బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కోరనా మహమ్మారి, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అప్పుడప్పుడు ఒత్తిడి తగ్గినా స్వల్పంగా తగ్గుతోంది. ఎంసీఎక్స్‌లో గత వారం గరిష్ట రికార్డును తాకింది. కొనుగోళ్ల మద్దతు లభించనప్పటికీ ధరలు సానుకూలంగానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడంపై అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తున్నప్పటికీ, జ్యువెల్లరీ షాప్స్‌లో ధరల పెరుగుదల కారణంగా డిమాండ్ లేదు.

బంగారం ధరలు ఈ వారం పడిపోతాయా?
బంగారం రూ.48,500 కంటే కిందకు వస్తే పసిడి కాంట్రాక్ట్ ఈ వారం దిద్దుబాటుకు ఆస్కారం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా, మార్కెట్ పరిస్థితి సానుకూలంగా లేకుంటే మరోసారి గత వారం రికార్డును అధిగమించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. లేదంటే ధరలు పడిపోవడనికి ఆస్కారం ఉందంటున్నారు. వెండి సెప్టెంబర్ కాంట్రాక్ట్ కిలో రూ.48,140 కంటే కిందకు వస్తే రూ.47,560 నుండి రూ.46,560 మధ్యకు పడిపోవచ్చునని భావిస్తున్నారు.

ధరలపై ఇవి ప్రభావంచూపిస్తాయి..
బంగారం ధరలు స్థిరంగా లేని ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఇన్వెస్ట్ చేయవచ్చా అనేది చాలామంది మదిలో ప్రశ్న. ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితిని పరిశీలిస్తే అంచనాతో ముందుకు వెళ్లవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం బంగారం ధరలు.. అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు, చైనాతో అమెరికా ట్రేడ్ వార్, చైనాతో భారత్ ట్రేడ్ వార్, కరోనా నేపథ్యంలో కేంద్ర బ్యాంకుల కొనుగోలు, స్టాక్ మార్కెట్ రాణింపు ప్రభావం వంటివి పసిడి ధరలపై ప్రభావం చూపవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఏ దేశమైనా పసిడి నిల్వలు విక్రయించినా ధరలు కాస్త తగ్గవచ్చు.

ఇలా ధరలు పెరగవచ్చు
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఔన్స్ బంగారం ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరువలో ఉంది. బంగారం గనుల్లో పని చేస్తున్న కార్మికుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు పెరిగితే, కేంద్రబ్యాంకులు కొనుగోలు చేస్తే బంగారం ధరలు పెరిగే అవకాశముంది. ఇటీవలి వరకు ఈక్విటీ, చమురు కంటే బంగారం వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. వీటికి తోడు ఇతర పెట్టుబడుల కంటే ఎక్కువ ప్రతిఫలం వస్తుందని భావిస్తే ఇన్వెస్టర్లు పసిడి వైపు చూస్తారు. అప్పుడు ధరలు పెరుగుతాయి.

షాప్‌లలో లేని డిమాండ్ కానీ..
ఓ వైపు జ్యువెల్లరీ షాప్స్‌లో డిమాండ్ లేదు. కొనుగోలుదారులు తగ్గారు. అయినా బంగారం ధర పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు ఎక్కువగా పెట్టడమే. ప్రస్తుతం ధరించే బంగారంకంటే వర్చువల్ బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో లాక్ డౌన్ కు ముందు రోజుకు 100 కిలోల బంగారం విక్రయిస్తే ఇప్పుడు అది సగానికి పరిమితమైందట.

పెట్టుబడులు.. దీర్ఘకాలం బెటర్
2001, 2008 ఆర్థిక సంక్షోభాల సమయంలో బంగారం ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టిన వారికి 2001లో ఇన్వెస్ట్ చేసిన వారికి 240 శాతం, 2008లో ఇన్వెస్ట్ చేసిన వారికి 170 శాతం రిటర్న్స్ వచ్చాయి. ఏడేళ్ల క్రితం రూ.35,000 గరిష్టాన్ని తాకినప్పుడు కూడా కొన్నవారు ఆ తర్వాత మంచి రిటర్న్స్ పొందారు. మొత్తానికి దీర్ఘకాలంలో బంగారంపై పెట్టుబడి ఢోకా లేదని చెబుతున్నారు. స్వల్పకాలంలో మాత్రం ఒడిదుడుకులు ఉంటాయని కాబట్టి దీనిపై ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications