మీకు ఒకటికి మించి బ్యాంకు ఖాతాలు ఉన్నాయా? సాధారణంగా ఉద్యోగుల వేతనం ఒక ఖాతాలా జమ అవుతుంది. అందులో నుండి అన్ని ఖర్చులు, ఈఎంఐలు తదితర ఖర్చులు చెల్లిస్తారు. అయితే వేతన ఖాతాతో పాటు ఖర్చుల కోసం మరో ఖాతాను ఉపయోగిస్తే మీరు ఖర్చులను అదుపు చేసే అవకాశాలు ఉంటాయి. నెల ప్రారంభంలో వేతనం పడిన కొద్ది రోజుల్లోనే గ్రాసరీ ఖర్చు, ఈఎంఐ చెల్లింపులు తదితర ఖర్చులు ఉంటాయి. చాలామందికి వేతనం పడిన వారంలోనే ఖాతాలో ఖాళీ కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్లీ రుణాలకు వెళ్లవలసిన పరిస్థితి ఉంటుంది.
ఒకే ఖాతా నుండి ఆదాయం, ఖర్చులు ఉంటే ఆర్థిక క్రమశిక్షణ తగ్గుతుంది. కాబట్టి వేతనం కోసం ఓ ఖాతా ఉండగా, ఖర్చుల కోసం మరో ఖాతా ఉండటం మేలు అని ఆర్థిక నిపుణుల సూచన. వేతనం రాగానే ఖర్చుల ఖాతాలోకి డబ్బులు అవసరమైన మేరకు బదలీ చేయాలని సూచిస్తున్నారు.

అవసరమైతే తప్ప
బీమా ప్రీమియం, నిత్యావసర వ్యయాలు చెల్లించేందుకు వేతన ఖాతాను ఉపయోగించడానికి బదులు మరో సేవింగ్స్ ఖాతాను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకే అకౌంట్ నుండి డబ్బులు బయటకు వెళ్తుంటే వాటిని లెక్కించడం లేదా పరిశీలించడం చాలా సులభం.
తొలుత మన ఇన్వెస్ట్‌మెంట్, లోన్ ఈఎంఐ ల కోసం కేటాయించారు. ఆ తర్వాత నెలవారీ బడ్జెట్ ఎంతో చూసుకోవాలి. ఈ మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాలోకి ట్రాన్సుఫర్ చేసుకొని, ప్రణాళికతో ఖర్చు చేసుకోవాలి. వేతన ఖాతాలోని మొత్తాన్ని అత్యంత అవసరమైతే మాత్రం ముట్టవద్దు. అప్పుడు మీ పొదుపు పెరుగుతుంది.

రివార్డ్ పాయింట్స్
ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్ వినియోగిస్తే రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఉంటాయి. వేతన ఖాతా, సేవింగ్స్ ఖాతా.. ఎందులో రివార్డ్ లేదా క్యాష్ బ్యాక్ ఎక్కువగా ఉంటే దానిని ఉపయోగించాలి.
శాలరీ అకౌంట్ నుండి డెబిట్ కార్డుతో చేసే చెల్లింపుల ద్వారా అధిక ప్రయోజనాలు ఉంటే అలాగే చేయాలి. మిగతా ఖర్చుల కోసం సేవింగ్స్ ఖాతాకు మళ్లించాలి. అలాగే, కొన్ని బ్యాంకులు సేవింగ్స్ ఖాతా, శాలరీ ఖాతాపై వడ్డీని వేర్వేరుగా ఇస్తాయి. ఎందులో ఎక్కువగా ఉంటే దానిని ఉపయోగించాలి.

వివిధ రకాల ఖాతాలు, కార్డులు
చాలామందికి వివిధ రకాల ఖాతాలు ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్, శాలరీ అకౌంట్‌తో పాటు బిజినెస్ చెకింగ్ అకౌంట్, ప్రైమరీ స్పెండింగ్ అకౌంట్, రిజర్వ్ స్పెండింగ్ అకౌంట్, ఎమర్జెన్సీ ఫండ్ సేవింగ్స్ అకౌంట్, బిజినెస్ క్రెడిట్ కార్డు, ట్రావెల్ రివార్డ్ క్రెడిట్ కార్డు, క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ వంటివి ఉంటాయి.


Click it and Unblock the Notifications