సాధారణంగా మనిషికి సంబంధించి జననం మరియు మరణం తప్పని సరి ఎలానో పుట్టిన ప్రతి మనిషి తన జీవన విధానంలో పన్నులు చెల్లించాలి అనేది అంతే నిజం,కానీ ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు వారి ప్రజలకు సంబంధించి కొన్ని
సాధారణంగా మనిషికి సంబంధించి జననం మరియు మరణం తప్పని సరి ఎలానో పుట్టిన ప్రతి మనిషి తన జీవన విధానంలో పన్నులు చెల్లించాలి అనేది అంతే నిజం,కానీ ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు వారి ప్రజలకు సంబంధించి కొన్ని వ్యక్తి గత పన్నుల నుండి ఉపశమనం కల్పించారు ఇక్కడ పది దేశాలు ప్రజలపై ఎటువంటి పన్ను మరియు ఆదయ పన్ను విధించలేదు.ఆ పది దేశాలు ఏవో మనం ఎప్పుడు తెలుసుకోబోతున్న..

1.UAE (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్):
UAE (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) చమురు నిల్వల ప్రధాన ఆదాయంగా సాగుతున్న దేశం ఇది.ఇక్కడ ఆదాయ పన్ను లేదా మూల పన్ను ఉండదు.ఈ దేశం లో సగటు వ్యక్తి ఆదాయం $.49 ,000 డాలర్లుగా ఉంటుంది.

2.Saudi arabia (సౌదీ అరేబియా):
సౌదీ అరేబియా ఎగుమతులు 95 % చమురు పరిశ్రమల నుండే జరుగుతాయి.దీని ద్వారా ప్రభుత్వానికి 70 శతం ఆద్యం వస్తుంది జీడీపీ(GDP ) పరంగా చూస్తే ఇక్కడ సగటు వ్యక్తి సంపద $.32 ,000 డాలర్లు సంపద ఉంటుంది,ఇక్కడ ఉద్యోగులు ఆదాయ పన్నులు చెల్లించాల్సిన పని లేదు కానీ,ఆదాయ పన్ను బదులు 'జకాద్' అంటే వారి వారి ఆర్థిక స్థితిని బట్టి దానం చేయాలనే నిబంధన అమల్లో ఉంది.

3.Qatar(కతర్):
ప్రపంచ ధనిక దేశాల్లో ఒకటైన కతర్ యొక్క పర్ క్యాపిట జీడీపీ $.10 ,300 డాలర్లుగా ఉంటుంది,ఇక్కడ ఆదాయ పన్ను ఉండదు.ఇంకా డివిడెండ్లు,రాయల్టీలు,లావాదేవీలు,స్థల విక్రయాల మూలధన రాబడులు వంటి వాటిపై ఎటువంటి పన్ను ఉండదు కానీ సామజిక భద్రత కోసం 5 శతం పౌరులు మరియు ఉద్యోగులు 10 శాతం ఆదాయం ఒక ఫండుకు చెల్లించాలి.

4.Oman (ఒమాన్):
ఒమాన్ దేశ జీడీపీ సగటున వోకోక్కరి మీద 29 ,000 డాలర్లు ఇది ఫిలిపైన్స్ సగటు జీడీపీ కన్నా 7 రెట్లు ఎక్కువ మధ్య ఆసియ దేశాల్లోని చాలా సరిహద్దు దేశాల్లో లాగానే ఒమాన్ దేశం కూడా ఎక్కువ ఆదాయం కోసం ముడి చమురు నిల్వల మీదే ఆధార పడింది,కేవలం సామజిక భద్రతా పథకాల కోసం 6 .5 శాతం పౌరుల ఆదాయం నుండి సేకరించబడుతుంది మరే ఇతర పన్నులు ఉండవు.

5.Monaco (మొనాకో):
పశ్చిమ ఎవరోపే లోని సార్వభౌమ మొనాకో ప్రపంచంలో సంపన్న దేశాల్లో ఒకటి.ఈ దేశంలో పర్ క్యాపిట జీడీపీ 1,32,000 డాలర్లుగా ఉంటుంది,ఇక్కడ పౌరుల పై ఎటువంటి పన్నులు ఉండవు.

6.Kuwait (కువైట్):
కువైట్ రాజ్యాంగం ప్రకారం అన్ని సహజ వనరులు వాటి ద్వారా వచ్చే ఆదాయాలు మొత్తం ప్రభత్వానికి చెందుతాయి.దీన్ని బట్టి కువైట్ ప్రబుత్వానికి అధిక ఆదాయం చమురు నిల్వల నుండే సమకూరుతాయి,ఇక్కడ జీడీపీ సగటు వ్యక్తి మీద 59,000 డాలర్లకి ఇందులో 90 శాతం ఎగుమతుల ద్వారా లభిస్తుంది.ఇక్కడ కేవలం 7 శాతం మందే ప్రైవేట్ ఉద్యోగ సంస్థల్లో పనిచేస్తారు.ఇక్కడ పౌరుల మీద ఎటువంటి పన్ను ఉండదు,సామజిక బద్రత కోసం ప్రతి ఒక్కరు వారి ఆదాయం నుండి 7 .5 శాతం చెల్లించాలి.

7.Cayman Islands (కేమెన్ ఐలాండ్స్):
బ్రిటన్ ప్రాదేశిక ప్రాంతం లో ఉండే పశ్చిమ కరేబియన్ సముద్రం లో కేమెన్ ఐలాండ్స్ ఉన్నాయి.ప్రపంచంలో సంపన్న దేశాల్లో ఒకటైన ఇది సగటు వ్యక్తి జీడీపీ 43,800 డాలర్లు,ఈ దేశానికి ఎక్కువ శాతం ఆదాయం పర్యాటకం మరియు ఆర్ధిక సేవల నుండే వస్తుంది.ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ రంగాన్ని కలిగి ఉంది,ఈ బ్యాంకు లో నిలువలు 1.5 ట్రిలియన్ల డిపాజిట్లు ఉన్నాయి,ఇక్కడ ప్రజలపై ఎటువంటి పన్ను లేదు.

8.Bermuda (బెర్ముడా):
ఆఫ్ షోర్ ఫైనాన్స్ హబ్ గానే కాకుండా పర్యాటకుల ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుంటున్న దేశం బెర్ముడా.అమెరికా తూర్పు తీరం లో బ్రిటీష్ ప్రాదేశిక ప్రాంతం లో ఇది ఉంది.ఈ దేశ వ్యక్తి సగటు జీడీపీ 97.000 డాలర్లు పరోక్ష పన్నుల ద్వారా అధిక ఆదాయం వస్తుండడం తో ప్రత్యక్ష పన్నులు విధించరు.

9.Bahrain (బహరేన్):
అన్ని మధ్య తూర్పు దేశాల్లో లాగానే ఇక్కడ ప్రధాన ఆదాయ వనరులు చమురు నిలువలే.పెట్రోలియం ఉత్పత్తి ప్రాసెసింగ్ పరిశ్రమ దేశానికి ఇలా దోహద పడుతుంది.ఇక్కడ సగటు వ్యక్తి జీడీపీ 27,500 డాలర్లు ఇక్కడ పౌరుల మీద ఎటువంటి పన్నులు ఉండవు కానీ పరోక్ష పన్నులు ఉంటాయి.

10.Bahamas (బహమాస్):
కరేబియన్ దీవుల్లో మరో దేశమైన బహమాస్ ఆర్థిక సేవలు మరియు పర్యాటక రంగం నుండి ఆదాయ ఆర్జిస్తోంది,దేశం మొత్తం జీడీపీ లో 60 శాతం పర్యాటకం నుండే వస్తుంది ఐతే ఉద్యోగాల కల్పనా విషయానికొస్తే 50 మందికి పర్యాటకమే ఆదాయం,ఆస్థి మీద ఒక శాతం మాత్రమే పన్ను విధించే బహమాస్ లో ఇతర పన్నులు ఎటువంటివి లేవు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications