ఆధార్ కార్డు - పాన్ కార్డును ఈ నెల (సెప్టెంబర్) 30వ తేదీలోపు లింక్ చేసుకోవాలి. కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెలాఖరులోగా ఆధార్ - పాన్ లింక్ చేసుకోకపోతే మీ పాన్ కార్డు చెల్లదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగిస్తూ వచ్చింది. చివరిసారి సెప్టెంబర్ 30 తేదీలోగా అంటూ ఆఖరి గడువిచ్చారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు పాన్ లేదా ఆధార్ ఉపయోగించవచ్చు. ఇవి ఇంటర్‌ఛేంజబుల్.

ఐటీ డిపార్టుమెంట్ ఈ-ఫైలింగ్ ద్వారా లింక్ చేసుకోవచ్చు
12 అంకెల ఆధార్ కార్డుతో 10 అంకెల పాన్ కార్డును అనుసంధానం చేసుకోవడం చాలా సులభం. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్‌కు చెందిన ఈ-ఫైలింగ్ వెబై సైట్ ద్వారా లింక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పోర్టల్ ద్వారా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక, కొత్తగా పాన్ కార్డు తీసుకుంటున్న వారు కచ్చితంగా తమ ఆధార్ నెంబర్‌ను పేర్కొనవలసి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఎలా?
- ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ వెబ్ సైట్‌కు వెళ్లాలి.
- పాన్ (యూజర్ ఐడీ), పాస్ వర్డ్, మీ పుట్టిన తేదీని పేర్కొని లాగిన్ కావాలి.
- Link Aadhaar ఆప్షన్ ఎంచుకోవాలి.
- పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఆధార్‌లోని పేరు వంటి వివరాలు ఎంటర్ చేశాక కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత LINK Aadhaar పైన క్లిక్ చేయాలి.
- లింక్ అయినట్లుగా చూపిస్తుంది.

ఒకవేళ లింక్ కాకుంటే...
ఒకవేళ మీ పాన్ - ఆధార్ లింక్ కాకుంటే ఓ ఫామ్ కనిపిస్తుంది. అక్కడ మీ వివరాలను నమోదు చేయాలి. పాన్ కార్డ్ ప్రకారం పేరు, పుట్టిన తేదీ, లింగం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్. కాప్చాను ఎంటర్ చేసి, సబ్‌మిట్ చేయాలి. ఆ తర్వాత సక్సెస్ మెసేజ్ వస్తుంది.

ఎస్సెమ్మెస్ ద్వారా...
ఎస్సెమ్మెస్ ద్వారా కూడా పాన్ - ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఎస్సెమ్మెస్ సందేశం పంపించడం ద్వారా లింక్ చేసుకోవచ్చు.
UIDPAN<స్పేస్><స్పేస్> ఎంటర్ చేసి 567678 కు లేదా 56161 ఎస్సెమ్మెస్ చేయాలి.
ఇలా పంపించినందుకు ఎలాంటి ఛార్జీ ఉండదు.

మ్యాన్యువల్ లింకింగ్
సమీపంలోని పాన్ సర్వీస్ ప్రొవైడర్, ఎన్ఎస్డీఎల్ లేదా యూటీఐఐటీఎస్ఎల్‌కు వెళ్లాలి. అక్కడ అనెక్స్యూర్-1 ఫామ్ నింపవలసి ఉంటుంది. పాన్, ఆధార్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాలి. ఆన్ లైన్ ద్వారా అయితే ఉచితం. కానీ మ్యాన్యువల్ లింకింగ్ అయితే ఛార్జీ వసూలు చేస్తారు. లింకింగ్, కరెక్షన్‌ను బట్టి ఛార్జీలు వర్తిస్తాయి.
పాన్ కార్డులోని కరెక్షన్‌కు రూ.110, ఆధార్ కరెక్షన్‌కు రూ.25 ఛార్జ్ ఉంటుంది.
More From GoodReturns

New rules: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్! మీ శాలరీ, టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు!

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications