊరట ఇచ్చింది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications