హైదరాబాద్: మార్చి వచ్చిందంటే చాలు మంది పన్ను ఆదాల గురించే ఆలోచిస్తుంటారు. చెల్లించాల్సిన మొత్తం కన్నా ఆదాయపు పన్ను ఎక్కువగా చెల్లించి, కొంత మంది రిపండ్ కోసం ఎదురు చూస్తుంటారు. అసలు మనకు రావాల్సిన రిఫండ్ వచ్చిందో రాలేదో తెలుసుకోవడం ఎలాగో చూద్దాం.
మొదట మీరు నిజంగానే చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ చెల్లించారా లేదా అనేది తెలుసుకోవాలి. ఇందుకోసం ఫామ్ 26ఏఎస్‌ను అలాగే ఫామ్ 16ను సరిపోల్చాలి. సాధారణంగా రిఫండ్ రెండు పద్దతుల్లో వస్తుంది. మొదటిది నేరుగా బ్యాంకు ఖాతాలోకి జయ చేయడం. రెండోది ఇంటి చిరునామాకు చెక్కు పంపడం.
రిటర్నలు దాఖలు చేసేటప్పుడు మీ బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్‌సీ కోడు, బ్యాంకు బ్రాంచి వివరాలు సరిగ్గా పేర్కొవాలి. వీటిలో తప్పులుంటే రిఫండ్ రాదు. ఇక రిఫండ్ రావాల్సిన వారు బ్యాంకు వివరాలతో పాటు, సరైన ఇంటి చిరునామాను ఇవ్వాలి.

సరైన చిరునామా ఇవ్వకపోడవం వల్ల చెక్కు తిరిగి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వెబ్ సైట్‌లో చూస్తే తెలుస్తుంది. రిఫండ్ పరిస్ధితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ వెబ్ సైట్‌ను అందిస్తుంది.
రిఫండ్ సమర్పించే సమయంలో ఏ విధంగా రిఫండ్ అందుకోవాలనుకుంటున్నారో మీరు స్పష్టంగా తెలియజేయాలి. మీరు సమర్పించిన వివరాలతోనే రిఫండ్ పరిస్ధితిని తెలుసుకోవచ్చు. రిఫండ్ కు సంబంధించిన అన్ని విషయాల్ని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా చూస్తుంది. కొన్ని సార్లు మీకు చెక్ పంపినా అందదు. కానీ వెబ్ సైట్‌లో చెక్కును ఖాతాలో జమ చేసినట్లు చూపిస్తుంది.
ఇలాంటి సమయంలో వెంటనే ఆదాయపు పన్ను శాఖకు ఆ వివరాలను తెలియజేయండి. పాన్ కార్డు ఆధారంగా కింద ఉంచి వెబ్‌సైట్ లోకి లాగిన్ అయి రిఫండ్‌కు సంబంధించిన వివరాలు చెక్ చేసుకోండి.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications