క్రెడిట్ కార్డు తీసుకోవడానికి కొంతమంది భయపడుతుంటారు. క్రెడిట్ కార్డు ఉంటే ఎక్కువ ఖర్చులు అవుతాయని, వడ్డీ రేటు భారీగా చెల్లించవలసి ఉంటుందని ఆందోళన చెందుతారు. అయితే సకాలంలో చెల్లింపులు జరిపే వారికి, నిబంధనలు పాటించే వారికి క్రెడిట్ కార్డ్ ఎంతో ప్రయోజనకరం. కచ్చితంగా ఉంటే క్రెడిట్ కార్డు తీసుకుంటే లాభమే.

క్రెడిట్ కార్డు తీసుకుంటే...
- వడ్డీ లేకుండా రుణం వస్తుంది.
- ఎమర్జెన్సీ సమయంలో ఆదుకుంటుంది.
- ఆన్‌లైన్ షాపింగ్స్, బిల్లుల చెల్లింపులపై డిస్కౌంట్ వస్తుంది.
- రివార్డు పాయింట్స్ ఉంటాయి.
- క్రెడిట్ కార్డు ఉంటే సుదూరం లిక్విడ్ క్యాష్ తీసుకువెళ్లే పని తప్పుతుంది.

క్రెడిట్ కార్డుల్లో ఎన్నో రకాలు
క్రెడిట్ కార్డుల్లో ఎన్నో రకాలు ఉంటాయి. ఎవరికి అనువైనది వారు ఎంచుకోవడం మంచిది. ఆదాయాన్ని బట్టి క్రెడిట్ కార్డు పరిమితి ఇస్తారు. క్రెడిట్ కార్డు వినియోగిస్తే సకాలంలో బకాయిలు చెల్లించడం తప్పనిసరి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు
క్రెడిట్ కార్డు తీసుకుంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు.. మీరు తీసుకున్న క్రెడిట్ మొత్తాన్ని నిర్ణీత సమయంలోపు చెల్లించకుంటే అధిక వడ్డీ పడుతుంది. దీనిని బాధ్యతారాహిత్యంగా ఉపయోగించవద్దు. చెల్లింపు తేదీని మరిచిపోవద్దు. మీ క్రెడిట్ కార్డును ప్రాపర్‌గా ఉపయోగించకుంటే నెగిటివ్ క్రెడిట్ హిస్టరీ ఉంటుంది. క్రెడిట్ లిమిట్ దాటిపోకుండా జాగ్రత్త పడాలి.

క్రెడిట్ స్కోర్ బాగుంటే..
క్రెడిట్ కార్డుతో అధిక ఛార్జీలు ఉంటాయనేది నాణేనికి ఓ వైపు. అయితే దీనిని సక్రమంగా ఉపయోగిస్తే ప్రయోజనాలు కూడా అలాగే ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే హోమ్ లోన్, పర్సనల్ లోన్‌కు ఎంతో అనుకూలం.

సులభంగా రుణాలు
బ్యాంకుల్లో రుణ అవసరం ఉన్నప్పుడు మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉంటే రుణాలు సులభంగా వస్తాయి. క్రెడిట్ కార్డును ప్రాపర్‌గా ఉపయోగించాలి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తీసుకునే రుణాలపై వడ్డీ రేటు కూడా తగ్గుతుంది.

50 శాతం వరకు వినియోగించుకుంటే..
క్రెడిట్ కార్డు పరిమితిలో 50 శాతం వరకే వినియోగించుకోవడం స్కోరును పెంచుకునే మంచి చర్యగా చెబుతారు. ఇలాంటి వారికి రుణాలు ఇచ్చేందుకు సంస్థలు సానుకూలంగా ఉంటాయి.

వడ్డీ లేకుండా రుణం.. కానీ
వడ్డీరహిత టైమ్ క్రెడిట్ కార్డులో ఉన్న అత్యంత ప్రయోజకర అంశం. క్రెడిట్ కార్డును వినియోగించుకున్న తేదీ నుంచి 45 రోజులకు అటు ఇటుగా బ్యాంకును బట్టి వడ్డీరహిత కాలం ఉంటుంది. ఈ కాల వ్యవధి దాటకుండా చెల్లింపులు జరపాలి. సకాలంలో చెల్లించకుంటే మాత్రం భారీ వడ్డీ చెల్లించవలసి వస్తుంది.

ఆఫర్లు...
కార్డు చెల్లింపులు చాలా వేగంగా పెరిగాయి. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డుల ద్వారా జీరో వడ్డీతో ఈఎంఐ చెల్లింపులకు అవకాశముంది. ఈఎంఐ కొనుగోళ్లపై డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డును వినియోగించేటప్పుడు మన లిమిట్ సహా అన్ని ఆలోచించుకొని ఖర్చు చేయాలి.

చెల్లింపులు
క్రెడిట్ కార్డు ద్వారా ప్రతి నెల నిర్ణీత తేదీలో బిల్లులు చెల్లించేలా సెట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అలాంటప్పుడు వివిధ చెల్లింపుల్లో లేట్ ఫీజు పడకుండా చెల్లింపులు పూర్తి చేసుకోవచ్చు. ఇన్సురెన్స్ సహా వివిధ రకాల చెల్లింపులు చేసుకోవచ్చు.

ఆర్థిక క్రమశిక్షణ
క్రెడిట్ కార్డు తీసుకునేముందు.. ఆర్థిక క్రమశిక్షణ ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డు చెల్లింపులు గడువులోగా చెల్లించకుంటే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అప్పుడు రుణాలు లభించడం కష్టం కావడం లేదా వడ్డీ ఎక్కువ పడటం జరుగుతుంది.

ఉపయోగిస్తే బెట్టర్
క్రెడిట్ కార్డును తీసుకొని.. ఉపయోగించకుండా ఉంటే ప్రయోజనం ఏమీ ఉండదు. అలాగే అవసరం ఉంటేనే ఒకటికి మించి కార్డులు తీసుకోవాలి. క్రెడిట్ కార్డులు తీసుకున్నప్పుడు ఉపయోగించడం.. అలాగే నిర్ణీత తేదీల్లో చెల్లింపులు జరిపితేనే ప్రయోజనం.

పరిమిత.. క్రెడిట్ లిమిట్
క్రెడిట్ కార్డు లిమిట్‌ను కంపెనీలు నిర్ణయిస్తాయి. ఎక్కువ లిమిట్‌తో ఇబ్బంది అనుకుంటే మీకు ఎంత వరకు సాధ్యమో అంతే తీసుకోవడం మంచిది. చెల్లింపులు సకాలంలో చేస్తూ వెళ్తుంటే కూడా క్రెడిట్ లిమిట్స్ పెంచుతాయి. అవసరం లేదనుకుంటే క్రెడిట్ లిమిట్ పెంచవద్దని కోరవచ్చు.

కార్డుల్లో వివిధ రకాలు
క్రెడిట్ కార్డులు వివిధ రకాలుగా ఉంటాయి. కార్డులను బట్టి ప్రయోజనాలు కూడా మారుతాయి. ఫీజులు, రివార్డ్ పాయింట్స్ ఆధారంగా మీకు కావాల్సిన కార్డును ఎంచుకోవాలి. క్రెడిట్ కార్డుకు బానిస కావొద్దు. కార్డుల్లోను ప్రత్యేకంగా ఇంధనం నింపినప్పుడు, రెస్టారెంట్లలో చెల్లింపులు చేసినప్పుడు.. ఇలా వివిధ సందర్భాలలో రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మీ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలి. కొన్ని కార్డుల్లో... ఒక్కో కార్డుపై ఒక్కో రకమైన ప్రయోజనం ఉంటుంది.

కార్డులు ఎన్ని ఉండాలంటే?
కార్డులు ఒకటి నుంచి రెండు మూడు కంటే ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది.. ఒకటి లేదా రెండు కార్డుల మేరకు మన అవసరాలు ఉంటే మూడు కార్డులు తీసుకొని.. మూడో కార్డును ఉపయోగించకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. రెండోది... అవసరం లేకపోయినా ఎక్కువ కార్డులు ఉంటే చెల్లింపుల విషయంలో కన్ఫ్యూజన్ అయ్యే అవకాశాలుంటాయి.

ఆ తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి
ఒకటి రెండుసార్లకు మించి క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోకపోవడం మంచిది. తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంటేనే తీసుకోవాలి. క్రెడిట్ కార్డును తీసుకునే ముందు తొలుత క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సరి చేసుకొని ముందుకు వెళ్లాలి. పాత బకాయిలు ఉంటే వాటిని తీర్చి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి.

సామర్థ్యం చూసి క్రెడిట్ కార్డులు..
క్రెడిట్ కార్డు ఇచ్చేముందు.. కార్డుదారు చెల్లింపులు చేయగలడా అని చూస్తారు. ఎక్కువ రిస్కు, తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉంటే కార్డుకు నో చెబుతాయి. బిజినెస్, స్వయం ఉపాధి రంగంలోని వారికి ఈ డిఫాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications