మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్.. అంటే ఒకటికి మించి బ్యాంకు ఖాతాలు ఉంటే మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీయకపోవచ్చు. కానీ ఆస్కారం లేకుండా మాత్రం ఉండదు. అందుకే అవసరమైతే తప్ప, వివిధ కారణాలతో వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభించడం మంచిది కాదని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. కొంతమంది వేతనాల కోసం, రుణాల కోసం, డీమ్యాట్ కోసం అంటూ మూడు నాలుగు.. అంతకుమించి కూడా ఖాతాలు ఓపెన్ చేస్తారు.
ఉద్యోగం మారినప్పుడు ఒక బ్యాంకు నుండి మరో బ్యాంకుకు కూడా ఖాతాను మార్చే వారు ఉంటారు. అయితే అనవసరంగా లెక్కకు మించి అకౌంట్స్ ఉంటే వాటన్నింటిలోను యాక్టివ్‌గా ఉండలేం. మినిమం బ్యాలెన్స్ లేకుంటే ఛార్జీలు పడతాయి. అంటే యాక్టివ్‌గా లేకున్నప్పటికీ కనీస మొత్తం అందులో ఉండేలా చూసుకోవాలి. అందుకే అనవసర సందర్భాల్లో మల్టిపుల్ ఖాతాలు సరికాదని సూచిస్తున్నారు.

రూ.20వేలకు మించి ఉండాల్సిందే
ఎక్కువ ఖాతాలు ఉంటే అన్ని ఖాతాల్లోను కొంత డిపాజిట్ చేయాలి. కొన్ని బ్యాంకుల్లో రూ.1000కి పైన, చాలా బ్యాంకుల్లో మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రూ.5000 నుండి రూ.10వేల వరకు ఉంది. మీకు మూడు నాలుగు ఖాతాలు ఉంటే కనీసం రూ.20వేల నుండి అంతకంటే ఎక్కువ బ్యాంకుల్లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
ఒక బ్యాంకు ఖాతాను అసలు ఉపయోగించకుంటే మూసివేయడం మంచిది. బ్యాంకుల్లో ఉన్న మినిమం బ్యాలెన్స్ పైన మూడు శాతం నుండి నాలుగు శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. దానిని FD చేస్తే అంతకు రెట్టింపు వస్తుంది.

ఛార్జీలు ఇలా..
సేవింగ్స్ అకౌంట్ పైన ఇతర ఛార్జీలు వర్తిస్తాయి. అంటే డెబిట్ కార్డ్ ఛార్జీలు వంటివి ఉంటాయి. మీ శాలరీ అకౌంట్ లేదా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్‍లో వరుసగా 3 నెలలు ఎలాంటి డిపాజిట్స్ లేకుంటే ఆ తర్వాత అది సాధారణ సేవింగ్స్ అకౌంట్‌గా మారుతుంది. అప్పుడు మినిమం బ్యాలెన్స్ తప్పనిసరి.
అకౌంట్ నుండి వరుసగా రెండేళ్ల పాటు ఎక్కువ కాలం ట్రాన్సాక్షన్స్ చేయకుంటే దానిని బ్యాంకులు డీ-యాక్టివేట్ చేస్తాయి. అప్పుడు ఖాతా నుండి డెబిట్ కార్డు, చెక్కులు, ఆన్ లైన్, మొబైల్ ట్రాన్సాక్షన్స్ జరపలేరు. ఖాతాను యాక్టివేట్ చేయడానికి రాతపూర్వకంగా ఇవ్వాలి. ఐటి రిటర్న్స్ సమయంలో అన్ని ఖాతాల వివరాలు కూడా అందించవలసి ఉంటుంది.

ఇలా చేయడం మంచిది
బ్యాంకు ఖాతాలు అవసరమైనంత మేరకు లేదా తక్కువగా ఉండాలి. శాలరీ ఖాతా లేదా పర్సనల్ ఖాతాతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి జాయింట్ అకౌంట్ ఉంటే మంచిది. యజమాని అందుబాటులో లేనప్పుడు ఇతరులు డబ్బును తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడుల కోసం పర్మినెంట్ ఖాతాను ఉపయోగించాలి.
ఉద్యోగం మారినప్పుడు బ్యాంకు అకౌంట్స్ మారుతుంటాయి. అవసరం లేని ఖాతాలు మూసివేయడం మంచిది. ఈపీఎఫ్ ఖాతాకు ఒక యూఏఎన్ ఉంటుంది. ఉద్యోగం మారినప్పుడు అదే యూఎన్ఏతో ఖాతాలోని మొత్తాన్ని ఇతర సంస్థకు బదలీ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ వంటి పెట్టుబడులకు ఒక ఖాతాను ఉపయోగించాలి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications