ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పది అంకెల ఏకైక ఆల్ఫాన్యూమరిక్ నెంబరే పాన్ కార్డు. ఆదాయపు పన్ను శాఖతో జరిపే అన్ని రకాల మదింపులకు పాన్ కార్డు తప్పనిసరి. టీడీఎస్/ టిసిఎస్ క్రెడిట్స్ ఆదాయ రాబడి, పన్ను చెల్లింపులు, ఉత్తర ప్రత్యుత్తరాలు లాంటి లావాదేవీల్లో పాన్ కార్డే కీలక పాత్ర పోషిస్తుంది.
వివిధ పెట్టుబడులు, రుణాలు, పన్ను, ఇతర వ్యాపార కార్యకలాపాలు లాంటి వివరాలు జాడ తెలుసకునేందుకు పాన్ కార్డు సహాయం చేస్తుంది. ప్రభుత్వానికి పన్ను చెల్లించే ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు తప్పనిసరి.

ఈ పాన్ కార్డుని ఎవరెవరు పొందవచ్చో తెలుసుకుందాం:
* పన్ను ఆదా చట్ట ప్రకారం 139(4A)కి లోబడి ఎవరైతే ఉన్నారో వారు పాన్ కార్డు పొందేందుకు అర్హులు.
* ఎవరైతే వ్యక్తులు మూలం ద్వారా పన్ను మినహాయింపు పొందే హక్కుని కలిగి ఉంటారో వారు.
* దిగుమతి ఎగుమతి కోడ్ పొందటానికి అవసరం ఉన్న ప్రతి దిగుమతి/ ఎగుమతి దారుడు.
* బిజినెస్ లేదా వ్యక్తిగత ప్రొపెషన్ ద్వారా ఆదాయాన్ని పొందేవారు.
* 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ రూల్స్ కింద 57AE ప్రకారం ఇన్‌వాయిస్‌లు జారీ చేసిన వ్యక్తులు.
* ఏజెంట్‌కు సర్వీస్ ట్యాక్స్ చెల్లించే వ్యక్తి.
* సెంట్రల్ సేల్స్ టాక్స్ చట్టం లేదా సంబంధిత రాష్ట్ర లేదా కేంద్ర పాలిత సాధారణ అమ్మకపు పన్ను చట్టం కింద నమోదు వ్యక్తులు.
* ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే ప్రతి ఒక్కరికి పాన్ కార్డు తప్పనిసరి.
భారతదేశ ప్రభుత్వ అదేశాల ప్రకారం ఏ ఒక్కరు కూడా ఒక పాన్ కార్డుకి మించకూడదు. ఒక వేళ మించినట్లైతే, 1961 పన్ను ఆదా చట్ట ప్రకారంలోని సెక్షన్ 272బి ప్రకారం రూ. 10,000 జరిమానా విధిస్తారు. ఒక వేళ ఒక పాన్ కార్డుకి మించి ఉన్నట్లేతే తిరిగి ఆదాయపు శాఖ అధికారులకు వెంటనే అప్పగించండి.
పాన్ కార్డ్ అంటే ఏమిటీ.. :
మనం సంపాదించే ఆదాయం ప్రభుత్వానికి చెల్లించే ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితిలో ఉంటే మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ అనేది అవసరం. కారణం మీ ఇన్‌కమ్ ట్యాక్స్‌లో మీ పాన్ కార్డ్ నెంబర్‌ను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. పాన్ అంటే పర్మినెంట్ అకౌంట్ నెంబర్. మన పాన్ కార్డ్ అనేది పది డిజిట్లలో ఉంటుంది. ఆల్పా న్యూమరిక్ నెంబర్లను కలిగి ఉన్న ప్లాస్టిక్ లామినేటేడ్ కార్డును ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అందజేస్తుంది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications