For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Year ender 2021: ఇన్వెస్టర్లను భారీ షాకిచ్చిన కంపెనీలివే

|

2021 క్యాలెండర్ ఏడాదిలో స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. సెన్సెక్స్ ఇయర్ టు డేట్ (ఈ క్యాలెండర్ ఏడాదిలో) ఇప్పటి వరకు 9545 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ 47,900 పాయింట్ల దిగువన 2021 ఏడాదిలోకి అడుగు పెట్టింది. అక్టోబర్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లను తాకింది. ప్రస్తుతం 57,500 పాయింట్ల సమీపంలో నిలిచింది. ఈ కాలంలో సెన్సెక్స్ దాదాపు 20 శాతం లాభపడింది. ఈ క్యాలెండర్ ఏడాదిలో ఇన్వెస్టర్ల సంపద రూ.72 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.60 లక్షల కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్ 2021లోనే తొలిసారి 50,000 మార్కును, 60,000 మార్కును దాటింది.

హెవీ వెయిట్స్ అధిక రిటర్న్స్

ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో పలు స్టాక్స్ ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. హెవీ వెయిట్స్‌లో రిలయన్స్ 20 శాతం, టీసీఎస్ 26 శాతం, HDFC దాదాపు 2 శాతం, ఇన్ఫోసిస్ 48 శాతం, విప్రో 80 శాతం, ఎస్బీఐ 64 శాతం, బజాజ్ ఫైనాన్స్ 30 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. దాదాపు అన్ని స్టాక్స్ కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి. అయితే కొన్ని స్టాక్స్ నష్టాలను కూడా తెచ్చాయి. ఇన్వెస్టర్లకు భారీగా షాకిచ్చాయి.

Year ender 2021: these companies turned wealth destroyers

ఈ స్టాక్స్ 50 శాతం వరకు నష్టం

కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుండి మార్కెట్ అస్థిరంగా కదలాడుతోంది. భారీగా లాభపడుతూనే, తిరిగి కరెక్షన్‌కు గురవుతోంది. బీఎస్ఈ 500 ఇండెక్స్‌లో 77 శాతం కంపెనీలు ఇన్వెస్టర్లకు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి. మిగతా 23 శాతం కంపెనీలు నష్టాలను మిగిల్చాయి. బీఎస్ఈ 500లో 33 కంపెనీలు ఏకంగా 20 శాతం కంటే ఎక్కువ నష్టాలను అందించాయి. అందులో కొన్ని... హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, మహానగర్ గ్యాస్ లిమిటెడ్, బాంబే బర్మా ట్రేడింగ్ కార్పోరేషన్ లిమిటెడ్, వార్రోక్ ఇంజినీరింగ్ లిమిటెడ్, జాన్సన్ కంట్రోల్స్ - హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా, హీరో మోటో కార్ప్ లిమిటెడ్, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, సిటీ యూనియన్ బ్యాంకు, ప్రోక్టర్ అండ్ గాంబిల్ హెల్త్, ఆర్తి డ్రగ్స్, అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్, ఆర్బీఎల్ బ్యాంకు, యస్ బ్యాంకు, వోఖార్డ్ లిమిటెడ్, ఎంఏఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డీసీబీ బ్యాంకు లిమిటెడ్, స్పైస్ జెట్ లిమిటెడ్, వల్ పూల్ ఇండియా లిమిటెడ్, జుబిలాంట్ ఫర్మోవా, ఆస్ట్రాజెనికా ఫార్మా, అమర రాజా బ్యాటరీస్, హాత్ వే కేబుల్, డాటా కామ్, బంధన్ బ్యాంకు, గల్ఫ్ ఆయిల్ లుబ్రికాంట్స్ ఇండియా, ఐవోఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్, విక్రాంగీ లిమిటెడ్, స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ లిమిటెడ్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 20 శాతం నుండి 53 శాతం వరకు నష్టపోయాయి.

English summary

Year ender 2021: ఇన్వెస్టర్లను భారీ షాకిచ్చిన కంపెనీలివే | Year ender 2021: these companies turned wealth destroyers

The year 2021 will go down in memory lane as a year which created loads of wealth for investors. It was a year when indices zoomed to record highs and multiplied investor wealth manifold.
Story first published: Monday, December 27, 2021, 15:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X