For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అకౌంట్ ఆగిపోతే... ఆ PF అకౌంట్‌కు రిటైర్మెంట్ వరకు వడ్డీ వస్తుంది!

|

న్యూఢిల్లీ: మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్ ఎక్కువ కాలం ఆగిపోతే దానిపై వడ్డీ వస్తుందా? అంటే అవుననే అంటున్నారు. ఎవరైనా ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు కాంట్రిబ్యూషన్ ఆగిపోతే ఎన్నాళ్లు ఆ అకౌంట్ యాక్టివ్‌గా ఉంటుంది, ఎంతకాలం ఆ మొత్తంపై వడ్డీ వస్తుందనే అనుమానాలు చాలామందికి ఉంటాయి. ఎవరి పీఎఫ్ అకౌంట్‌లోకి అయినా 36 నెలల పాటు కాంట్రిబ్యూషన్ ఆగిపోతే అప్పుడు దానిని డొర్మాంట్ అకౌంట్ (చాలాకాలంగా ఆగిపోయిన అకౌంట్ లేదా నిద్రాణమైన ఖాతా)గా పరిగణిస్తారు.

EPF అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఎలా చేయాలో తెలుసా? స్టెప్ బై స్టెప్EPF అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఎలా చేయాలో తెలుసా? స్టెప్ బై స్టెప్

ఆ అకౌంట్‌పై రిటైర్మెంట్ వరకు వడ్డీ

ఆ అకౌంట్‌పై రిటైర్మెంట్ వరకు వడ్డీ

చాలాకాలం క్రితం పీఎఫ్ అకౌంట్లోకి కాంట్రిబ్యూషన్ నిలిచిపోయినప్పటికీ సదరు ఉద్యోగి రిటైర్మెంట్ వయస్సు వరకు దానిపై వడ్డీ వస్తుంది. ఈ నిబంధనను మధ్యలో సవరించారు. కొన్నాళ్ల తర్వాత తిరిగి పునరుద్ధరించారు. మీ కాంట్రిబ్యూషన్ ఆగిపోయినప్పటికీ ఇన్‌కం ట్యాక్స్ మినహాయంపుకు లిమిట్ ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగం మానివేసిన తర్వాత వచ్చే వడ్డీ ట్యాక్సబుల్.

పీఎఫ్ విత్ డ్రా.. ట్యాక్స్ ఫ్రీ

పీఎఫ్ విత్ డ్రా.. ట్యాక్స్ ఫ్రీ

అలాగే, ఇన్‍‌కం ట్యాక్స్ యాక్ట్ ప్రకారం.. కొన్ని సందర్భాల్లో పీఎఫ్ విత్ డ్రా చేస్తే ప్రావిడెంట్ ఫండ్ ట్యాక్సబుల్ కాదు. ఆ సందర్భాలు ఇవే.... ఉద్యోగి అయిదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం సేవలు అందించినప్పుడు, అయిదేళ్ల కాలపరిమితిని లెక్కించినప్పుడు అంతకుముందు కంపెనీ, తర్వాత చేరిన కంపెనీ సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అలా మొత్తం అయిదేళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అంతకుముందు పని చేసిన కంపెనీ నుంచి కొత్త కంపెనీకి పీఎఫ్ అకౌంట్ ట్రాన్సుఫర్ చేయబడుతుంది. రెండు కంపెనీల్లో వేర్వేరుగా అయిదేళ్లకు తక్కువగా ఉంటుంది. అయితే మొత్తం సర్వీస్ కాలం చూస్తే అయిదేళ్లుగా ఉంటుంది.

ట్యాక్సబుల్ కాదు

ట్యాక్సబుల్ కాదు

అనారోగ్యం, యజమాని తొలగించడంతో పాటు మానివేసిన ఉద్యోగి నియంత్రణలో లేని అంశాల కారణంగా ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు ట్యాక్సబుల్ కాదు. ఇలాంటివి కాకుండా అయిదేళ్లకు ముందే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేస్తే మాత్రం ట్యాక్సబుల్. ఒకవేళ మీరు ఓ కంపెనీలో అయిదేళ్లపాటు పని చేసి, ఆ తర్వాత కొత్త కంపెనీకి వెళ్లిన ఏడాది తర్వాత పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేసుకుంటే ట్యాక్స్ ఫ్రీ అవుతుంది.

English summary

అకౌంట్ ఆగిపోతే... ఆ PF అకౌంట్‌కు రిటైర్మెంట్ వరకు వడ్డీ వస్తుంది! | Dormant PF account will earn interest till the holder attains retirement age

After 36 months have passed since the last active contribution in a PF account, it gets categorised as dormant account.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X