ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్‌సీటీసీ)లో టిక్కెట్ బుకింగ్, క్యాన్సిలేషన్‌కు వివిధ మార్గాలు ఉన్నాయి. ఇండియన్ రైల్వే కౌంటర్లు, స్టేషన్లు, రిజర్వేషన్ ఆపీసుల్లో బుక్ చేసిన టిక్కెట్స్‌ను ఐఆర్‌సీటీసీ ఈ-టిక్కెటింగ్ వెబ్‌సైట్ ద్వారా క్యాన్సిల్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ వెసులుబాటు కల్పించింది. (IRCTC e-ticketing website, www.irctc.co.in.). ఇంతకుముందు, రైల్వే స్టేషన్, బుకింగ్ కౌంటర్స్ వంటి చోట్లకు వెళ్లి క్యాన్సిల్ చేయించుకోవాల్సి వచ్చేది. టిక్కెట్ రద్దు చేసుకోగోరిన వారి నుంచి రైల్వే రుసుము వసూలు చేసేది. ఆన్‌లైన్ ద్వారా 10 సులువైన స్టెప్స్ ద్వారా బుక్ అయిన మీ టిక్కెట్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు.

10 సులువు మార్గాల్లో కౌంటర్ టిక్కెట్ క్యాన్సిలేషన్
- మీరు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ www.irctc.co.in. ఓపెన్ చేయండి.
- హోం పేజీలోని టాప్‌లో ఉండే Trains ఆప్షన్ వద్ద మీ మౌస్ కర్సర్‌ను ఉంచండి.
- అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. Cancel Ticket టిక్కెట్‌ను ఎంచుకోండి.
- క్యాన్సిల్ టిక్కెట్‌లో మీకు ఈ-టిక్కెట్స్, కౌంటర్ టిక్కెట్స్ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో Counter Ticketను ఎంచుకోండి.
- PNR Number మరియు Train Number అడుగుతుంది. మీ టిక్కెట్ పైన ఉన్న ఆ నెంబర్లు ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత కాప్చా ఎంటర్ చేయండి. అక్కడ క్యాన్సిలేషన్, బోర్డింగ్ రూల్స్ చదివానని చెప్పే బాక్స్ ఉంటుంది. దాని పైన టిక్ చేయాలి.
- ఆ తర్వాత submit పైన క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ మొబైల్‌కు ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
- ఓటీపీని వ్యాలిడేటెడ్ తర్వాత పీఎన్ఆర్ వివరాలు ధృవీకరించండి.
- ఆ తర్వాత టిక్కెట్ Cancel Ticket పైన క్లిక్ చేయండి.

క్యాన్సిలేష్ సమయం ఆధారంగా రీఫండ్
ఆ తర్వాత రీఫండ్ అమౌంట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆ తర్వాత రీఫండ్‌కు సంబంధించిన వివరాలు, పీఎన్ఆర్ నెంబర్ ఎస్సెమ్మెస్ రూపంలో వస్తాయి. ఉదాహరణకు... మీ పీఎన్ఆర్ 0000 రద్దు చేయబడింది. కమెన్సింగ్ స్టేషన్ లేదా దగ్గరలోని శాటిలైట్ పీఆర్ఎస్ లొకేషన్‌లో మీ రీఫండ్ రూ.00 కలెక్ట్ చేసుకోండి అని వస్తుంది. అయితే క్యాన్సిలేషన్ సమయాన్ని బట్టి మీ రీఫండ్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ కన్‌ఫర్మ్ అయిన రైలు టిక్కెట్ల క్యాన్సిలేషన్‌కు వివిధ రకాల కాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేస్తోంది. ట్రెయిన్ షెడ్యూల్‌కు 24 గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటే ఒక ఛార్జ్, డిపార్చర్ టైమ్‌కు 24 గంటల తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే మరో ఛార్జ్, 4 గంటల కంటే ముందు రద్దు చేసుకుంట ఓ ఛార్జ్, అరగంట ముందు రద్దు చేస్తో ఇంకో ఛార్జ్ ఉంటుంది. క్లాస్‌ను బట్టి క్యాన్సిలేషన్ ఫీజు ఉంటుంది. ట్రెయిన్ చార్ట్ ప్రిపేర్ చేయడానికి ముందు మాత్రమే టిక్కెట్ రద్దుకు అవకాశముంటుంది.

ఇలా క్యాన్సిల్
ఈ-టిక్కెట్ అయితే ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. website: irctc.co.in లోకి వెళ్లండి. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఐఆర్‌సీటీసీలోకి లాగిన్ కండి. మై అకౌంట్, మై ట్రాన్సాక్షన్.. తర్వాత Booked Ticket History పైన క్లిక్ చేయండి. క్యాన్సిల్ చేయాలనుకున్న దానిని ఎంచుకోండి. Cancel Ticket టిక్కెట్ పైన క్లిక్ చేయండి. ఓకేను క్లిక్ చేయడం ద్వారా క్యాన్సిలేషన్‌ను కన్‌ఫర్మ్ చేయండి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications