కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న 'క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్, 2021' పైన మార్కెట్‌లో విస్తృత చర్చ సాగుతోంది. ఈ బిల్లులో అన్ని ప్రయివేటు క్రిప్టోకరెన్సీలను నిషేధించే అవకాశాలు ఉంటాయనే ప్రతిపాదనలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రిప్టో బిల్లును ప్రవేశపెడతారనే వార్తల నేపథ్యంలో ఇప్పటికే బిట్ కాయిన్, ఎథేరియం సహా వివిధ క్రిప్టో ధరలు భారీగా పతనమయ్యాయి. క్రిప్టోకు సంబంధించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించిన అనంతరం పార్లమెంటులో ప్రవేశ పెడతామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 30వ తేదీన తెలిపారు. ఈ బిల్లులో ఆర్బీఐ అధికారి డిజిటల్ కరెన్సీ తయారు చేయడానికి సంబంధించిన ప్రతిపాదన ఉంటుందని తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీకి ఉపయోగించే బ్లాక్ చైన్ టెక్నాలజీని ఈ సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీకి(CBDC) ఉపయోగించనున్నారని తెలుస్తోంది.

డిజిటల్ కరెన్సీ దిశగా అడుగులు
ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీకి సంబంధించిన డ్రాఫ్ట్‌ను ఆర్బీఐ ఈ నెలలో ప్రకటించవచ్చని ఆర్బీఐ ఫిన్‌టెక్ విభాగ జనరల్ మేనేజర్ అనూజ్ రంజన్ అన్నారు. అనంతరం పైలట్ ప్రాజెక్టు కింద తీసుకు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే డిజిటల్ కరెన్సీ తయారీకి అవసరమైన చట్టపరమైన మార్పులు ముందస్తు దశల్లో ఉన్నట్లు తెలిపారు. వచ్చే మూడు నుండి ఆరు నెలల్లో ఈ దిశగా చాలా సానుకూల నిర్ణయాలు ఉండవచ్చునని, CBDC కోసం అవసరమైన వ్యవస్థ, డిజైన్ ఎంపికలు జరుగుతాయని, ఈ ప్రక్రియలు ఇప్పటికే ముందుకు సాగుతున్నాయని చెబుతున్నారు. డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణకు చట్టపరమైన సవరణలు కీలకమని, ఇందుకు ఆర్బీఐ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందన్నారు. డిజిటల్ కరెన్సీపై నమ్మకం పెరిగితే ప్రజలు దీనిని ఉపయోగించడం పెరుగుతుందని, ఇది తక్కువ నగదు ఆర్థికవ్యవస్థకు దోహదపడుతుందని చెప్పారు. కరెన్సీ నోట్లతో పాటు చెలామణీ అయ్యేలా డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి ఆర్బీఐ చట్టం-1934కు మార్పులు చేయాలని ప్రభుత్వాని ఆర్బీఐ కోరిందని, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల తెలిపారు.

అప్పుడే ఓ రూపు
సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ(CBDC)కు సంబంధించి బీఐఎస్ ఎకనమిస్ట్ రాఫెల ఓర్, రెయినర్ బోమ్ ఇటీవలి తమ రీసెర్చ్ నోట్‌లో డిస్కస్ చేశారు. ఇందులో CBDC తయారీకి ఉపయోగించగలిగే వివిధ టెక్నాలజీలను ప్రస్తావించారు. అంతర్జాతీయ గ్లోబల్ కరెన్సీలను పరిశీలించి, దేశీయ డిజిటల్ కరెన్సీకి ఓ రూపు తీసుకు వస్తుందన్నారు.

హోల్‌సేల్ లేదా రిటైల్?
ఆర్బీఐ తీసుకు వచ్చే CBDC హోల్ సేల్ లేదా రిటైల్ లేదా రెండింటి కోసమా? హోల్ సేల్ CBDC అంటే ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ కోసం తయారయ్యే డిజిటల్ కరెన్సీ. రిటైల్ CBDC అంటే సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చే డిజిటల్ కరెన్సీ. అయితే ఇది రెండింటికి సంబంధించి ఉండవచ్చునని భావిస్తున్నారు. దీనిని నేరుగా ప్రజలకు జారీ చేస్తే సమర్థవంతంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఆర్బీఐకి మరింత చేరువగా
ఇప్పటి వరకు ప్రజలు బ్యాంకుల్లో ఖాతాలను తెరవడం తెలిసిందే. ఇది బ్యాంకు నోట్లను ప్రత్యక్షంగా, పరోక్షంగా యాక్సెస్ చేయడానికి మాద్యమంగా ఉపయోగపడుతుంది. CBDC ద్వారా నేరుగా ఖాతాలు తెరిచేందుకు, CBDCని ప్రజలకు పంపిణీ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఆర్బీఐ నుండి నేరుగా ఖాతాను తెరిచి, ప్రభుత్వ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేయవచ్చు. CBDCని జారీ చేయడానికి ఇలాంటి ఖాతాలు సృష్టించవచ్చునని పేర్కొన్నారు.
అయితే ఇక్కడ మరో ఆందోళనకర అంశం ఉందని తెలిపారు. ప్రత్యక్ష పంపిణీ నమూనా బ్యాంకింగ్ వ్యవస్థలో అస్థిరతను సృష్టించగలదని పేర్కొన్నారు. CBDCని నేరుగా ప్రజలకు పంపిణీ చేయాలని ఆర్బీఐ భావిస్తే, ప్రజలు తమ డిపాజిట్లను నేరుగా సెంట్రల్ బ్యాంకుకు బదలీ చేసే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. బ్యాంకులు కీలక తమ డిపాజిట్లను కోల్పోతాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications