
భారత ప్రభుత్వ ఆదాయ పన్నుశాఖ ప్రకారం ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ అంటే సంబంధిత పార్టీల మధ్య జరిగే కార్యకలాపాల ప్రైస్ లేదా విలువ. ఒకే గ్రూపులోని కంపెనీలు తమ మధ్య కార్యకలాపాలను, కనిపించని ఆస్తులతోపాటు భౌతిక ఆస్తుల బదిలీల వల్ల ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ జరుగుతుంది. ఈ విధంగా బదిలీ చేయడం ద్వారా ఒకే గ్రూపులోని సంస్థలు పన్నుల ఎగవేతకు పాల్పడతాయి.
ఉదాహరణ: తమ కంపెనీకి విధించే పన్ను భారాన్ని తగ్గించుకోవాలనే కంపెనీలు ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్‌కు పాల్పడతాయి. ఉదాహరణకు X అనే కంపెనీ ఎక్కువ పన్ను రేటును కలిగి ఉంది. అయితే తన లాభాలను పెంచుకుంటూ పన్ను భారాన్ని మాత్రం తగ్గించుకోవాలని కోరుకుంటుంది. ఇలాంటి కంపెనీలు ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేస్తాయి. అదేలా అంటే తన దగ్గరి సరుకును (గూడ్స్)ను అదే గ్రూపులోని Y కంపెనీకి (ఎక్కడైతే పన్ను రేటు తక్కువగా ఉంటుందో) ఒకే ధర రూ. 100కి పంపిస్తుంది. X కంపెనీ పంపించిన సరుకును Y కంపెనీ రూ. 400కు అమ్మకం చేపడుతుంది. ఈ విధంగా తన దగ్గరి వస్తువులను పన్ను రేటు తక్కువగా ఉన్న ఇతర దేశాలలోని తన గ్రూపులోని సంస్థల ద్వారా అమ్మకాలు జరపడం ద్వారా పేరెంట్ కంపెనీ X లాభాలను పొందుతుంది. తక్కువ పన్నులతోనే ఆ కంపెనీ రూ. 300 లాభాన్ని పొందుతుంది.
రొటేషనల్ ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్
కంపెనీలు తమ కార్యకలాపాలను నియంత్రించుకోవడం ద్వారా లాభాలను ఆర్జించాలని చూస్తుంటాయి. (అందువల్ల 60 శాతం తమ కార్యకలాపాలను తమ సంబంధిత కంపెనీల ద్వారా కొనసాగిస్తాయి). అందువల్ల అవి పన్ను ఎగవేతతో లాభాలను పొందుతాయి. పన్నులు తక్కువగా ఉన్న చోట తమ కార్యకలాపాలను ఎక్కువగా కొనసాగించడం వల్ల పన్ను రూపంలో చెల్లించాల్సిన మొత్తాలను కంపెనీలు తగ్గించుకుంటాయి.
పన్ను విధానంలో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకునే కంపెనీలు తమ లాభాలను రెట్టింపు చేసుకునేందుకు ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్ విధానాన్ని ఎంచుకుంటున్నాయి. అయితే కట్టుదిట్టంగా ఇలాంటి విధానాలు అమలు చేయకుంటే భారీ మూల్యమే చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల వొడాఫోన్, మరో బహుళజాతి సంస్థ షెల్ ఇండియా మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్, యూరప్‌లో అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్ రాయల్ డచ్ షెల్ పిఎల్‌సి కంపెనీలు ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్ విధానంతో భారత పన్నుల శాఖ నుంచి పలు సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications